అమేథీః కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ రాహుల్ గాంధీ మూడు రోజుల అమేథీ పర్యటనకు సన్నాహాలు చేస్తున్నారు. ఆగస్టు 31 నుంచీ ఆయన పార్లమెంటరీ నియోజక వర్గంలో పర్యటించనున్నారు. ఇందులో భాగంగా బుధవారం రాత్రికి రాహుల్ అమేథీ చేరుకోనున్నట్లు జిల్లా కాంగ్రెస్ ఛీఫ్ యోగేంద్ర మిశ్రా తెలిపారు. మర్నాడు ఆయన మున్షిగంజ్ గెస్ట్ హౌస్ లో స్థానిక ప్రజలను కలుసుకుంటారని, తర్వాత జగదీష్ పూర్ అసెంబ్లీ సెగ్మెంట్ లోని జఫర్ గంజ్ లో జరిగే బహింరంగ సభలో పాల్గొని ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తారని తెలిపారు.
మూడు రోజుల పర్యటనలో భాగంగా రాహుల్ కొన్ని గ్రామాలను కూడా సందర్శించనున్నట్లు మిశ్రా వెల్లడించారు. పర్యటనలో మూడవ రోజైన సెప్టెంబర్ 2వ తేదీన రాహుల్ ఢిల్లీకి పయనమయ్యే ముందుగా జిల్లా విజిలెన్స్ మానెటరింగ్ కమిటి సమావేశంలో కూడా పాల్గోనున్నట్లు పేర్కొన్నారు.