న్యూఢిల్లీ : రైల్వేల అభివృద్ధితోనే దేశాభివృద్ధి జరుగుతుందని రైల్వేమంత్రి సురేశ్ ప్రభు అన్నారు. భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకునే రైల్వే బడ్జెట్ను రూపొందించినట్లు తెలిపారు. పరిశుభ్రత, వేగవంతమైన రైళ్లే లక్ష్యమని ఆయన గురువారమిక్కడ అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రైల్వేల అభివృద్ధికి దృఢ సంకల్పంతో ఉన్నారని సురేశ్ ప్రభు తెలిపారు. కాగా సురేశ్ ప్రభు తొలిసారిగా ఈ రోజు మధ్యాహ్నం 12 గంటలకు లోక్ సభలో రైల్వే బడ్జెట్ను ప్రవేశపెట్టన్నారు. కాగా ఛార్జీల పెంపు లేదంటూ మంత్రి సంకేతాలు ఇచ్చారు.
మరోవైపు నాల్గవరోజు పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు హాట్‌హాట్‌గా సాగనున్నాయి. కీలకమైన రైల్వే బడ్జెట్‌ను కేంద్రం ప్రవేశపెట్టనుండడంతో ....అందరి దృష్టి కేంద్ర మంత్రి సురేశ్ ప్రభుపైనే పడింది. ఆయా రాష్ట్రాలకు ఏఏ అంశాల ప్రాతిపదికన కేటాయిస్తారనేది ఉత్కంఠను రేకెత్తిస్తోంది. మరోవైపు భూసేకరణ ఆర్డినెన్స్‌ను వ్యతిరేకిస్తూ విపక్షాలు ఆందోళనకు దిగాయి. అవసరమైతే రైల్వే బడ్జెట్‌నైనా అడ్డుతీరాలని నిర్ణయించుకున్నాయి.
రైల్వేల అభివృద్ధితోనే దేశాభివృద్ధి: సురేశ్ ప్రభు
Published Thu, Feb 26 2015 10:37 AM | Last Updated on Sat, Sep 2 2017 9:58 PM
Advertisement
Advertisement