rail budget-2015
-
లోక్‌సభలో ప్రధాని మోదీ ప్రసంగం
-
దిశానిర్దేశం లేని రైల్వే బడ్జెట్ ఇది..
-
రైల్వే బడ్జెట్లో హామీల ఊసే లేదు..
-
బడ్జెట్ ప్రకంపనలు
న్యూఢిల్లీ : మొత్తానికి ఊహించినట్టుగానే చార్జీల బాదుడు లేకుండానే రైల్వేబడ్జెట్ ముగిసింది. రైల్వేల మీద ఒత్తిడి ఎక్కువగా ఉంది... నిధులు వస్తే సేవలు మెరుగుపడతాయంటూ సాగిన రైల్వేమంత్రి సురేశ్ ప్రభు ప్రసంగంలో పెండింగ్ ప్రాజెక్టులకు ప్రాధాన్యత, మహిళలకు అదనపు భద్రత, వికలాంగులకు, పురుషులకు అదనపు సౌకర్యాలు, వై- ఫై, వినోదం, కొత్త హెల్ప్ లైన్, రైళ్ల వేగం పెంపులాంటి మెరుపులు కనిపించాయి. అయితే సరుకు రవాణా చార్జీలు భారీగా పెరగనున్నాయని సమాచారం. రైల్వేబడ్జెట్‌పై దేశవ్యాప్తంగా పొగడ్తలు.. విమర్శలు, ఆరోపణలు మొదలయ్యాయి. సమాజ్‌వాదీ అధ్యక్షుడు ములాయంసింగ్ యాదవ్ రైల్వేబడ్జెట్ హంగులూ, ఆర్భాటాలు లేకుండా ఉందని అభినందించారు. గత బడ్జెట్లలో ఉన్న పెండింగ్ ప్రాజెక్టులను పూర్తిచేయడంపై దృష్టిపెట్టాలని కోరారు. కొత్త ప్రాజెక్టులను ప్రకటించడం కాకుండా, పెండింగ్ ప్రాజెక్టులను పూర్తిచేస్తామని హామీ ఇచ్చి మంచి పని చేశారన్నారు. బీజేపీ సోదరసంస్థ శివసేన రైల్వే బడ్జెట్‌పై పూర్తి అసంతృప్తిని వ్యక్తం చేసింది. పెండింగ్ ప్రాజెక్టులు పూర్తిచేయడానికి నిధులు ఎలా సేకరిస్తారని ప్రశ్నించింది. అంతా మాయ తప్ప ఏమీ లేదని శివసేన సీనియర్ నాయకుడు, ఎంపీ గజానన్ కీర్తికార్ విమర్శించారు. విభజన నేపథ్యంలో తమ రాష్ట్రాలకు ఎంతో కొంత మేలు జరుగుతుందని ఆశించాయి తెలుగు రాష్ట్రాలు. కానీ అంతులేని నిరాశే మిగిలింది. దీనిపై నిరసన వెల్లువెత్తుతోంది. ఈసారి బడ్జెట్లో నిధులు కేటాయించకపోవడాన్ని నిరసిస్తూ తెలంగాణ సీపీఐ ఆధ్వర్యంలో నిజామాబాద్‌లో ధర్నా నిర్వహించారు. పెండింగ్‌లో ఉన్న రైల్వేజోన్, రైల్వేలైన్ల ప్రస్తావన లేదని నేతలు మండిపడ్డారు. ఇది సామాన్యప్రజలకు అనుకూలమైందంటూ రైల్వే బడ్జెట్ ను స్వాగతిస్తూనే కొత్త రైళ్లు, కొత్త లైన్లు కేటాయించకపోవడంపై ఏపీ సీపీఐ కార్యదర్శి రామకృష్ణ అభ్యంతరం వ్యక్తం చేశారు. విశాఖకు రైల్వేజోన్ఎందుకు ప్రకటించలేదని ప్రశ్నించారు. -
రైల్వే బడ్జెట్ 2015-16 విశేషాలివీ!
-
రైల్వే బడ్జెట్‌పై ప్రజాభిప్రాయాలు..
-
రైల్వే బడ్జెట్లో కొత్తదనమేమీ లేదు!
-
రైల్వే ఛార్జీలు పెంచబోం అంటూనే..!
-
చార్జీలు పెంచట్లేదంటూనే దొడ్డిదారిన మోతలు
న్యూఢిల్లీ : రైల్వే ఛార్జీలు పెంచట్లేదంటూనే రైల్వే శాఖ మంత్రి సురేశ్ ప్రభు ...దొడ్డిదారిన మోత మోగించారు. సరకు రవాణా ఛార్జీల్లో కాసింత సవరణలు ఉంటాయని ఆయన చెప్పటం విశేషం. దాంతో రద్దీ ఉన్న మార్గాల్లో సరకు రవాణా ఛార్జీలు పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. సిమెంట్, బొగ్గు, ఉక్కు రవాణా ఛార్జీలు పెరిగే అవకాశం ఉంది. ఈ ఏడాది ఏప్రిల్ 1వ తేదీ నుంచి సరకు రవాణా ఛార్జీలు పెరగనున్నాయి. బొగ్గు రవాణా ఛార్జీ 6.3 శాతం, సిమెంట్ 2.7 శాతం, యూరియ 10 శాతం, పెట్రోలియం ఉత్పత్తుల రవాణా ఛార్జీలు 1 శాతం మేర పెరిగే ఛాన్స్ ఉంది. -
తెలుగు రాష్ట్రాలకు మొండిచేయి
న్యూఢిల్లీ : రైల్వే బడ్జెట్‌పై కోటి ఆశలతో ఎదురుచూసిన తెలంగాణా, ఆంధ్ర ప్రజలకు మొండి చేయి ఎదురైంది. తెలుగు రాష్ట్రాలపై కొత్తమంత్రి సురేశ్ ప్రభు కూడా కనికరం చూపలేదు. రైల్వేమంత్రి సురేశ్ ప్రభు గురువారం లోక్ సభలో ప్రవేశపెట్టిన 2015 రైల్వే బడ్జెట్లో కొత్త రైళ్లూ లేవూ.. కొత్త లైన్లూ లేవు. రెండు రాష్ట్రాలకు చెందిన పలువురు ఎంపీలు చేసిన ప్రతిపాదనలన్నీ బుట్ట దాఖలయ్యాయి. విశాఖ, తిరుపతి రైల్వే జోన్లు ఏర్పాటు చేయాలన్న డిమాండ్‌ను మంత్రి అసలు పట్టించుకున్న పాపాన పోలేదు. వై ఫైలూ, ఎంటర్ టైన్ మెంటూ తప్ప, బడ్జెట్లో ఏమీ లేదని జనం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాజీపేట-విజయవాడ మధ్య మూడో రైల్వే లైన్ ఏర్పాటు ఒక్కటే గుడ్డిలో మెల్ల. పెండింగ్ ప్రాజెక్టులకు ప్రాధాన్యతనిస్తామని ఆర్భాటంగా ప్రకటించిన మంత్రి, తెలుగు రాష్ట్రాల్లో దశాబ్దాలుగా పెండింగ్ లో ప్రాజెక్టుల ఊసే ఎత్తలేదు. ఆదాయంలో అగ్రభాగాన నిలిచే దక్షిణ మధ్య రైల్వేస్ .. కేటాయింపుల్లో శూన్యంగా మిగిలిపోయింది. మరోవైపు ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో ఇచ్చిన హామీలను కూడా కేంద్రం పట్టించుకోలేదు. -
కరుణించని 'ప్రభు'...ఒక్క కొత్త రైలు లేదు..
న్యూఢిల్లీ : రైల్వే బడ్జెట్‌పై ఎన్నో ఆశలు పెట్టుకున్న వారికి సురేష్ ప్రభు ఏ మాత్రం కరుణ చూపలేదు. రైల్వే బడ్జెట్‌పై విపక్షాలు తీవ్రస్థాయిలో నిరసన వ్యక్తం చేశాయి. కేంద్రమంత్రి సురేశ్ ప్రభు ప్రవేశపెట్టిన రైల్వే బడ్జెట్లో ఒక్క కొత్త రైలు కానీ, కొత్త జోన్ కానీ లేదు. ప్రతిపాదనలు, కేటాయింపుల ప్రస్తావన లేకుండా రైల్వే బడ్జెట్ ప్రసంగం ముగిసింది. గతానికి భిన్నంగా రైల్వేల గురించి మాత్రమే సురేశ్ ప్రభు ప్రసంగించారు. మరోవైపు సురేశ్ ప్రభు ప్రవేశపెట్టి రైల్వే బడ్జెట్లో నాలుగు ప్రధాన లక్ష్యాలు *వినియోగదారుల సంతృప్తి *రైల్వేల మెరుగైన భద్రత *రైల్వేల ఆధునీకరణ * ప్రయాణికుల సంఖ్య 3 కోట్లకు పెంచటం -
2015-16 రైల్వే బడ్జెట్ హైలైట్స్ - Part 2
-
2015-16 రైల్వే బడ్జెట్ హైలైట్స్-2
న్యూఢిల్లీ : లోక్ సభలో గురువారం కేంద్రమంత్రి సురేశ్ ప్రభు ప్రవేశపెడుతున్న రైల్వే బడ్జెట్ వివరాలు.... *గత ఏడాది కంటే 84 శాతం పెట్టుబడులు పెంపు * ప్రయాణికుల సౌకర్యానికి ఎంపీ నిధులు ఉపయోగించవచ్చు *గుర్తించిన కొన్ని రైళ్లలో జనరల్ బోగీల పెంపు * కాజీపేట-విజయవాడ మధ్య మూడో రైల్వేలైన్ ఏర్పాటు *పీపీపీ ద్వారా నిధులు సమీకరించే యత్నాలు *రైల్వే ఓవర్ బ్రిడ్జ్‌ల నిర్మాణానికి 60 రోజుల్లో అనుమతి *రైల్వేల అభివృద్ధికి ఓపెన్ బిడ్ ఆహ్వానం * ప్రమాదాల నివారణకు ఇస్రో సాయం *రైల్వేల్లో మేకిన్ ఇండియాకు ప్రాధాన్యత * ఇంధన పొదుపుకు రైల్వేల విద్యుద్దీకరణ * ఈశాన్య రాష్ట్రాలకు మరింత కనెక్టివిటీ *4 రైల్వే రీసెర్చ్ కేంద్రాలు * రైళ్లల్లో శాఖాహారులకు ప్రత్యేక వంటకాలు * రైళ్లలో అగ్నిప్రమాద నివారణకు కొత్త టెక్నాలజీ * మేక్ ఇన్ ఇండియాతో ఉద్యోగాల కల్పన * మేఘాలయకు ఢిల్లీ నుంచి రైలు ఏర్పాటు * కొన్ని శతాబ్ధి రైళ్లలో ఎంటర్టైన్మెంట్ కార్యక్రమాలు * పేపర్ లెస్ టిక్కెటింగ్ వ్యవస్థను విస్తృతం చేస్తాం * కొన్ని రూట్లలో బుల్లెట్ రైళ్లు ప్రవేశపెట్టే యోచన * స్వచ్ఛ్ భారత్ స్పూర్తితో స్వచ్ఛ్ * మార్చి నుంచి రైల్వేలో... 138 కొత్త హెల్ప్ లైన్ * గూడ్స్ బోగీలు అద్దెకు ఇచ్చే సౌకర్యం *బడ్జెట్లో 67 నిధులు ప్రయాణికుల సౌకర్యాల కోసం కేటాయింపు * స్పీడ్ రైళ్లపై నివేదిక రాగానే పనులు ప్రారంభం * జమ్ము కాశ్మీర్ కు ప్రత్యేక రైల్వే లైన్లు * 61 మార్గాల్లో రైల్ కమ్ రోడ్డు టిక్కెట్లు * 9400 కిలోమీటర్లలకు గేజ్ మార్పిడి * స్టీల్, బొగ్గు రవాణకు కొత్త రైల్వే లైన్లు * ప్రధాన రైల్వే స్టేషన్లలో ఎస్కలేటర్లు * మహిళలు, గర్భిణులకు, వృద్ధులకు లోయర్ బెర్త్‌లు * 120 రోజుల ముందుగానే టిక్కెట్లు రిజర్వేషన్ * A-గ్రేడ్ రైల్వే స్టేషన్లలో ఉచిత వైఫై (400 రైల్వే స్టేషన్లు) *మహిళా బోగీల్లో సీసీ కెమెరాలు, మహిళా కోచ్‌ల ఏర్పాటు * ముఖ్య నగరాల్లో శాటిలైట్ స్టేషన్లు * అప్పర్ బెర్త్‌లు మరింత సౌకర్యవంతంగా ఉండేలా చర్యలు * డిమాండ్‌కు అనుగుణంగా కోచ్‌లు పెంచేందుకు కృషి -
మహిళలకు మరింత భద్రత
న్యూఢిల్లీ: రైల్వే బడ్జెట్లో మహిళా ప్రయాణీకులపై వరాల జల్లు కురిపించారు మంత్రి సురేశ్ ప్రభు. మహిళల భద్రత కోసం టోల్ ఫ్రీ నెం. 182 ను ప్రకటించారు. మహిళా రక్షణ కోసం బోగీల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు.. మహిళా కోచ్ ల పెంపు. వృద్ధులకు , వికలాంగులకు ఆధునిక సౌకర్యాలు..ఆనలైన్ లో వీల్ ఛైర్ బుక్ చేసుకునే సౌలభ్యం. మహిళలకు, వృద్ధులకు లోయర్ బెర్తులు కేటాయించే ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించారు. మహిళా బోగీల్లో సౌకర్యాల పెంపుకోసం నిర్భయ ఫండ్ కింద నిధులను కేటాయించనున్నట్టు మంత్రి ప్రకటించారు. -
2015-16 రైల్వే బడ్జెట్ హైలైట్స్ - Part 1
-
పేరు గొప్ప ఊరు దిబ్బ...మన రైల్వే
న్యూఢిల్లీ: భారతీయ రైల్వే కోసం ప్రతి ఏటా ప్రత్యేక బడ్జెట్లను ప్రవేశపెడుతున్నప్పటీకి పరిస్థితి మాత్రం నానాటికి తీసుకట్టుగానే మారుతోంది. ప్రపంచంలో అత్యంత పురాతన, అతి పెద్ద రైల్వే వ్యవస్థల్లో ఒకటిగా పేరు ‘కూత’ పెడుతున్నా ‘పేరుగొప్ప ఊరుదిబ్బ’ చందంగానే ఉంటోంది. స్వాతంత్య్రానికన్నా ముందే పురుడు పోసుకున్న మన రైల్వే వ్యవస్థ చాలా కాలం వరకు ప్రపంచంలోకెల్లా అతిపెద్ద వ్యవస్థగానే మనగలిగింది. చైనా, యూరప్ లాంటి దేశాలు ప్రజా రవాణా కింద రైల్వే వ్యవస్థల అభివృద్ధికి అధిక ప్రాధాన్యం ఇవ్వడంతో అవి మనకంటే వేగంగా ముందుకు దూసుకెళ్లాయి. ప్రస్తుతం రైల్వే నెట్వర్క్ విస్తరణలో ప్రపంచంలోనే చైనా అగ్రగామిగా నిలవగా మన భారతీయ రైల్వే వ్యవస్థ నాలుగవ స్థానంలో ఉంది. ఇక రైళ్లలో అత్యాధునిక సౌకర్యాల విషయం గురించి మాట్లాడితే మన వ్యవస్థ సోదిలోకి కూడా రాదని చెప్పవచ్చు. మన రైల్వే వ్యవస్థకు సంబంధించి కొన్ని ఆసక్తికరమైన అంశాలు.... 1. చైనా రైల్వే వ్యవస్థ లక్ష కిలోమీటర్లు విస్తరించగా, భారతీయ రైల్వేల విస్తరణ నేటికి 64,460 కిలోమీటర్లు. మన రైల్వే ప్రతి ఏడాది సరాసరి 200 కిలోమీటర్ల వరకు మాత్రమే విస్తరిస్తోంది. స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి ఇప్పటివరకు, అంటే...దాదాపు 68 ఏళ్ల కాలంలో 13 వేల కిలోమీటర్ల రైలు మార్గాలను మాత్రమే నిర్మించుకున్నాం. 2. హిమాలయాల్లోని బారముల్లా నుంచి తమిళనాడులోని కన్యాకుమారి వరకు విస్తరించిన రైల్వే వ్యవస్థలో రోజుకు 12,617 ప్యాసింజర్ రైళ్లు, 7,421 రవాణా రైళ్లు తిరుగుతున్నాయి. దేశవ్యాప్తంగా 7,172 రైల్వే స్టేషన్లు ఉన్నాయి. పదమూడున్నర లక్షల ఉద్యోగులు పని చేస్తున్నారు. 3. ప్రస్తుతానికి 360కి పైగానె పెండింగ్ ప్రాజెక్టులున్నాయి. వీటిని పూర్తి చేయడానికి గతంలో వేసిన అంచనాల ప్రకారం 1.82 లక్షల కోట్ల రూపాయలు అవసరం. గత 30 ఏళ్ల కాలంలో 676 మంజూరైన ైరె ల్వే ప్రాజెక్టుల్లో 1.58 లక్షల కోట్ల రూపాయలతో 317 ప్రాజెక్టులను మాత్రమే పూర్తి చేశారు. 4. మన రైల్వేకు వస్తున్న రెవెన్యూకు వ్యయానికి పెద్ద వత్యాసం లేకపోవడం వల్ల పెండింగ్ ప్రాజెక్టులకు వనరులను సమకూర్చుకోలేక పోతున్నాం. వస్తున్న రెవెన్యూలో రైల్వేల నిర్వహణ వ్యయం 94 శాతం. అంటే వస్తున్న లాభం ఆరు శాతం మాత్రమే. రెవెన్యూకు వ్యయానికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న వ్యత్యాసం 75 నుంచి 80 శాతం. 5. రైల్వేకు ప్రతి ఏటా 26 వేల కోట్ల రూపాయల నష్టం వస్తోంది. వార్షికాదాయం 1.40 లక్షల కోట్లు మాత్రమే. ఇది ప్రభుత్వరంగ సంస్థలయిన భారతీయ రైల్వే కార్పొరేషన్, చమురు సహజ వాయువుల సంస్థ కన్నా తక్కువ. అందుకని రైల్వేల మనుగడకు జనరల్ బడ్జెట్ కేటాయింపులపై ఆధారపడాల్సి వస్తోంది. -
'రైళ్లల్లో మహిళా భద్రతకు టోల్ ఫ్రీ నెంబర్ 182'
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం తాజాగా ప్రవేశపెట్టిన రైల్వే బడ్జెట్ లో మహిళ భద్రతపై కూడా దృష్టి పెట్టింది. రైళ్లలో ప్రయాణిస్తున్న మహిళా భద్రతకు టోల్ ఫ్రీ నెంబర్ 182 ను కేటాయించారు. రైళ్లలో ప్రయాణించే మహిళలు ప్రమాదం బారిన పడినప్పుడు తక్షణ సాయం పొందేందుకు ఈ నెంబర్ ను ప్రవేశపెట్టినట్లు రైల్వే మంత్రి సురేష్ ప్రభు తెలిపారు. దాంతో పాటు రైళ్లలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయనున్నట్లు ఆయన తెలిపారు. గురువారం రైల్వే మంత్రి సురేష్ ప్రభు సభలో రైల్వే బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. ముందుగా మాట్లాడిన ఆయన ప్రధాని నరేంద్ర మోదీకి కృతజ్ఞతలు తెలిపారు. తరువాత ఎప్పటి మాదిరిగానే సుదీర్ఘ ప్రసంగాన్ని చదివిన ఆయన అందర్నీ అలరించేలా బడ్జెట్ ఉంటుందని తెలిపారు. రైల్వే కష్టాలకు చరమ గీతం పాడాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా సురేష్ ప్రభు పేర్కొన్నారు. -
2015-16 రైల్వే బడ్జెట్ హైలైట్స్
న్యూఢిల్లీ : కేంద్రమంత్రి సురేశ్ ప్రభు తొలిసారి లోక్ సభలో గురువారం 2015-16 రైల్వే బడ్జెట్ ప్రవేశపెట్టారు. పరిశుభ్రత, రైల్వే భద్రతకు పెద్దపీట వేస్తామని ఆయన తెలిపారు. రైల్వేల అభివృద్ధితోనే దేశాభివృద్ధి అని సురేశ్ ప్రభు తెలిపారు. (రైల్వే బడ్జెట్ పూర్తి పాఠం ఇంగ్లీషులో) రైల్వే బడ్జెట్ ముఖ్యాంశాలు.... * రైళ్ల రాకపోకలపై ఎస్ఎంఎస్ సదుపాయం *తక్కువ ధరకే తాగునీరు * సాధారణ బోగీల్లో మొబైల్ ఛార్జింగ్ సదుపాయం * రాజధాని ఎక్స్‌ప్రెస్‌ల వేగాన్ని పెంచేందుకు కృషి * రైల్వే ప్రాజెక్టుల నిర్మాణంలో రాష్ట్రాల సహకారం తీసుకుంటాం * రైళ్లలో నాణ్యమైణ ఆహారం అందించేందుకు కృషి * ఆరు నెలల్లో 17వేల బయో టాయిలెట్స్ నిర్మాణం * ప్రయాణికులు అయిదు నిమిషాల్లో టిక్కెట్ పొందే ఏర్పాటు * 650 స్టేషన్లలో కొత్తగా టాయిలెట్స్ నిర్మాణం * రైళ్లలో బయో టాయిలెట్స్ నిర్మాణం * రైళ్లల్లో మహిళా భద్రతకు టోల్ ఫ్రీ నెంబర్ 182 * బ్యాంకులు, పెన్షన్ నిధులను పెట్టుబడులకు ఉపయోగిస్తాం * రైల్వేల అభివృద్ధికి అయిదేళ్ల యాక్షన్ ప్లాన్ * వచ్చే అయిదేళ్లలో రైల్వేల్లో రూ.8.5 లక్షల కోట్ల పెట్టుబడులు * ఛార్జీలు పెంచే యోచన లేదు * ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు అందించటమే ప్రధాన లక్ష్యం * రైల్వే టిక్కెట్ ధరలు పెంచటం లేదు * కొత్త రైల్వే లైన్ల నిర్మాణంలో ప్రయివేట్ భాగస్వామ్యం * వచ్చే అయిదేళ్లలో రైల్వేలో రూ.8.5 కోట్లు పెట్టుబడులు * ప్యాసింజర్ రైళ్ల స్పీడ్ గంటకు 25 కిలోమీటర్లు పెంచలేమా? * రైల్వేలపై ప్రజలు భారీ అంచనాలతో ఉన్నారు * ఉన్నత భవిష్యత్ లక్ష్యంగా రైల్వే బడ్జెట్ వచ్చింది * శతాబ్ధి ఎక్స్ ప్రెస్ ను గంటకు 125 కిలోమీటర్లు పెంచలేమా? * రాజధాని, శతాబ్ధి రైళ్లు అనుకున్న విధంగా నడవటం లేదు * పాతవాటిని తొలగించాలి...కొత్తవి నడపాలి * కాలం చెల్లిన రైళ్లను నడపాల్సి వస్తోంది * పెండింగ్ ప్రాజెక్ట్ లకు పూర్తికి ప్రాధాన్యత * భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని బడ్జెట్ రూపకల్పన * రైల్వే బడ్జెట్ దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక * దేశాభివృద్ధిలో రైల్వేలదే కీలక పాత్ర * రైల్వేల మీద ఇటీవల ఒత్తిడి పెరిగింది * అంచనాల భారం రైల్వేపై ఎక్కువగా ఉంది * రైల్వేలు ఆర్థికంగా వృద్ధి చెందాల్సి ఉంది * పెట్టుబడులు పెరిగితే ఉద్యోగాలు వస్తాయి * ప్రజల మద్దతుతో రైల్వేలు మరింత అభివృద్ధి * పర్యావరణ హితమైన అభివృద్ధే రైల్వేల లక్ష్యం *గతంలో అనుకున్న రీతిలో రైల్వేలు అభివృద్ధి చెందలేదు -
రైల్వే ఛార్జీల పెంపు లేదు
న్యూఢిల్లీ: రైల్వే ప్రయాణీకులు శుభవార్త. రైల్వే ఛార్జీల పెంపులేదని రైల్వేమంత్రి సురేశ్ ప్రభు ప్రకటించారు. ప్యాసింజర్ చార్జీలు యథాతధంగా అమల్లో ఉంటాయని ప్రకటించారు. రైల్వే బడ్జెట్ ను లోక్ సభలో ప్రవేశపెడుతున్నమంత్రి రైల్వే ప్రయాణీకులకు తీపి కబురందించారు. -
రైల్వేల అభివృద్ధితోనే దేశాభివృద్ధి: సురేశ్ ప్రభు
-
'నిజాయితీగా మాట్లాడటమే నాకు తెలుసు'
న్యూఢిల్లీ : కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు వ్యాఖ్యలపై గురువారం లోక్‌సభ దద్దరిల్లింది. విపక్ష సభ్యుల నిరసనలతో సభ ప్రారంభం అయిన కొద్దిసేపటికే 15 నిమిషాల పాటు వాయిదా పడింది. ఈరోజు ఉదయం సభ ప్రారంభం కాగానే వెంకయ్య నాయుడు వ్యాఖ్యలపై విపక్షాలు నిరసన వ్యక్తం చేశాయి. అయితే విపక్ష సభ్యుల నిరసల మధ్య స్పీకర్ సుమిత్రా మహాజన్ ప్రశ్నోత్తరాలు చేపట్టారు. అయితే వెంకయ్య క్షమాపణ చెప్పాలంటూ విపక్షాలు డిమాండ్ చేయటంతో సభలో గందరగోళం నెలకొంది. తమపై విమర్శలు చేసేముందు విపక్షాలు ఆత్మవిమర్శ చేసుకుంటే మంచిదని వెంకయ్య నాయుడు వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా కాంగ్రెస్ సీనియర్ నేత మల్లికార్జున ఖర్గే మాట్లాడుతూ ప్రతిపక్షాలను అవమానపర్చడం మర్యాద కాదన్నారు. సభలను అడ్డుకోవటం తమ ఉద్దేశం కాదన్నారు. మరోవైపు వెంకయ్య నాయుడు తన వ్యాఖ్యలపై వివరణ ఇస్తూ తన వ్యాఖ్యలను విపక్షాలు తప్పుగా అర్థం చేసుకున్నాయన్నారు. నిజాయితీగా మాట్లాడటమే తనకు తెలుసునని, ఎవరినీ ఉద్దేశించి తాను మాట్లాడలేదన్నారు. తానెప్పుడూ అన్ పార్లమెంటరీ పదాలు వాడలేదన్నారు. తన వ్యాఖ్యలు ఎవరినైనా బాధించి ఉంటే క్షమించాలని వెంకయ్య కోరారు. ఈ నేపథ్యంలో సభా కార్యక్రమాలకు అంతరాయం ఏర్పడటంతో స్పీకర్ ...సమావేశాలను 11.30గంటలకు వాయిదా వేశారు. -
వెంకయ్య వ్యాఖ్యలపై లోక్ సభలో దుమారం
న్యూఢిల్లీ : కేంద్ర పట్టాణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్య నాయుడు వ్యాఖ్యలపై లోక్ సభలో దుమారం చెలరేగింది. రైల్వే బడ్జెట్ ముందు నేతల మధ్య మాటల యుద్ధం జరిగింది. విపక్ష నేతలు ఆత్మవిమర్శ చేసుకోవాలని వెంకయ్య నాయుడు గురువారం లోక్ సభలో వ్యాఖ్యానించారు. ఆ వ్యాఖ్యలను ఖండిస్తూ, వెంకయ్య క్షమాపణ చెప్పాలని విపక్ష నేతలు డిమాండ్ చేశారు. లేకుంటే రైల్వే బడ్జెట్‌ను అడ్డుకుంటామని వారు హెచ్చరించారు. మరోవైపు వెంకయ్యపై విపక్షాలు స్పీకర్ సుమిత్రా మహజన్‌కు ఫిర్యాదు చేశారు. అలాగే యూపీఏ అధినేత్రి సోనియా గాంధీ అధ్యక్షతన పార్లమెంట్లో విపక్ష నేతలు సమావేశం అయ్యారు. ఈ భేటీలో తృణమూల్ , లెప్ట్, ఎస్పీ నేతలు పాల్గొన్నారు. -
రైల్వేల అభివృద్ధితోనే దేశాభివృద్ధి: సురేశ్ ప్రభు
న్యూఢిల్లీ : రైల్వేల అభివృద్ధితోనే దేశాభివృద్ధి జరుగుతుందని రైల్వేమంత్రి సురేశ్ ప్రభు అన్నారు. భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకునే రైల్వే బడ్జెట్‌ను రూపొందించినట్లు తెలిపారు. పరిశుభ్రత, వేగవంతమైన రైళ్లే లక్ష్యమని ఆయన గురువారమిక్కడ అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రైల్వేల అభివృద్ధికి దృఢ సంకల్పంతో ఉన్నారని సురేశ్ ప్రభు తెలిపారు. కాగా సురేశ్ ప్రభు తొలిసారిగా ఈ రోజు మధ్యాహ్నం 12 గంటలకు లోక్ సభలో రైల్వే బడ్జెట్‌ను ప్రవేశపెట్టన్నారు. కాగా ఛార్జీల పెంపు లేదంటూ మంత్రి సంకేతాలు ఇచ్చారు. మరోవైపు నాల్గవరోజు పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు హాట్‌హాట్‌గా సాగనున్నాయి. కీలకమైన రైల్వే బడ్జెట్‌ను కేంద్రం ప్రవేశపెట్టనుండడంతో ....అందరి దృష్టి కేంద్ర మంత్రి సురేశ్ ప్రభుపైనే పడింది. ఆయా రాష్ట్రాలకు ఏఏ అంశాల ప్రాతిపదికన కేటాయిస్తారనేది ఉత్కంఠను రేకెత్తిస్తోంది. మరోవైపు భూసేకరణ ఆర్డినెన్స్‌ను వ్యతిరేకిస్తూ విపక్షాలు ఆందోళనకు దిగాయి. అవసరమైతే రైల్వే బడ్జెట్‌నైనా అడ్డుతీరాలని నిర్ణయించుకున్నాయి.