
వెంకయ్య వ్యాఖ్యలపై లోక్ సభలో దుమారం
న్యూఢిల్లీ : కేంద్ర పట్టాణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్య నాయుడు వ్యాఖ్యలపై లోక్ సభలో దుమారం చెలరేగింది. రైల్వే బడ్జెట్ ముందు నేతల మధ్య మాటల యుద్ధం జరిగింది. విపక్ష నేతలు ఆత్మవిమర్శ చేసుకోవాలని వెంకయ్య నాయుడు గురువారం లోక్ సభలో వ్యాఖ్యానించారు. ఆ వ్యాఖ్యలను ఖండిస్తూ, వెంకయ్య క్షమాపణ చెప్పాలని విపక్ష నేతలు డిమాండ్ చేశారు. లేకుంటే రైల్వే బడ్జెట్ను అడ్డుకుంటామని వారు హెచ్చరించారు. మరోవైపు వెంకయ్యపై విపక్షాలు స్పీకర్ సుమిత్రా మహజన్కు ఫిర్యాదు చేశారు. అలాగే యూపీఏ అధినేత్రి సోనియా గాంధీ అధ్యక్షతన పార్లమెంట్లో విపక్ష నేతలు సమావేశం అయ్యారు. ఈ భేటీలో తృణమూల్ , లెప్ట్, ఎస్పీ నేతలు పాల్గొన్నారు.