కరుణించని 'ప్రభు'...ఒక్క కొత్త రైలు లేదు..
న్యూఢిల్లీ : రైల్వే బడ్జెట్పై ఎన్నో ఆశలు పెట్టుకున్న వారికి సురేష్ ప్రభు ఏ మాత్రం కరుణ చూపలేదు. రైల్వే బడ్జెట్పై విపక్షాలు తీవ్రస్థాయిలో నిరసన వ్యక్తం చేశాయి. కేంద్రమంత్రి సురేశ్ ప్రభు ప్రవేశపెట్టిన రైల్వే బడ్జెట్లో ఒక్క కొత్త రైలు కానీ, కొత్త జోన్ కానీ లేదు. ప్రతిపాదనలు, కేటాయింపుల ప్రస్తావన లేకుండా రైల్వే బడ్జెట్ ప్రసంగం ముగిసింది. గతానికి భిన్నంగా రైల్వేల గురించి మాత్రమే సురేశ్ ప్రభు ప్రసంగించారు.
మరోవైపు సురేశ్ ప్రభు ప్రవేశపెట్టి రైల్వే బడ్జెట్లో నాలుగు ప్రధాన లక్ష్యాలు
*వినియోగదారుల సంతృప్తి
*రైల్వేల మెరుగైన భద్రత
*రైల్వేల ఆధునీకరణ
* ప్రయాణికుల సంఖ్య 3 కోట్లకు పెంచటం