
2015-16 రైల్వే బడ్జెట్ హైలైట్స్
న్యూఢిల్లీ : కేంద్రమంత్రి సురేశ్ ప్రభు తొలిసారి లోక్ సభలో గురువారం 2015-16 రైల్వే బడ్జెట్ ప్రవేశపెట్టారు. పరిశుభ్రత, రైల్వే భద్రతకు పెద్దపీట వేస్తామని ఆయన తెలిపారు. రైల్వేల అభివృద్ధితోనే దేశాభివృద్ధి అని సురేశ్ ప్రభు తెలిపారు. (రైల్వే బడ్జెట్ పూర్తి పాఠం ఇంగ్లీషులో)
రైల్వే బడ్జెట్ ముఖ్యాంశాలు....
* రైళ్ల రాకపోకలపై ఎస్ఎంఎస్ సదుపాయం
*తక్కువ ధరకే తాగునీరు
* సాధారణ బోగీల్లో మొబైల్ ఛార్జింగ్ సదుపాయం
* రాజధాని ఎక్స్ప్రెస్ల వేగాన్ని పెంచేందుకు కృషి
* రైల్వే ప్రాజెక్టుల నిర్మాణంలో రాష్ట్రాల సహకారం తీసుకుంటాం
* రైళ్లలో నాణ్యమైణ ఆహారం అందించేందుకు కృషి
* ఆరు నెలల్లో 17వేల బయో టాయిలెట్స్ నిర్మాణం
* ప్రయాణికులు అయిదు నిమిషాల్లో టిక్కెట్ పొందే ఏర్పాటు
* 650 స్టేషన్లలో కొత్తగా టాయిలెట్స్ నిర్మాణం
* రైళ్లలో బయో టాయిలెట్స్ నిర్మాణం
* రైళ్లల్లో మహిళా భద్రతకు టోల్ ఫ్రీ నెంబర్ 182
* బ్యాంకులు, పెన్షన్ నిధులను పెట్టుబడులకు ఉపయోగిస్తాం
* రైల్వేల అభివృద్ధికి అయిదేళ్ల యాక్షన్ ప్లాన్
* వచ్చే అయిదేళ్లలో రైల్వేల్లో రూ.8.5 లక్షల కోట్ల పెట్టుబడులు
* ఛార్జీలు పెంచే యోచన లేదు
* ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు అందించటమే ప్రధాన లక్ష్యం
* రైల్వే టిక్కెట్ ధరలు పెంచటం లేదు
* కొత్త రైల్వే లైన్ల నిర్మాణంలో ప్రయివేట్ భాగస్వామ్యం
* వచ్చే అయిదేళ్లలో రైల్వేలో రూ.8.5 కోట్లు పెట్టుబడులు
* ప్యాసింజర్ రైళ్ల స్పీడ్ గంటకు 25 కిలోమీటర్లు పెంచలేమా?
* రైల్వేలపై ప్రజలు భారీ అంచనాలతో ఉన్నారు
* ఉన్నత భవిష్యత్ లక్ష్యంగా రైల్వే బడ్జెట్ వచ్చింది
* శతాబ్ధి ఎక్స్ ప్రెస్ ను గంటకు 125 కిలోమీటర్లు పెంచలేమా?
* రాజధాని, శతాబ్ధి రైళ్లు అనుకున్న విధంగా నడవటం లేదు
* పాతవాటిని తొలగించాలి...కొత్తవి నడపాలి
* కాలం చెల్లిన రైళ్లను నడపాల్సి వస్తోంది
* పెండింగ్ ప్రాజెక్ట్ లకు పూర్తికి ప్రాధాన్యత
* భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని బడ్జెట్ రూపకల్పన
* రైల్వే బడ్జెట్ దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక
* దేశాభివృద్ధిలో రైల్వేలదే కీలక పాత్ర
* రైల్వేల మీద ఇటీవల ఒత్తిడి పెరిగింది
* అంచనాల భారం రైల్వేపై ఎక్కువగా ఉంది
* రైల్వేలు ఆర్థికంగా వృద్ధి చెందాల్సి ఉంది
* పెట్టుబడులు పెరిగితే ఉద్యోగాలు వస్తాయి
* ప్రజల మద్దతుతో రైల్వేలు మరింత అభివృద్ధి
* పర్యావరణ హితమైన అభివృద్ధే రైల్వేల లక్ష్యం
*గతంలో అనుకున్న రీతిలో రైల్వేలు అభివృద్ధి చెందలేదు