రైల్వే బడ్జెట్లో మహిళా ప్రయాణీకులపై వరాల జల్లు కురిపించారు మంత్రి సురేశ్ ప్రభు.
న్యూఢిల్లీ: రైల్వే బడ్జెట్లో మహిళా ప్రయాణీకులపై వరాల జల్లు కురిపించారు మంత్రి సురేశ్ ప్రభు. మహిళల భద్రత కోసం టోల్ ఫ్రీ నెం. 182 ను ప్రకటించారు. మహిళా రక్షణ కోసం బోగీల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు.. మహిళా కోచ్ ల పెంపు. వృద్ధులకు , వికలాంగులకు ఆధునిక సౌకర్యాలు..ఆనలైన్ లో వీల్ ఛైర్ బుక్ చేసుకునే సౌలభ్యం. మహిళలకు, వృద్ధులకు లోయర్ బెర్తులు కేటాయించే ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించారు. మహిళా బోగీల్లో సౌకర్యాల పెంపుకోసం నిర్భయ ఫండ్ కింద నిధులను కేటాయించనున్నట్టు మంత్రి ప్రకటించారు.