సాక్షి, న్యూఢిల్లీ : రైల్వే ఉద్యోగులు ఆందోళన బాట పట్టారు. ఏకంగా పార్లమెంట్ ముందే నిరసన తెలిపేందుకు సిద్ధపడ్డారు. మంగళవారం నిర్వహించనున్న నిరసన ప్రదర్శనలో 40వేల మంది ఉద్యోగులు పాల్గొంటారని సమాచారం. దీనిపై ఆల్ ఇండియా రైల్వే ఫెడరేరషన్ సెక్రటరీ శివ్ గోపాల్ మిశ్రా మాట్లాడుతూ.. జాతీయ పెన్షన్ విధానాన్ని(ఎన్‌పీఎస్) రద్ధు చేయడంతో పాటు, తమ జీతాలను పెంచాలని కేంద్రాన్ని కోరామన్నారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులందరూ ప్రస్తుత ఎన్‌పీఎస్ విధానాన్ని వ్యతిరేకిస్తున్నారని తెలిపారు.
ఈ విధానంపై సమీక్షించడానికి గత సంవత్సరం కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అధ్యక్షతన ముగ్గురు సభ్యుల కమిటీ ఏర్పాటు అయినప్పటికీ ఎలాంటి పురోగతి లేదన్నారు. 2004 తర్వాత ఉద్యోగాల్లో చేరినవారికి కనీసం పెన్షన్ భద్రత కూడా లేదన్నారు. అన్నీ రైల్వే డివిజన్లకు చెందిన ఉద్యోగులు నిరసనలో పాల్గొంటారని తెలిపారు. కనీస వేతనాన్ని 18వేల నుంచి 26వేలకు పెంచాలని డిమాండ్ చేశారు. తమ ఆందోళనల వల్ల రైళ్లలో ప్రయాణించేవారికి ఎటువంటి అంతరాయం ఉండబోదన్నారు.
Comments
Please login to add a commentAdd a comment