'టికెట్ల రద్దు... ఇక ఈజీ'
న్యూఢిల్లీ: సీనియర్ సిటిజన్స్ కు లోయర్ బెర్త్ ల్లో ప్రాధాన్యం ఇస్తామని, ప్రతి టైన్లో వృద్ధుల కోసం 120 బెర్త్లు కేటాయించనున్నట్టు రైల్వే మంత్రి సురేశ్ ప్రభు తెలిపారు. 139 సర్వీసుతో రైలు టికెట్లను రద్దు చేసుకునే అవకాశం కల్పిస్తున్నట్టు చెప్పారు. సెకెండ్ క్లాస్ ప్రయాణికులకు దుప్పట్లు, దిండ్లు అందిస్తామన్నారు.
ఒక్క ఎస్ఎంఎస్ చేస్తే కోచ్, టాయిలెట్ లను శుభ్రం చేసే సిబ్బంది వచ్చే విధంగా మార్పులు చేస్తున్నామన్నారు. స్వచ్ఛ రైల్, స్వచ్ఛభారత్ కోసం స్టేషన్లు, రైళ్లను మరింత శుభ్రం చేయిస్తామని చెప్పారు. నాన్ ఏసీ కోచ్ల్లోనూ డస్ట్ బిన్లు పెట్టిస్తామన్నారు.
ప్రయాణికుల భద్రత పెద్దపీట వేస్తామని, అన్ని రైల్వేస్టేషన్లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. 2020 నాటికి ఆన్ డిమాండ్ రైలు సర్వీసులను అందుబాటులోకి తీసుకొస్తామన్నారు.