రైలు ఆలస్యమైతే ముందే సమాచారం | Railways Extends SMS facility regarding status of delay to 1373 trains | Sakshi
Sakshi News home page

రైలు ఆలస్యమైతే ముందే సమాచారం

Published Thu, Jan 4 2018 6:59 PM | Last Updated on Mon, Oct 22 2018 2:17 PM

Railways Extends SMS facility regarding status of delay to 1373 trains - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : రైలు ప్రయాణీకులకు భారతీయ రైల్వే తీపి కబురు చెప్పింది. ఒక గంట కంటే ఎక్కువ ఆలస్యంగా నడిచే రైళ్ల వివరాలను ప్రయాణీకులకు రైల్వే శాఖ ముందుగానే చేరవేయనున్నట్లు తెలిపింది. గరిభ్‌ రథ్‌, దురంతో, జన శతాబ్ది, సువిధ, హంసఫర్‌, సూపర్‌ ఫాస్ట్‌ రైళ్లతో సహా మొత్తం 1373 రైళ్లలో ఈ సదుపాయం అందుబాటులోకి వచ్చిందని రైల్వే శాఖ వివరించింది.

ఈ రైళ్ల రాక గంట కంటే ఎక్కువ ఆలస్యమైతే ఎస్‌ఎంఎస్‌ల రూపంలో ముందుగానే ప్రయాణీకులకు సమాచారం అందిస్తామని చెప్పింది. ఈ సదుపాయం టిక్కెట్‌ రిజర్వేషన్‌ సమయంలో మొబైల్‌ నంబర్‌ను అందజేసిన ప్రయాణీకులే వర్తిస్తుందని తెలిపింది.

ఆలస్యంగా ప్రయాణించే రైళ్ల వివరాలను ముందుగానే ప్రయాణీకుల పంపే ఈ పథకాన్ని 2017 నవంబర్‌లోనే ప్రయోగాత్మకంగా చేపట్టామని చెప్పింది. రాజధాని, శతాబ్ది, తేజస్‌, గతిమాన్‌ రైళ్ల ప్రయాణీకులకు ఇలా సమాచారం చేరవేయడంలో విజయం సాధించామని తెలిపింది.

అనంతరం డిసెంబర్‌లో గరీబ్‌ రథ్‌, దురంతో, జన శతాబ్ది, సువిధ రైళ్లకు కూడా ఎస్‌ఎంఎస్‌ల సదుపాయాన్ని ప్రారంభించినట్లు వివరించింది. ఈ నెల మూడో తేదీ నుంచి మొత్తం 1373 రైళ్లకు ఎస్‌ఎంఎస్‌ల సదుపాయాన్ని కల్పిస్తున్నట్లు చెప్పింది.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement