train status
-
మీరు ప్రయాణించే రైలు లైవ్ స్టేటస్ గూగుల్ మ్యాప్స్‌లో తెలుసుకోండి ఇలా..?
రైల్వే ప్రయాణికుల కోసం ఎప్పటికప్పుడు సరికొత్త సేవలను అందుబాటులోకి తీసుకొస్తున్న రైల్వేశాఖ సరికొత్తగా మరికొన్ని సేవలను అందుబాటులోకి తీసుకొని వచ్చింది. రైలు టికెట్ బుక్ చేసుకున్న తర్వాత రైల్వే ప్రయాణికులు ప్రయాణించే రైలు సమయానికే స్టేషన్ కు వస్తుందా..? ప్రస్తుతం ఎక్కడుంది..? అనే విషయాలు తెలుసుకోవడానికి చాలా మార్గాలున్నాయి. అయితే, ఇప్పుడు మీరు ప్రయాణించే రైలు లైవ్ స్టేటస్ మీ మొబైల్ ద్వారా సులభంగా తెలుసుకోవడానికి ఇండియన్ రైల్వే గూగుల్ మ్యాప్స్‌తో ఒప్పందం చేసుకుంది. రైలు లైవ్ స్టేటస్ కి సంబంధించిన సమాచారాన్ని గూగుల్ తన మ్యాప్స్‌లో అందిస్తుంది. గూగుల్ మ్యాప్స్‌లో రైలు లైవ్ స్టేటస్ తెలుసుకోండి ఇలా..? మొదట మీ మొబైల్ ఉన్న గూగుల్ మ్యాప్స్ యాప్ ని అప్డేట్ చేసుకోండి. ఇప్పుడు గూగుల్ మ్యాప్స్ ఓపెన్ చేసి మీరు ఎక్కాల్సిన రైల్వే స్టేషన్ మ్యాప్స్‌లో క్లిక్ చేయండి. మ్యాప్స్‌లో మీరు ఎక్కాల్సిన రైల్వే స్టేషన్ క్లిక్ చేయగానే మీకు చాలా రైళ్లకు సంబంధించిన సమాచారం కనిపిస్తుంది. ఇప్పుడు మీరు మీరు ప్రయాణించే రైలు మీద క్లిక్ చేయగానే ఆ రైలు ఎక్కడ ఉంది, ఎన్ని నిమిషాలు ఆలస్యంగా వస్తుంది అనేది మీకు చూపిస్తుంది. (చదవండి: ఉత్తర కొరియాలో రెచ్చిపోతున్న హ్యాకర్స్!! ఏం చేశారంటే..) -
వాట్సాప్‌లో మీ ట్రైన్ స్టేటస్.. చెక్‌చేసుకోండిలా..
న్యూఢిల్లీ : మీరు ప్రయాణించాలనుకునే రైలు, ఎక్కడుంది..? ఇంకెంత సేపట్లో ప్లాట్‌ఫామ్ మీదకు వస్తుంది? అని తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మీ వాట్సాప్ తీసి ఓ మెసేజ్ చేసేయండి. క్షణాల్లో మీరు ప్రయాణించాలనుకునే రైలు స్టేటస్ అప్డేట్లన్నీ మీ ముందుంటాయి. రైలు ప్రయాణాన్ని మరింత సులభతరం, ప్యాసెంజర్ ఫ్రెండ్లీ చేసేందుకు దేశీయ రైల్వే పలు చర్యలు తీసుకుంటోంది. ఈ నేపథ్యంలో ట్రావెల్ పోర్టల్ మేక్‌మైట్రిప్‌తో దేశీయ రైల్వే భాగస్వామ్యం ఏర్పరుచుకుంది. ఈ భాగస్వామ్యంలో రైలు రన్నింగ్ స్టేటస్ అప్డేట్లను ప్రయాణికులు వెంటనే తెలుసుకునేలా అవకాశం కల్పిస్తోంది. దీని కోసం ఓ వాట్సాప్ నెంబర్‌ను కూడా అందుబాటులోకి తీసుకొచ్చింది. తొలుత ఆ నెంబర్‌ను మీ ఫోన్లో సేవ్ చేసుకోవాలి, ఆ మొబైల్ నెంబర్ 7349389104 ఆ తర్వాత వాట్సాప్‌కు వెళ్లాలి, వాట్సాప్ నుంచి ఆ నెంబర్‌కు మీ ట్రైన్ నెంబర్ పంపించాలి. డబుల్ క్లిక్ వచ్చేంత వరకు వేచి చూడాలి. ఒక్కసారి ఈ మెసేజ్ డెలివరీ అయ్యాక, మీ ట్రైన్ వివరాలను మీరు పొందవచ్చు. మెసేజ్ పంపించిన 10 సెకన్ల కంటే తక్కువ వ్యవధిలోనే ట్రైన్ స్టేటస్ అప్డేట్ను ప్రయాణికులు పొందుతారు. రైల్వే మంత్రి పియూష్ గోయల్ ఇటీవలే ప్రయాణీకుల ఫిర్యాదులను వేగవంతంగా పరిష్కరించడానికి 'రైల్ మడాడ్' అనే అప్లికేషన్‌ను ప్రారంభించింది. మినిమమ్ ఇన్‌పుట్స్‌తో ప్యాసెంజర్లు తమ ఫిర్యాదును రిజిస్ట్రర్ చేయడానికి అనుమతి ఇస్తుంది. ఫిర్యాదును నమోదు చేసిన అనంతరం, సంబంధిత అధికారులకు ఆన్లైన్లోనే దీన్ని బదిలీ చేస్తారు. ఆ ఫిర్యాదుపై చర్యలు తీసుకుని, వెంటనే ప్రయాణికులకు ఆ విషయాన్ని ఎస్ఎంఎస్ ద్వారా తెలియజేస్తారు. -
రైలు ఆలస్యమైతే ముందే సమాచారం
సాక్షి, న్యూఢిల్లీ : రైలు ప్రయాణీకులకు భారతీయ రైల్వే తీపి కబురు చెప్పింది. ఒక గంట కంటే ఎక్కువ ఆలస్యంగా నడిచే రైళ్ల వివరాలను ప్రయాణీకులకు రైల్వే శాఖ ముందుగానే చేరవేయనున్నట్లు తెలిపింది. గరిభ్ రథ్, దురంతో, జన శతాబ్ది, సువిధ, హంసఫర్, సూపర్ ఫాస్ట్ రైళ్లతో సహా మొత్తం 1373 రైళ్లలో ఈ సదుపాయం అందుబాటులోకి వచ్చిందని రైల్వే శాఖ వివరించింది. ఈ రైళ్ల రాక గంట కంటే ఎక్కువ ఆలస్యమైతే ఎస్ఎంఎస్ల రూపంలో ముందుగానే ప్రయాణీకులకు సమాచారం అందిస్తామని చెప్పింది. ఈ సదుపాయం టిక్కెట్ రిజర్వేషన్ సమయంలో మొబైల్ నంబర్‌ను అందజేసిన ప్రయాణీకులే వర్తిస్తుందని తెలిపింది. ఆలస్యంగా ప్రయాణించే రైళ్ల వివరాలను ముందుగానే ప్రయాణీకుల పంపే ఈ పథకాన్ని 2017 నవంబర్లోనే ప్రయోగాత్మకంగా చేపట్టామని చెప్పింది. రాజధాని, శతాబ్ది, తేజస్, గతిమాన్ రైళ్ల ప్రయాణీకులకు ఇలా సమాచారం చేరవేయడంలో విజయం సాధించామని తెలిపింది. అనంతరం డిసెంబర్లో గరీబ్ రథ్, దురంతో, జన శతాబ్ది, సువిధ రైళ్లకు కూడా ఎస్ఎంఎస్ల సదుపాయాన్ని ప్రారంభించినట్లు వివరించింది. ఈ నెల మూడో తేదీ నుంచి మొత్తం 1373 రైళ్లకు ఎస్ఎంఎస్ల సదుపాయాన్ని కల్పిస్తున్నట్లు చెప్పింది.