సాక్షి, బెంగళూరు : కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బెంగళూరుపై వరాల వర్షం కురిపిస్తోంది. ఐటీ నగరంగా పేరొందిన బెంగళూర్‌లో ట్రాఫిక్ కష్టాలను తీర్చేందుకు రూ. 492 కోట్లతో ప్రాజెక్టును మంజూరు చేసినట్టు రైల్వే మంత్రి పీయూష్ గోయల్ ట్వీట్ చేశారు. బెంగళూర్ కంటోన్మెంట్ నుంచి వైట్‌ఫీల్డ్ వరకూ రూ 492 కోట్లతో రెండు అదనపు లైన్ల నిర్మాణానికి రైల్వే మంత్రిత్వ శాఖ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. కాగా, ప్రయాణీకుల రద్దీని తగ్గించి, రైళ్ల రాకపోకలు సజావుగా సాగేందుకు ఈ ప్రాజెక్టు ఉపకరిస్తుందని, రోజూ 62,000 మంది ప్రయాణికులు లబ్ధిపొందుతారని మంత్రి పీయూష్ గోయల్ ట్వీట్ చేశారు.
25 కిమీల రైల్వే లైన్‌లో కీలకమైన బెంగళూర్ కంటోన్మెంట్, బెంగళూర్ ఈస్ట్, బైపనహళ్లి, కృష్ణరాజపురం, హుదీ, వైట్‌ఫీల్డ్ స్టేషన్లున్నాయి. ఈ ప్రాజెక్టు మూడేళ్లలో పూర్తవుతుందని, వైట్‌ఫీల్డ్ ఐటీ హబ్ పరిసర ప్రాంతవాసులకు ఇది సౌకర్యవంతంగా ఉంటుందని రైల్వే మంత్రిత్వ శాఖ ఓ ప్రకటనలో పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment