చైనాకు రైల్వే శాఖ షాక్‌.. ఒప్పందం రద్దు! | Railways Says Chinese Firm Rs 470 Crore Contract Cancelled | Sakshi
Sakshi News home page

చైనా సంస్థకు షాక్‌.. రూ. 470 కోట్ల ప్రాజెక్టు రద్దు

Published Thu, Jun 18 2020 5:36 PM | Last Updated on Thu, Jun 18 2020 5:51 PM

Railways Says Chinese Firm Rs 470 Crore Contract Cancelled - Sakshi

న్యూఢిల్లీ: భారత సైనికుల మరణానికి కారణమైన చైనాకు రైల్వే శాఖకు చెందిన డెడికేటెడ్‌ ఫ్రైట్‌ కారిడార్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌(డీఎఫ్‌సీసీఐఎల్‌) గట్టి షాకిచ్చింది. రూ. 470 కోట్ల విలువైన ప్రాజెక్టు కాంట్రాక్టును రద్దు చేస్తున్నట్లు వెల్లడించింది. వివరాలు.. కాన్పూర్‌- దీన్‌దయాళ్‌ ఉపాధ్యాయ్‌ సెక్షన్‌ మధ్య 417  కిలోమీటర్ల పొడవు గల రైలు మార్గంలో సిగ్నలింగ్‌, టెలికమ్యూనికేషన్‌ సదుపాయాల కల్పనకై బీజింగ్‌ నేషనల్‌ రైల్వే రీసర్చ్‌, డిజైన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సిగ్నల్‌ అండ్‌ కమ్యూనికేషన్‌తో 2016లో డీఎఫ్‌సీసీఐఎల్‌  ఒప్పందం కుదుర్చుకుంది. ఈ డీల్‌ కుదిరి నాలుగేళ్లవుతున్నా ఇంతవరకు 20 శాతం పనులు కూడా పూర్తికాలేదు. దీంతో చైనీస్‌ సంస్థ నిర్లక్ష్యంపై ఆగ్రహం వ్యక్తం చేసిన డీఎఫ్‌సీసీఐఎల్‌ కాంట్రాక్టును తాజాగా రద్దు చేసింది.(చైనా కంపెనీలపై భారత్‌ కఠిన ఆంక్షలు!)

ఈ విషయం గురించి అధికారులు మాట్లాడుతూ.. అగ్రిమెంట్‌ను ఖరారు చేసే సాంకేతికపరమైన పత్రాలను(టెక్నికల్‌ డాక్యుమెంట్లు) చైనీస్‌ సంస్థ ఇంతవరకు అందజేయలేదని వెల్లడించారు. అంతేగాకుండా సైట్‌ దగ్గరికి తమ ఇంజనీర్లు, అధికారులను ఒక్కసారి కూడా పంపలేదని తెలిపారు. ఈ విషయాల గురించి వివిధ స్థాయి అధికారులతో చర్చించినప్పటికీ ఎటువంటి సానుకూల స్పందన రాలేదన్నారు. ఈ నేపథ్యంలో కాంట్రాక్టు రద్దు చేసేందుకు నిర్ణయించామని తెలిపారు. కాగా గాల్వన్‌ లోయ ప్రాంతంలో జరిగిన చైనా దాడికి భారత్‌ ప్రతీకారం తీర్చుకోవాలని భావిస్తోంది. ఈ క్రమంలో చైనాపై ఆర్థిక ఆంక్షలను మరింత కఠినతరం చేయనున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే డీఎఫ్‌సీసీఐఎల్ తాజాగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement