
అశోక్ గెహ్లాట్ (ఫైల్ ఫోటో)
జైపూర్: కరోనా వైరస్‌తో కలిసి బతకాలని చెప్తున్న ముఖ్యమంత్రుల మాటలే నిజమయ్యేలా ఉన్నాయి. ఎన్నిచర్యలు చేపట్టినా, ఎంత కఠినంగా వ్యవహరించినా, మరెన్నో ముందు జాగ్రత్తలు తీసుకున్నా కరోనా విజృంభణ ఏమాత్రం తగ్గడం లేదు. ఇప్పటికే వీటి కేసుల సంఖ్య 46 వేలు దాటిపోయింది. తాజాగా రాజస్థాన్ ముఖ్యమంత్రి నివాసంలో కరోనా కలకలం రేపుతోంది. సీఎం అశోక్ గెహ్లాట్ ఇంట్లో కారు డ్రైవర్‌గా పని చేస్తున్న 59 యేళ్ల వ్యక్తికి కరోనా సోకినట్లు మంగళవారం నిర్ధారణ అయింది. దీంతో అతడిని ఆసుపత్రికి తరలించారు. మరోవైపు అతడు నివసించే జైపూర్‌లోని బజాజ్ నగర్ ప్రాంతంలో కర్ఫ్యూ విధించారు. అతడు ఎవరెవరిని కలిశారన్నదానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. కాగా రాజస్థాన్‌లో ఇప్పటివరకు కరోనా కేసులు మూడువేలను దాటిపోగా సుమారు పద్నాలుగు వందల మంది వైరస్ నుంచి కోలుకుని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. (కరోనా పోవాలంటే.. మద్యం కావాల్సిందే!)
చదవండి: క్వారంటైన్ రుణం తీర్చుకున్నారు.. ఇలా!
Comments
Please login to add a commentAdd a comment