
న్యూఢిల్లీ: కేంద్ర మాజీ హోం కార్యదర్శి రాజీవ్ మహర్షి(62)ని తదుపరి కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్(కాగ్)గా కేంద్రం నియమించినట్లు ఉన్నతాధికారులు తెలిపారు. రాష్ట్రపతి భవన్‌లో సోమవారం రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ మహర్షి చేత ప్రమాణ స్వీకారం చేయిస్తారన్నారు. 1978 బ్యాచ్, రాజస్తాన్ కేడర్ ఐఏఎస్ అధికారి అయిన మహర్షి కాగ్‌గా ఆరేళ్ల పాటు లేదా 65 ఏళ్లు పూర్తయ్యేవరకు కొనసాగుతారు. హోంశాఖ కార్యదర్శిగా రెండేళ్ల పదవీకాలాన్ని ఆగస్టుతో పూర్తిచేసుకున్నారు.