కేంద్రంలో నెంబర్ 2.. రాజ్నాథ్ సింగ్ | Rajnath singh made incharge of government, cabinet | Sakshi
Sakshi News home page

కేంద్రంలో నెంబర్ 2.. రాజ్నాథ్ సింగ్

Published Fri, Sep 26 2014 6:10 PM | Last Updated on Mon, Aug 20 2018 9:16 PM

కేంద్రంలో నెంబర్ 2.. రాజ్నాథ్ సింగ్ - Sakshi

కేంద్రంలో నెంబర్ 2.. రాజ్నాథ్ సింగ్

ప్రధాని నరేంద్రమోదీ అమెరికా పర్యటనకు బయల్దేరారు. ఈ సమయంలో ప్రభుత్వానికి ఎవరు అధినేతగా వ్యవహరించాలి? మంత్రివర్గాన్ని ముందుండి నడిపించే బాధ్యతలు ఎవరు తీసుకోవాలి? ఈ ప్రశ్నలన్నింటికీ ఒకే సమాధానం.. కేంద్ర హోం మంత్రి రాజ్నాథ్ సింగ్. ఈ విషయాన్ని కేంద్ర కేబినెట్ కార్యదర్శి నిర్ధారించారు.

ప్రధానమంత్రి దేశంలో లేని ఈ తరుణంలో కేంద్ర ప్రభుత్వానికి, కేంద్ర మంత్రివర్గానికి కూడా ఇన్ఛార్జిగా రాజ్నాథ్ సింగ్ వ్యవహరిస్తారని ఆయన ఓ ప్రకటనలో తెలిపారు. ఇంతకుముందు ప్రధానమంత్రి జపాన్ పర్యటనకు వెళ్లినప్పుడు కూడా రాజ్నాథే ఈ బాధ్యతలు నిర్వర్తించారు. అయితే అప్పుడు ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించలేదు. తొలిసారి ఇప్పుడే ఇలా ప్రకటించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement