హరిద్వార్: అయోధ్యలో రామాలయ నిర్మాణాన్ని ప్రతిపక్షాలు కూడా వ్యతిరేకించబోవని ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భాగవత్ అన్నారు. దేశంలోని మెజారిటీ ప్రజలకు రాముడే ఆరాధ్య దేవుడైనందున రామ మందిర నిర్మా ణాన్ని ఎవరూ బహిరంగంగా వ్యతిరేకించబోరన్నారు. ఆరెస్సెస్, బీజేపీలు అయోధ్యలో రామాలయ నిర్మాణానికి కట్టుబడి ఉన్నాయని, అయితే, కొన్ని అంశాలు కార్యరూపం దాల్చడానికి కొంత సమయం పడుతుందని పేర్కొన్నారు.
హరిద్వార్‌లో పతంజలి యోగాపీఠ్ ఆధ్వర్యంలో జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వాలకు కొన్ని పరిమితులు ఉంటాయని, ఆ పరిమితులకు లోబడే అవి పని చేయాల్సి ఉంటుందన్న భాగవత్.. సాధువులు, సన్యాసులకు ఆ పరిమితులేవీ ఉండవు కనుక దేశం, మతం, సమాజం అభివృద్ధి కొరకు పనిచేయాలని కోరారు. అధికారంలో ఎవరు ఉన్నారన్నది ముఖ్యమైన విషయమని, ప్రజలకు మంచి చేస్తున్న ప్రభుత్వాలే అధికారంలో కొనసాగడం అవసరమన్నారు. తమ కన్నా సాధువులు సమర్ధులని మంత్రులు, సంపన్నులు అంగీకరించాలని బాబా రామ్ దేవ్ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment