బాలికపై అత్యాచారం, ఆపై హత్య | Raping the girl, then killed | Sakshi
Sakshi News home page

బాలికపై అత్యాచారం, ఆపై హత్య

Published Tue, Oct 28 2014 10:47 PM | Last Updated on Tue, Aug 21 2018 5:46 PM

బాలికపై అత్యాచారం, ఆపై హత్య - Sakshi

బాలికపై అత్యాచారం, ఆపై హత్య

సాక్షి, ముంబై: 12 సంవత్సరాల బాలికను కొందరు అత్యాచారం చేసి ఆపై హత్య చేశారు. ఈ ఘటన సోమవారం సాయంత్రం చోటుచేసుకుంది.  గోవండీ నివాసి అయిన హతురాలి ఆచూకీ శనివారం సాయంత్రం నుంచి గల్లంతైంది. ఆమె తల్లిదండ్రులు గాలించినా ఫలితం దక్కలేదు. ఈ విషయమై ఆదివారం మధ్యాహ్నం  వారు శివాజీనగర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు అన్వేషణ ప్రారంభించారు. భాంగన్‌వాడి ప్రాంతంలోని అంబేద్కర్ ఉద్యానవనం సమీపంలోగల చెత్తకుండీలో సోమవారం సాయంత్రం బాలిక మృతదేహం దొరికింది. మృతదేహాన్ని ఓ చాపలో చుట్టి పారేశారని పోలీసులు తెలిపారు. నిందితులను అరెస్టు చేశామన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement