కోల్‌కతా: మూడ్రోజుల పాటు రసగుల్లా ఫెస్ట్‌ను నిర్వహిస్తూ కోల్‌కతా ఈ ఏడాదికి తీయని వేడు కతో ముగింపు పలకనుంది. రసగుల్లా స్వీట్‌ను కనుగొన్న నోబిన్ చంద్ర దాస్‌కు నివాళిగా ఈ వేడుకను నిర్వహించనుంది. బెంగాల్ రసగుల్లాకు గతేడాది భౌగోళిక గు ర్తింపు లభించింది. రసగుల్లాను కనుగొని 150 ఏళ్లు పూర్తయిన సందర్భంగా డిసెంబర్ 28 నుంచి మూడ్రోజులు ఫెస్ట్‌ను నిర్వహిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన రస గుల్లాను కనుగొన్న దాస్ కు నివాళిగా తొలిసారిగా బాగ్‌బజార్–ఒ–రసగుల్లా ఉత్సవ్‌ను అక్కడి ప్రభుత్వం నిర్వహిస్తోంది. ఈ ఫెస్టివల్ బాగ్‌బజార్ చరిత్ర, సంస్కృతిని కూడా చాటి చెప్తుందని మంత్రి శశి పంజా పేర్కొన్నారు. స్వీట్ వ్యాపారులు తమ వంటకాలను రుచి చూపించడానికి ఈ ఫెస్ట్ మంచి అవకాశమని వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment