
కాంగ్రెస్ హోర్డింగుల్లో ప్రణబ్
న్యూఢిల్లీ: పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసిన హోర్డింగులలో రాష్ట్రపతి ప్రణబ్ ఫొటోలు దర్శనమిచ్చాయి. వీటిపై రాష్ట్రపతి భవన్ మండిపడింది. రాష్ట్రపతి పదవికున్న తటస్థతను కాపాడేందుకు చర్యలు తీసుకోవాలని ఎన్నికల సంఘానికి లేఖ రాసింది. కాంగ్రెస్ హోర్డింగులలో ప్రణబ్ ఫొటోలకు సంబంధించి జాతీయ దినపత్రికల్లో వచ్చిన వార్తలను రాష్ట్రపతి కార్యదర్శి ఈసీ దృష్టికి తీసుకెళ్లారు. ఫొటో విషయాన్ని లూధియానా డిప్యూటీ కమిషనర్, జిల్లా ఎన్నికల అధికారులు పరిశీలిస్తున్నారని తెలిపారు.