సాక్షి, న్యూఢిల్లీ: రోడ్డు భద్రత అన్నది కేవలం ప్రభుత్వ బాధ్యత కాదని, అది పౌరులందరి బాధ్యత అని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. జేకే టైర్స్–కాన్‌స్టిట్యూషన్ క్లబ్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఢిల్లీలో ఆదివారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి మాట్లాడుతూ.. దేశంలో ఏటా పెరిగిపోతున్న రోడ్డు ప్రమాదాల నివారణకు పాఠశాల స్థాయిలోనే రోడ్డు భద్రతపై అవగాహన కల్పించాలని పేర్కొన్నారు. రోడ్డు భద్రతపై మీడియా విస్తృత ప్రచారం చేయాలన్నారు. రోడ్డు ప్రమాదాల్లో దివంగతులైన ఎం.రామ్‌గోపాల్ రెడ్డి, నందమూరి హరికృష్ణ, లాల్ జాన్ బాషా, ఎర్రన్నాయుడు, తదితర పార్లమెంటు సభ్యులకు ఉపరాష్ట్రపతి నివాళులర్పించారు. అనంతరం రోడ్డు భద్రతపై అవగాహన కల్పించే వింటేజ్ కార్ ర్యాలీని వెంకయ్య ప్రారంభించారు.
Comments
Please login to add a commentAdd a comment