
ఢిల్లీ: దేశ రాజధానిలో జరిగిన 32వ జాతీయ రహదారి భద్రత సమావేశాల్లో రవాణా శాఖ మంత్రి పేర్నినాని పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రహదారి భద్రతా నియమాలు పాటించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని స్పష్టం చేశారు. రహదారి ప్రమాదాల గణాంకాల ప్రకారం.. రోడ్డు ప్రమాదాల్లో మరణాల శాతం ప్రపంచంలోకెల్లా భారత్‌లోనే అధికమని పేర్కొన్నారు. దేశంలో యూపీలో ఎక్కువ మరణాలు నమోదవుతున్నట్లు మంత్రి తెలిపారు.
కోవిడ్‌తో ఏడాదిలో 1.45 లక్షల మరణాలు నమోదు కాగా, రోడ్డు ప్రమాదాల్లో 1.51 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారని మంత్రి వెల్లడించారు. కోవిడ్ మహమ్మారి కంటే రహదారి ప్రమాదాలు చాలా ప్రమాదకరమని మంత్రి హెచ్చరించారు. రోడ్డు ప్రమాదాల్లో యువత ఎక్కువగా చనిపోతున్నారని, తమ కుటుంబాలను దృష్టిలో ఉంచుకొని వారు రహదారి భద్రతా నియమాలు తప్పక పాటించాలని సూచించారు. రహదారి భద్రతా నియమాలు పాటించడంలో తమిళనాడును ఆదర్శంగా తీసుకుని మరణాల సంఖ్యను నివారించాలని మంత్రి పేర్నినాని విజ్ఞప్తి చేశారు.
Comments
Please login to add a commentAdd a comment