బెంగళూరు: గ్లోబల్ వార్మింగ్ ప్రభావంతో ఏటా 3.4 మి.మీ. మేర సముద్రంలో మునిగిపోతున్న కిరిబాటి ద్వీపం భారత్ సాయం కోసం ఎదురుచూస్తోందని ఆ దేశ మాజీ అధ్యక్షుడు అనోట్ టాంగ్ తెలిపారు. కిరిబాటిని కాపాడే సాంకేతికత, నైపుణ్యం భారత్‌కు ఉన్నాయన్నారు. ప్రముఖ గ్రామీ అవార్డు విజేత రికీ కేజ్ బెంగళూరులో నిర్వహించిన ‘రౌండ్‌గ్లాస్ సంసారా ఫెస్టివల్’లో టాంగ్ మాట్లాడారు.
చాలామంది ప్రజలు భవిష్యత్‌లో కిరిబాటిలో ఉండబోరన్నారు. అంతర్జాతీయ స్థాయిలో తమ పౌరులు జీవించేందుకు వీలుగా భారత్ శిక్షణ ఇవ్వాలని టాంగ్ విజ్ఞప్తి చేశారు. చేపల వేట ద్వారా 30 నుంచి 40% ఆదాయం సాధించగలిగితే వచ్చే రూ.6,516 కోట్ల(బిలియన్ డాలర్ల)తో డ్రెడ్జింగ్ ప్రక్రియ ద్వారా మునిగిపోతున్న తమ దేశాన్ని కాపాడుకుంటామన్నారు. ఫసిఫిక్ మహాసముద్రంలో చిన్న ద్వీపమైన కిరిబాటిలో దాదాపు 1.10 లక్షల మంది ప్రజలు నివసిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment