బరంపురం: ఓ ప్రతిపాదిత రైలు బోగీల ఫ్యాక్టరీకి తాజా రైల్వే బడ్జెట్‌లో కేటాయించిన మొత్తం అక్షరాలా రూ.1000! దీంతో ఆ ప్రాజెక్టు అసలు సాధ్యమేనా అని అనుమానాలు తలెత్తుతున్నాయి. ఒడిశాలోని గంజాం జిల్లా సీతల్పల్లిలో ప్రభుత్వ-ప్రైవేట్ భాగస్వామ్య పద్ధతిలో బోగీల ఫ్యాక్టరీని ఏర్పాటు చేస్తున్నట్లు 2011-12 రైల్వే బడ్జెట్‌లో నాటి రైల్వే మంత్రి మమతా బెనర్జీ ప్రకటించారు.
కానీ తర్వాతి బడ్జెట్లలో ప్రాజెక్టుకు అరకొర నిధులే ప్రకటిస్తూ వస్తున్నారు. దీని కోసం రాష్ట్ర సర్కారు 101 ఎకరాలు సేకరించినా నిధుల్లేకపోవడంతో పనులు మొదలు కాలేదు. తాజా రూ. వెయ్యి విదిలింపుపై సీఎం నవీన్ పట్నాయక్ విచారం వ్యక్తం చేశారని, నిధులు పెంచాలన్ని కేంద్రాన్ని అడిగారని బరంపురం బీజేడీ ఎమ్మెల్యే చ్యాపట్నాయక్ చెప్పారు.
కోచ్ ఫ్యాక్టరీకి రూ.1000
Published Mon, Feb 29 2016 12:53 AM | Last Updated on Sun, Sep 3 2017 6:37 PM
Advertisement
Advertisement