ముంబై: దేశంలోని 35 శాతం గ్రామాల్లోని ఇళ్లు విద్యుత్ వెలుగులకు ఆమడ దూరంలోనే ఉన్నాయని తాజా నివేదికలో వెల్లడైంది. కేంద్రం, రాష్ట్రాల మధ్య కొరవడిన సమన్వయం, సమర్థవంతమైన పర్యవేక్షణ లోపమే దీనికి ప్రధాన కారణమని నివేదిక ప్రకారం తెలుస్తోంది. విద్యుత్‌కు నోచుకోని గ్రామాల్లోని ఇళ్లు 2016 మే నాటికి 35 శాతం ఉన్నాయని ప్రముఖ ఆర్థిక సేవల సంస్థ జేఎం ఫైనాన్షియల్ దేశవ్యాప్తంగా అధ్యయనంలో తేలింది.
బిహార్‌లో 87 శాతం, యూపీలో 71 శాతం, ఎంపీ, ఒడిశా, అసోంలోని 80 శాతం గ్రామాల్లోని ఇళ్లకు విద్యుత్ సౌకర్యం లేదు. 100శాతం విద్యుత్ సౌకర్యం ఉన్న రాష్ట్రాలుగా పంజాబ్, గుజరాత్, ఏపీ నిలిచాయి. కేంద్ర ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన దిన్ దయాళ్ ఉపాధ్యాయ గ్రామ జ్యోతి యోజన కార్యక్రమం అమలు ద్వారా ఇప్పుడున్న పరిస్థితిలో మార్పు వచ్చే అవకాశం ఉందని సంస్థ తెలిపింది. ఇప్పటికైనా గ్రామాల విద్యుదీకరణ కన్నా గ్రామాల్లోని ఇళ్లకు విద్యుత్ అందించడంపై దృష్టి పెట్టాలని సంస్థ సూచించింది.
గ్రామాల్లో కానరాని విద్యుత్ వెలుగులు
Published Fri, Sep 9 2016 1:17 PM | Last Updated on Mon, Sep 4 2017 12:49 PM
Advertisement