Rural households
-
ఇళ్ల నిర్మాణ వ్యయంలో భారీ కోత..?
భారత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గ్రామీణ గృహనిర్మాణ పథకం ప్రధాన మంత్రి ఆవాస్ యోజన-గ్రామీణ్ (PMAY-G)కు 2025 ఆర్థిక సంవత్సరానికి ప్రతిపాదిత వ్యయం కంటే తక్కువ ఖర్చు చేయనున్నట్లు అంచనా. ఈ పథకం అమలుకు గతంలో అంచనా వేసిన దానికంటే రూ.20,000 కోట్లు కోత విధించబోతున్నట్లు తెలిసింది. ఈ పథకానికి సంబంధించి 2025-26 ఏడాదికి వాస్తవ వ్యయం సుమారు రూ.35,000 కోట్లు ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. దీని గత బడ్జెట్(Budget) అంచనా రూ.54,500 కోట్ల కంటే చాలా తక్కువ.2025 నుంచి వచ్చే ఐదేళ్లలో రెండు కోట్ల ఇళ్లను నిర్మించాలని, గ్రామీణ కుటుంబాలకు అందుబాటు ధరల్లో గృహాలను అందించాలని పీఎంఏవై-జీ లక్ష్యంగా పెట్టుకుంది. పక్కా గృహాల నిర్మాణానికి యూనిట్‌కు రూ.2.39 లక్షల చొప్పున ఆర్థిక సాయం అందించాలని నిర్ణయించింది. అయితే, రాబోయే ఆర్థిక సంవత్సరానికి ముందుగా అనుకున్న మేరకు ఖర్చు చేయలేరనే అంచనాలు వెలువడుతున్నాయి. దాంతో ఈ పథకం లక్ష్యం నీరుగారినట్లువుతుందని లబ్ధిదారులు, మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. ఈ పథకం రెండో దశ ప్రారంభంలో ఆర్థిక సాయం అందించడంలో తీవ్రంగా జాప్యం జరగడమే ఈ అంచనాకు ప్రధాన కారణం. అర్హులైన కుటుంబాలను గుర్తించేందుకు సర్వే కొనసాగుతోందని, 2025 మార్చి వరకు ఈ సర్వే జరిగే అవకాశం ఉన్నట్లు అధికారులు భావిస్తున్నారు. దాంతో సర్వే పూర్తై, నిధులు విడుదలై, ఇళ్ల నిర్మాణం ఎప్పటికి పూర్తవుతుందనే ప్రశ్నలు వస్తున్నాయి. పైగా 2025-26లో పథకం అమలు వ్యయంలో కోత విధిస్తారనే అంచనాలతో ఇళ్ల నిర్మాణం ప్రశ్నార్థకంగా మారుతుంది.ఇదీ చదవండి: చైనాపై ఆధారపడటాన్ని తగ్గించాలిపీఎం జన్‌మన్‌కు రూ.3.06 లక్షల కోట్లు2025 ఆర్థిక సంవత్సరం నుంచి ఐదేళ్లలో 20 లక్షల పక్కా గృహాలను నిర్మించాలనే లక్ష్యంతో ప్రధాన మంత్రి జన్జాతి ఆదివాసీ న్యాయ మహా అభియాన్ (PM JANMAN)ను ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఈ పథకం పీఎంఏవై-జీ 2.0లో భాగంగా ఉంది. ఇది 2024-25 ఆర్థిక సంవత్సరం నుంచి 2028-29 ఆర్థిక సంవత్సరం వరకు మొత్తం రూ.3.06 లక్షల కోట్లు కేటాయించింది. ఇలా ప్రధానంగా పీఏంఏవై-జీ అమలులో జాప్యం జరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం అదే తరహా కొత్త పథకాలు ప్రవేశపెట్టి లబ్ధిదారులను తగ్గిస్తుండడం పట్ల విమర్శలు వస్తున్నాయి. -
సిమెంట్ షేర్ల లాభాల కాంక్రీట్
ముందు రోజు నమోదైన భారీ నష్టాలకు చెక్ పెడుతూ హుషారుగా కదులుతున్న మార్కెట్లలో ఉన్నట్టుండి సిమెంట్ రంగ కౌంటర్లకు డిమాండ్ పెరిగింది. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఎగబడటంతో పలు సిమెంట్ కౌంటర్లు భారీ లాభాలతో కళకళలాడుతున్నాయి. కోవిడ్-19కు విధించిన లాక్‌డవున్‌ల నుంచి నెమ్మదిగా ఆర్థిక వ్యవస్థ రికవరీ బాట పట్టడంతో సెంటిమెంటు బలపడినట్లు పరిశ్రమవర్గాలు చెబుతున్నాయి. ఈ ఆర్థిక సంవత్సరం ద్వితీయార్ధంలో సిమెంట్ రంగ కంపెనీలు మరింత మెరుగైన పనితీరును ప్రదర్శించే వీలున్నట్లు మార్కెట్ నిపుణులు పేర్కొంటున్నారు. దీంతో సిమెంట్ కౌంటర్లు వెలుగులో నిలుస్తున్నట్లు తెలియజేశారు. ఇతర వివరాలు చూద్దాం. జోరుగా.. ప్రస్తుతం ఎన్ఎస్ఈలో ఏసీసీ సిమెంట్ 6.25 శాతం జంప్‌చేసి రూ. 1,677 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 1,683 వరకూ ఎగసింది. ఇది సరికొత్త గరిష్టంకాగా.. శ్రీ సిమెంట్ షేరు 6.7 శాతం దూసుకెళ్లి రూ. 21,780 వద్ద కదులుతోంది. ఇక అల్ట్రాటెక్ సిమెంట్ 3 శాతం పెరిగి రూ. 4,623 వద్ద ట్రేడవుతోంది. ఒక దశలో రూ. 4,628ను తాకింది. ఈ బాటలో రామ్‌కో సిమెంట్స్ 3.4 శాతం పుంజుకుని రూ. 781కు చేరింది. ఇంట్రాడేలో రూ. 782ను తాకింది. మంగళం సిమెంట్ సైతం 4.25 శాతం ఎగసి రూ. 205 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 207కు చేరింది. ఇతర కౌంటర్లలో డెక్కన్ సిమెంట్స్ 2.6 శాతం లాభంతో రూ. 325 వద్ద కదులుతోంది. ఒక దశలో రూ. 330కు చేరింది. శ్రీ దిగ్విజయ్ 3 శాతంపైగా వృద్ధితో రూ. 66 వద్ద ట్రేడవుతోంది. ఇదే విధంగా ఇండియా సిమెంట్స్, సాగర్ సిమెంట్స్ సైతం 1 శాతం బలపడ్డాయి. కారణాలేవిటంటే? ఈ ఏడాది రుతుపవనాలు అనుకూలించడంతో గ్రామీణ ప్రాంతాల నుంచి సిమెంట్‌కు రిటైల్ డిమాండ్ పెరగనున్నట్లు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇటీవల 50 శాతం గ్రామాల నుంచి వృద్ధి కనిపించినట్లు చెబుతున్నారు. ఇది కోవిడ్-19 అన్‌లాక్, పండుగల సీజన్ కారణంగానే నమోదైనప్పటికీ ఈ ఏడాది ద్వితీయార్థం నుంచి మరింత మెరుగుపడే వీలున్నట్లు భావిస్తున్నారు. ఇదేవిధంగా పట్టణ ప్రాంతాల నుంచి సైతం నెమ్మదిగా సిమెంట్ విక్రయాలు పుంజుకుంటున్నట్లు తెలియజేశారు. సిమెంటు రంగానికి ప్రధానంగా గ్రామీణ గృహాలు, మౌలిక సదుపాయాల రంగాలు జోష్‌నిస్తాయని పరిశ్రమవర్గాలు పేర్కొంటున్నాయి. ఇప్పటికే ఈ ఏడాది క్యూ2(జులై- సెప్టెంబర్)లో అల్ట్రాటెక్, ఏసీసీ వంటి సిమెంట్ రంగ దిగ్గజాలు ఆకర్షణీయ పనితీరు చూపడంతో సెంటిమెంటుకు బలమొచ్చినట్లు నిపుణులు తెలియజేశారు. -
గ్రామాల్లో కానరాని విద్యుత్ వెలుగులు
ముంబై: దేశంలోని 35 శాతం గ్రామాల్లోని ఇళ్లు విద్యుత్ వెలుగులకు ఆమడ దూరంలోనే ఉన్నాయని తాజా నివేదికలో వెల్లడైంది. కేంద్రం, రాష్ట్రాల మధ్య కొరవడిన సమన్వయం, సమర్థవంతమైన పర్యవేక్షణ లోపమే దీనికి ప్రధాన కారణమని నివేదిక ప్రకారం తెలుస్తోంది. విద్యుత్‌కు నోచుకోని గ్రామాల్లోని ఇళ్లు 2016 మే నాటికి 35 శాతం ఉన్నాయని ప్రముఖ ఆర్థిక సేవల సంస్థ జేఎం ఫైనాన్షియల్ దేశవ్యాప్తంగా అధ్యయనంలో తేలింది. బిహార్‌లో 87 శాతం, యూపీలో 71 శాతం, ఎంపీ, ఒడిశా, అసోంలోని 80 శాతం గ్రామాల్లోని ఇళ్లకు విద్యుత్ సౌకర్యం లేదు. 100శాతం విద్యుత్ సౌకర్యం ఉన్న రాష్ట్రాలుగా పంజాబ్, గుజరాత్, ఏపీ నిలిచాయి. కేంద్ర ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన దిన్ దయాళ్ ఉపాధ్యాయ గ్రామ జ్యోతి యోజన కార్యక్రమం అమలు ద్వారా ఇప్పుడున్న పరిస్థితిలో మార్పు వచ్చే అవకాశం ఉందని సంస్థ తెలిపింది. ఇప్పటికైనా గ్రామాల విద్యుదీకరణ కన్నా గ్రామాల్లోని ఇళ్లకు విద్యుత్ అందించడంపై దృష్టి పెట్టాలని సంస్థ సూచించింది.