ఐఎస్ నుంచి బీజేపీ ఎమ్మెల్యేకు బెదిరింపులు | Sangeet Som claims he got death threat from ISIS | Sakshi
Sakshi News home page

ఐఎస్ నుంచి బీజేపీ ఎమ్మెల్యేకు బెదిరింపులు

Published Sat, Dec 26 2015 6:37 PM | Last Updated on Thu, Mar 28 2019 8:41 PM

ఐఎస్ నుంచి బీజేపీ ఎమ్మెల్యేకు బెదిరింపులు - Sakshi

ఐఎస్ నుంచి బీజేపీ ఎమ్మెల్యేకు బెదిరింపులు

మీరట్: ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు తనను హతమారుస్తామని బెదిరించినట్టు ఉత్తరప్రదేశ్ ముజఫర్ నగర్ అల్లర్ల కేసులో నిందితుడిగా ఉన్న బీజేపీ వివాదాస్పద ఎమ్మెల్యే సంగీత్ సోమ్ చెప్పారు. శనివారం ఐఎస్ ఉగ్రవాద సంస్థ సభ్యుడిగా చెప్పుకున్న ఓ వ్యక్తి తనకు ఫోన్ చేసి త్వరలో చంపేస్తామని హెచ్చరించాడని సంగీత్ సోమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

దక్షిణ అమెరికా నుంచి ఆగంతకుడు తనకు ఫోన్ చేసినట్టు బీజేపీ ఎమ్మెల్యే వెల్లడించారు. ఐఎస్ ఉగ్రవాదులు ఇప్పటికే భారత్కు వచ్చారని, త్వరలో తనను చంపేస్తారని బెదిరించినట్టు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫోన్ చేసిన వ్యక్తి హిందీలో మాట్లాడాడని, తాను ఫోన్ కట్ చేయగా, మళ్లీ ఫోన్ చేశాడని తెలిపారు. ఐజీతో పాటు బీజేపీ సీనియర్ నేతలకు ఈ విషయాన్ని తెలియజేసినట్టు చెప్పారు. ఉగ్రవాదుల నుంచి సంగీత్ సోమ్కు ప్రాణహాని ఉందని ఇటీవల ఇంటలిజెన్స్ వర్గాలు తెలియజేయడంతో కేంద్ర ప్రభుత్వం జెడ్ కేటగిరి భద్రతను కల్పించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement