సాక్షి, న్యూఢిల్లీ : పరువు హత్యల వంటి తీవ్ర చర్యలతో చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకుంటున్న ఖాప్ పంచాయితీలపై సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ తరహా పంచాయితీల నుంచి బాధిత జంటలను కాపాడాలని కేంద్రాన్ని కోరింది. వివాహం, ప్రేమ వంటి వివాదాల పరిష్కారానికి కోర్టులు, చట్టాలు ఉన్నాయని, ఖాప్ పంచాయితీలు తమకు తాము వీటిపై నిర్ణయాలు తీసుకోలేవని సర్వోన్నత న్యాయస్ధానం స్పష్టం చేసింది.
వివాహబంధంతో యువతీయువకులు ఒక్కటైతే వారి వివాహం సరైనదా..కాదా అనేది చట్టం నిర్ధారిస్తుందని ఖాప్ పంచాయితీలు ఆ జంటపై హింసకు ప్రేరేపించడం సరైంది కాదని పేర్కొంది.కులాంతర, మతాంతర వివాహాలు చేసుకునే జంటలకు రక్షణ కల్పించేందుకు ఎలాంటి చర్యలు అవసరమనే విషయంలో ఉన్నతస్ధాయి పోలీస్ కమిటీని నియమించాలని యోచిస్తున్నట్టు వెల్లడించింది. ఖాప్ పంచాయితీలు, తల్లితండ్రులు, బంధువుల నుంచి వివాహం చేసుకున్న జంటలకు రక్షణ కల్పించే బాధ్యతను అప్పగించడాన్ని పరిశీలిస్తామని కోర్టు పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment