ఆరు బీజేపీ ప్రభుత్వాలకు సుప్రీం నోటీసులు
న్యూఢిల్లీ: బీజేపీ పాలిత ఆరు రాష్ట్ర ప్రభుత్వాలకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. గో సంరక్షణ పేరిట జరుగుతున్న దాడులపై వివరణ ఇవ్వాలంటూ రాజస్థాన్, జార్ఖండ్, చత్తీస్‌గఢ్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. రాజస్థాన్‌లోని అల్వార్ లో ఓ ముస్లిం వ్యక్తిపై గో సంరక్షకులు దాడి చేయగా అతడు చనిపోయాడు. ఈ విషయం ఇప్పుడు అటు పార్లమెంటును కుదిపేస్తోంది. ప్రతిపక్ష పార్టీలు సైతం అధికార పక్షంపై దీనితో దాడి చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో అల్వార్ ఘటనపై మూడు వారాల్లోగా వివరణ ఇవ్వాలంటూ రాజస్థాన్ ముఖ్యమంత్రి వసుందర రాజేకు సుప్రీంకోర్టు నోటీసులు పంపించింది. పెహ్లూ ఖాన్ అనే వ్యక్తి గోవులను ట్రక్కులో తీసుకొని వెళుతుండగా ఎక్కడ కొనుగోలు చేశావని, ఎందుకు తీసుకెళుతున్నావని ప్రశ్నించి అనంతరం దాడి చేయడంతో అతడు చనిపోయిన విషయం తెలిసిందే. అయితే, ప్రభుత్వం మాత్రం అలాంటి ఘటనేది జరగలేదని రాజ్యసభలో చెప్పడంతో పెద్ద ధుమారం చెలరేగింది.