alwar incident
-
మాయావతిపై విరుచుకుపడ్డ అరుణ్ జైట్లీ
న్యూఢిల్లీ: సార్వత్రిక ఎన్నికలు చివరి దశకు చేరుకుంటున్నా రాజకీయ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంది. తాజాగా బీఎస్పీ అధినేత్రి మాయావతిపై ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ విరుచుకుపడ్డారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై మాయావతి చేసిన వ్యాఖ్యలను ఆయన తీవ్రంగా ఖండించారు. మోదీపై వ్యక్తిగత విమర్శలకు దిగిన మాయావతి ప్రజా జీవితానికి అనర్హురాలని జైట్లీ ఘాటుగా సమాధానమిచ్చారు. ఈ మేరకు జైట్లీ మంగళవారం ట్వీట్ చేశారు. కాగా మోదీని చూసి బీజేపీ మహిళా నేతలు వణుకుతున్నారంటూ మాయావతి విమర్శలు గుప్పించారు. అంతేకాకుండా తన భార్యకు దూరంగా ఉంటున్న ప్రధాని మోదీ...తమ భర్తల నుంచి ఎక్కడ దూరం చేస్తారేమోనని అని బీజేపీ మహిళా నేతలు భయపడుతున్నారని మోదీపై ఆమె వ్యక్తిగత దూషణలకు దిగిన విషయం విదితమే. కాగా దళిత మహిళకు జరిగిన అన్యాయంపై స్పందించని మోదీ.. పార్టీలోని మహిళా నేతలకు ఎలా గౌరవం ఇస్తారని మాయావతి ప్రశ్నలు సంధించారు. మోదీ ప్రభుత్వం పనికిమాలిన రాజకీయాలు చేస్తుందని, రాజకీయాల్లో లబ్ధి పొందేందుకే అల్వార్ ఘటనపై మోదీ స్పందించడం లేదని మాయావతి పేర్కొన్నారు. మరోవైపు నరేంద్ర మోదీ కూడా మాయవతిపై విరుచుకుపడ్డారు. రాజస్తాన్‌లో కాంగ్రెస్ ప్రభుత్వానికి మాయావతి మద్దతు ఉపసంహరించుకోవాలని ప్రధాని సవాల్ విసిరారు. ఇక అల్వార్ గ్యాంగ్‌రేప్ ఘటనపై రాజస్తాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ రాజీనామా చేయాలని బీజేపీ డిమాండ్ చేసింది. రాజస్తాన్‌లో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయంటూ, అత్యాచార ఘటనను కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ తీవ్రంగా ఖండించారు. ఈ దుర్ఘటనకు కాంగ్రెస్ పార్టీనే బాధ్యత వహించాలని అన్నారు. కాగా భర్తతో కలిసి ప్రయాణం చేస్తున్న ఓ దళిత మహిళపై గత నెల 26న అయిదుగురు యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడి...దృశ్యాలను సెల్ఫోన్లో చిత్రీకరించారు. -
‘ఆళ్వార్ మూకదాడి’పై చర్యలేవి?
న్యూఢిల్లీ: రాజస్తాన్‌లోని ఆళ్వార్‌లో జరిగిన మూకదాడి ఘటనకు సంబంధించి ఏం చర్యలు తీసుకున్నారో చెప్పాలని ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. పూర్తి వివరాలతో 7రోజుల్లోగా నివేదిక అంద జేయాలని స్పష్టం చేసింది. ఆవుల అక్రమ రవాణాకు పాల్పడుతున్నాడనే ఆరోపణలతో ఆళ్వార్‌లో గత జూలై 20న రక్బార్ ఖాన్ అనే పాడిరైతుపై మూకదాడి జరిగిన విషయం తెలిసిందే. దాడిలో తీవ్రగాయాలపాలైన బాధితుడు ఆస్పత్రిలో చికిత్స పొందతూ మరణించాడు. ఈ ఘటనకు సంబం ధించి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును అమలు చేయలేదలంటూ కోర్టు ధిక్కర ణ పిటిషన్‌ను కాంగ్రెస్ నేత తెహ్సీన్ పూనావాలా దాఖలు చేశారు. ప్రభుత్వ సీఎస్, డీజీపీలతోపాటు సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా, న్యాయమూర్తులు జస్టిస్ ఏఎం ఖాన్విల్కర్, జస్టిస్ డీవై చంద్రచూడ్‌ల ధర్మాసనం సోమవారం ఈ పిటిషన్‌ను విచారించింది. ఈ ఘటనపై ఏమీ చర్యలు తీసుకున్నారో తెలుపుతూ ఏడు రోజుల్లోగా అఫిడవిట్ సమర్పించాలని రాజస్తాన్ హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీని ఆదేశించింది. మూకదాడులపై చర్యలు తీసుకునేందుకు కేంద్రం కొత్త చట్టం చేసే అంశానికి సంబంధించి రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు తమ అంగీకారాన్ని తెలుపుతూ సెప్టెంబర్ 7వ తేదీలోగా నివేదిక ఇవ్వాలని తెలిపింది. -
ఆరు బీజేపీ ప్రభుత్వాలకు సుప్రీం నోటీసులు
న్యూఢిల్లీ: బీజేపీ పాలిత ఆరు రాష్ట్ర ప్రభుత్వాలకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. గో సంరక్షణ పేరిట జరుగుతున్న దాడులపై వివరణ ఇవ్వాలంటూ రాజస్థాన్, జార్ఖండ్, చత్తీస్‌గఢ్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. రాజస్థాన్‌లోని అల్వార్ లో ఓ ముస్లిం వ్యక్తిపై గో సంరక్షకులు దాడి చేయగా అతడు చనిపోయాడు. ఈ విషయం ఇప్పుడు అటు పార్లమెంటును కుదిపేస్తోంది. ప్రతిపక్ష పార్టీలు సైతం అధికార పక్షంపై దీనితో దాడి చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అల్వార్ ఘటనపై మూడు వారాల్లోగా వివరణ ఇవ్వాలంటూ రాజస్థాన్ ముఖ్యమంత్రి వసుందర రాజేకు సుప్రీంకోర్టు నోటీసులు పంపించింది. పెహ్లూ ఖాన్ అనే వ్యక్తి గోవులను ట్రక్కులో తీసుకొని వెళుతుండగా ఎక్కడ కొనుగోలు చేశావని, ఎందుకు తీసుకెళుతున్నావని ప్రశ్నించి అనంతరం దాడి చేయడంతో అతడు చనిపోయిన విషయం తెలిసిందే. అయితే, ప్రభుత్వం మాత్రం అలాంటి ఘటనేది జరగలేదని రాజ్యసభలో చెప్పడంతో పెద్ద ధుమారం చెలరేగింది.