మహిళతో అడ్డంగా దొరికిన స్కూల్ టీచర్ | school teacher indulging in immoral act with a woman in the school premises | Sakshi
Sakshi News home page

మహిళతో అడ్డంగా దొరికిన స్కూల్ టీచర్

Published Thu, Nov 3 2016 1:57 PM | Last Updated on Sat, Sep 15 2018 5:45 PM

మహిళతో అడ్డంగా దొరికిన స్కూల్ టీచర్ - Sakshi

మహిళతో అడ్డంగా దొరికిన స్కూల్ టీచర్

జాజ్పూర్‌: ఓ పాఠశాల ఉపాధ్యాయుడు మహిళతో అసభ్యకరరీతిలో దొరికిపోయిన ఘటన ఒడిశాలో చోటుచేసుకుంది. జాజ్పూర్ జిల్లా రసూల్‌పూర్ బ్లాక్‌ లోని చందాపూర్ గ్రామ ప్రాధమిక పాఠశాలలో ఉర్దూ టీచర్‌గా విధులు నిర్వర్తిస్తున్న నసిమ్ ఖాన్‌.. పాఠశాల ఆవరణలోనే అసభ్యరీతిలో ఉండగా గ్రామస్తులు పట్టుకొని విద్యాశాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు.

బ్లాక్ ఎడ్యుకేషన్ ఆఫీసర్(బీఈవో) ప్రఫుల్ల కుమార్ మాట్లాడుతూ.. గ్రామస్తులు ఇచ్చిన ఫిర్యాదుతో ఎడిషనల్ బీఈవో అధికారులతో ఈ ఘటనపై విచారణ చేపట్టామని తెలిపారు. వారు ఇచ్చిన రిపోర్ట్ మేరకు నసీమ్‌ ఖాన్‌ను సస్పెండ్ చేసినట్లు తెలిపారు. బింజార్‌పూర్‌కు చెందిన నసీమ్ ఖాన్.. తాను విధులు నిర్వర్తిస్తున్న చందాపూర్ గ్రామం నుంచి తన ఊరు దూరంగా ఉందన్న కారణంతో కొంతకాలంగా పాఠశాలలోనే ఉంటున్నాడు. ఈ క్రమంలోనే కొంత కాలంగా పాఠశాల ఆవరణలో అతడు అనైతిక చర్యలకు పాల్పడుతున్నట్లు గుర్తించిన గ్రామస్తులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement