బైక్‌పై వచ్చి ఇంటర్‌ అమ్మాయిని చంపేశారు | Schoolgirl Stabbed to Death in UP | Sakshi
Sakshi News home page

బైక్‌పై వచ్చి ఇంటర్‌ అమ్మాయిని చంపేశారు

Published Wed, Aug 9 2017 4:43 PM | Last Updated on Sat, Sep 15 2018 7:15 PM

బైక్‌పై వచ్చి ఇంటర్‌ అమ్మాయిని చంపేశారు - Sakshi

బైక్‌పై వచ్చి ఇంటర్‌ అమ్మాయిని చంపేశారు

బల్లియా: ఉత్తరప్రదేశ్‌లో దారుణం చోటు చేసుకుంది. స్కూల్‌కు వెళుతున్న ఓ విద్యార్థినిని అడ్డుకొని వేధింపులకు పాల్పడటమే కాకుండా ఆమె అడ్డుచెప్పిందని హత్య చేశారు. కిందపడేసి ఐదుగురు యువకులు కత్తితో దారుణంగా పొడిచారు. కుటుంబ సభ్యులు అక్కడికి చేరుకొని ఆస్పత్రికి తరలించినప్పటికీ అప్పటికే ప్రాణంపోయిందన వైద్యులు ప్రకటించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం బాజా అనే గ్రామానికి చెందిన రగ్నీ దుబే అనే 17ఏళ్ల అమ్మాయి తన సైకిల్‌పై పాఠశాలకు బయలుదేరింది.

రెండు బైకులపై వచ్చిన ఐదుగురు యువకులు బాన్‌సీదేహ్‌ అనే ప్రాంతంలో ఆమెను అడ్డుకున్నారు. వారితో మాట్లాడాలని బలవంతపెట్టారు. అందుకు యువతి నిరాకరించడంతో ఆమెను సైకిల్‌పై నుంచి తోసి కిందపడేశారు. ఆ తర్వాత పదేపదే కత్తితో పొడిచి రక్తపుమడుగులో పడేసి వెళ్లిపోయారు. ఈ విషయం తెలిసిన తల్లిదండ్రులు బంధువులు అక్కడికి చేరుకునేలోపే ఘోరం జరిగిపోయింది. గత కొంతకాలం నుంచే ప్రస్తుతం దారుణానికి పాల్పడిన యువకులు ఆ యువతి వెంటపడుతున్నారట. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు వారి అరెస్టుకు రంగం సిద్ధం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement