సిమ్లా: హిమాచల్‌ప్రదేశ్‌లో కొత్త సీఎం అభ్యర్థి ఎంపికపై పార్టీ ఎమ్మెల్యేల అభిప్రాయాలు తెలుసుకునేందుకు బీజేపీ కేంద్ర పరిశీలకులు నిర్మలా సీతారామన్, నరేంద్రసింగ్ తోమర్‌లు గురువారం సిమ్లా చేరుకున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ సీఎం అభ్యర్థి ప్రేమ్‌కుమార్ ధుమల్ ఓడిపోవడంతో కొత్త సీఎం అభ్యర్థి ఎంపిక ప్రక్రియను బీజేపీ ప్రారంభించింది. ఈ పర్యటనలో భాగంగా రాష్ట్ర బీజేపీ వ్యవహారాల ఇన్‌చార్జ్ మంగళ్ పాండేతో పాటు ఎమ్మెల్యేలతో వీరు సమావేశం కానున్నారు. దీంతోపాటు బీజేపీ కోర్‌కమిటీ సభ్యులైన ధుమల్, రాష్ట్ర పార్టీ చీఫ్ సత్పాల్æసింగ్, మరో ఐదుగురు ఎంపీలతోనూ పరిశీలకులు భేటీ అవుతారు. ప్రతి ఎమ్మెల్యేను వ్యక్తిగతంగా కలిసి సీఎం అభ్యర్థిపై వారి అభిప్రాయాలను పరిశీలకులు సేకరించనున్నారు. ప్రస్తుతం సీఎం అభ్యర్థిగా కేంద్ర మంత్రి జేపీ నడ్డాతో పాటు ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన జైరామ్ ఠాకూర్ పేర్లు బాగా వినిపిస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment