Narendrasinh tomar
-
పీఎం కిసాన్ రైతులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త!
పీఎం కిసాన్ రైతులకు కేంద్రం శుభవార్త అందించింది. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి(ప్రధాని-కిసాన్) యోజన పథకం కింద 9వ విడత నగదును ప్రధాని నరేంద్ర మోడీ ఆగస్టు 9న మధ్యాహ్నం 12:30 గంటలకు వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా విడుదల చేయనున్నట్లు కేంద్రం పేర్కొంది. "9.75 కోట్లకు పైగా లబ్ధిదారుల రైతు కుటుంబాల ఖాతాలో రేపు ₹19,500 కోట్ల నగదును జమ చేయనున్నారు. ఈ కార్యక్రమంలో రైతులతో ప్రధాన మంత్రి సంభాషించనున్నారు'' అని ప్రధాన మంత్రి కార్యాలయం ఒక అధికారిక ప్రకటన విడుదల చేసింది. పీఎం కిసాన్ పథకం కింద అర్హత కలిగిన రైతు కుటుంబాలకు సంవత్సరానికి ₹6,000లను కేంద్రం ప్రతి ఏడాది మూడు విడుతలలో విడుదల చేస్తుంది. ఒక్కొక్క విడుతలలో భాగంగా ₹2,000లను ప్రతి నెలలకు ఒకసారి జమచేస్తుంది. ఈ నగదును నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలలో బదిలీ చేస్తారు. ఈ పథకంలో భాగంగా ఇప్పటి వరకు ₹1.38 లక్షల కోట్లకు పైగా సమ్మాన్ రాశిని రైతు కుటుంబాలకు బదిలీ చేశారు. ఈ కార్యక్రమంలో కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ కూడా పాల్గొంటారు. అంతకు ముందు మే 14న ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం కింద 8వ విడత నగదును ప్రధాని నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా విడుదల చేశారు. To further strengthen the social security of farmers, PM Shri @narendramodi will release the next instalment of PM-KISAN on 9th August 2021 at 12:30 PM. Register for the event at: https://t.co/NNPhWg5KT1 #TransformingIndia pic.twitter.com/VjYHLEMA2D — MyGovIndia (@mygovindia) August 8, 2021 -
‘మీసం, తోక వెంట్రుకలకు ఉన్నంత తేడా’
శివ్‌పురి: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి, కాంగ్రెస్ నేతలకు మధ్య...మీసాల్లో ఉండే వెంట్రుకలకు, తోకలో ఉండే వెంట్రుకలకు ఉన్నంత తేడా ఉందంటూ కేంద్ర గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్, గనుల శాఖల మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ వివాదాస్పదంగా వ్యాఖ్యానించారు. మూడు రోజుల క్రితం మధ్యప్రదేశ్‌లో ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు ఆలస్యంగా వెలుగులోకి వచ్చాయి. గుజరాత్ శాసనసభ ఎన్నికల్లో హార్దిక్ పటేల్, జిగ్నేశ్ మేవానీ, అల్పేశ్ ఠాకూర్ల మద్దతుతో కాంగ్రెస్ బీజేపీపై పోరాడటాన్ని ప్రస్తావిస్తూ తోమర్ ఈ మాటలన్నారు. ఈ విషయంపై పీటీఐ సోమవారం మంత్రిని వివరణ కోరగా ‘నేను ఏ కాంగ్రెస్ నేత పేరునూ ప్రస్తావించలేదు. కాంగ్రెస్ నేతలు, మోదీ వ్యక్తిత్వాల మధ్య తేడాను మాత్రమే ప్రస్తావించాను’ అని చెప్పారు. -
‘హిమాచల్’కు చేరుకున్న బీజేపీ పరిశీలకులు
సిమ్లా: హిమాచల్‌ప్రదేశ్‌లో కొత్త సీఎం అభ్యర్థి ఎంపికపై పార్టీ ఎమ్మెల్యేల అభిప్రాయాలు తెలుసుకునేందుకు బీజేపీ కేంద్ర పరిశీలకులు నిర్మలా సీతారామన్, నరేంద్రసింగ్ తోమర్లు గురువారం సిమ్లా చేరుకున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ సీఎం అభ్యర్థి ప్రేమ్‌కుమార్ ధుమల్ ఓడిపోవడంతో కొత్త సీఎం అభ్యర్థి ఎంపిక ప్రక్రియను బీజేపీ ప్రారంభించింది. ఈ పర్యటనలో భాగంగా రాష్ట్ర బీజేపీ వ్యవహారాల ఇన్చార్జ్ మంగళ్ పాండేతో పాటు ఎమ్మెల్యేలతో వీరు సమావేశం కానున్నారు. దీంతోపాటు బీజేపీ కోర్‌కమిటీ సభ్యులైన ధుమల్, రాష్ట్ర పార్టీ చీఫ్ సత్పాల్æసింగ్, మరో ఐదుగురు ఎంపీలతోనూ పరిశీలకులు భేటీ అవుతారు. ప్రతి ఎమ్మెల్యేను వ్యక్తిగతంగా కలిసి సీఎం అభ్యర్థిపై వారి అభిప్రాయాలను పరిశీలకులు సేకరించనున్నారు. ప్రస్తుతం సీఎం అభ్యర్థిగా కేంద్ర మంత్రి జేపీ నడ్డాతో పాటు ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన జైరామ్ ఠాకూర్ పేర్లు బాగా వినిపిస్తున్నాయి. -
ఈపీఎఫ్ వడ్డీ 8.75%
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరమైన 2014-15లో కూడా ఈపీఎఫ్ డిపాజిట్లపై 8.75 శాతం వడ్డీనే చెల్లించాలని ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్‌వో) మంగళవారం నిర్ణయించింది. కేంద్ర కార్మికశాఖ మంత్రి నరేంద్రసింగ్ తొమర్ అధ్యక్షతన ఢిల్లీలో జరిగిన ఈపీఎఫ్‌వో అత్యున్నత నిర్ణాయక సంస్థ కేంద్ర ట్రస్టీల బోర్డు సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయాన్ని కేంద్ర ఆర్థికశాఖ లాంఛనంగా ఆమోదించి అమలు చేయాల్సి ఉంది. ఈపీఎఫ్‌వో 2012-13లో పీఎఫ్ డిపాజిట్లపై 8.50 శాతం వడ్డీ చెల్లించగా 2013-14లో 8.75 శాతం వడ్డీ చెల్లించింది. ఈపీఎఫ్‌వోకు సుమారు 5 కోట్ల మంది చందాదారులు ఉన్నారు. మరోవైపు ఉద్యోగుల డిపాజిట్ అనుసంధాన బీమా (ఈడీఎల్ఐ) పథకం కింద అందించే ప్రయోజనాన్ని ప్రస్తుతమున్న రూ 1.56 లక్షల నుంచి గరిష్టంగా రూ. 3.60 లక్షలకు పెంచనున్నట్లు ఈపీఎఫ్‌వో కేంద్ర ప్రావిడెంట్ కమిషనర్ కె.కె.జలాన్ తెలిపారు. ఈడీఎల్ఐ కింద హామీ ఇచ్చే మొత్తాన్ని ప్రస్తుతం రూ. 6,500గా ఉన్న నెలవారీ వేతన సీలింగ్ నిష్పత్తి ప్రకారం ఇస్తుండగా త్వరలోనే రూ. 15 వేలకు పెంచనున్నారు. వేతన సీలింగ్ పెంపుతోపాటు ఈపీఎఫ్‌వో అందించే ఉద్యోగుల పెన్షన్ పథకం కింద నెలకు రూ. వెయ్యి కనీస పెన్షన్ చెల్లింపుపై నోటిఫికేషన్లను త్వరలోనే అమలు చేస్తామని కార్మికశాఖ అధికారులు ట్రస్టీల బోర్డు సమావేశంలో పేర్కొన్నారు.