శివ్‌పురి: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి, కాంగ్రెస్ నేతలకు మధ్య...మీసాల్లో ఉండే వెంట్రుకలకు, తోకలో ఉండే వెంట్రుకలకు ఉన్నంత తేడా ఉందంటూ కేంద్ర గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్, గనుల శాఖల మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ వివాదాస్పదంగా వ్యాఖ్యానించారు. మూడు రోజుల క్రితం మధ్యప్రదేశ్‌లో ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు ఆలస్యంగా వెలుగులోకి వచ్చాయి. గుజరాత్ శాసనసభ ఎన్నికల్లో హార్దిక్ పటేల్, జిగ్నేశ్ మేవానీ, అల్పేశ్ ఠాకూర్‌ల మద్దతుతో కాంగ్రెస్ బీజేపీపై పోరాడటాన్ని ప్రస్తావిస్తూ తోమర్ ఈ మాటలన్నారు. ఈ విషయంపై పీటీఐ సోమవారం మంత్రిని వివరణ కోరగా ‘నేను ఏ కాంగ్రెస్ నేత పేరునూ ప్రస్తావించలేదు. కాంగ్రెస్ నేతలు, మోదీ వ్యక్తిత్వాల మధ్య తేడాను మాత్రమే ప్రస్తావించాను’ అని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment