ఇండియాలో యువత ఎందుకు చనిపోతుందో తెలుసా? | Self-harm causing most youth deaths in India | Sakshi
Sakshi News home page

ఇండియాలో యువత ఎందుకు చనిపోతుందో తెలుసా?

Published Tue, May 10 2016 9:15 AM | Last Updated on Wed, Sep 18 2019 3:24 PM

ఇండియాలో యువత ఎందుకు చనిపోతుందో తెలుసా? - Sakshi

ఇండియాలో యువత ఎందుకు చనిపోతుందో తెలుసా?

న్యూఢిల్లీ: దేశానికి వెన్నెముక రైతు అన్నట్లే.. యువత కూడా అంతకంటే ప్రాధాన్యం. ఏ దేశంలో యువజనులు అధికంగా ఉంటారో ఆ దేశం చాలా బలంగా ఉన్నట్లు ఒక అంచనా వేస్తారు. సహజ సిద్ధంగానే ప్రపంచ దేశాలన్నింటిలో కన్నా భారత్లో యువత ఎక్కువ. అయితే, ఆ యువత అంత ఏమైపోతుంది? ముఖ్యంగా యువకులు ఎందుకు చనిపోతున్నారు? అలా చనిపోవడానికి గల కారణాలు ఏమిటి? గతంలో ఎన్ని మరణాలు ఉన్నాయి? ఇప్పుడెంతమంది చనిపోతున్నారు? వంటి పలు అంశాలపైన 2013నాటి సమాచారం ప్రకారం ఇన్ స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ మెట్రిక్స్ అండ్ అవల్యూషన్ (ఐహెచ్ఎంఈ) అనే సంస్థ వెల్లడించింది.

ఇది 15 నుంచి 24 ఏళ్ల వయసు మధ్యలో ఉన్నవారి మరణాలను విశ్లేషించింది. దీని ప్రకారం భారతీయ యువత మరణాలు అన్ని కూడా తమకు తాము హానీ చేసుకోవడం మూలంగానే జరుగుతున్నాయి. ఒక్క 2013లోనే 60 వేల మంది భారతీయ యువత చనిపోయిందని, వీరంతా ఆత్మహత్యవంటి తమకు తమకు తాము హానీ చేసుకునే చర్యలకు పాల్పడటం వల్లే ఇన్ని మరణాలు సంభవించాయని పేర్కొంది. ద్విచక్ర వాహనాల ప్రమాదాల్లో దాదాపు 37 వేలమంది యువకులు ప్రాణాలు విడిచినట్లు తెలిపింది.

గతంలో 1990లో ఇలా తమకు తాము హానీ చేసుకోవడం వల్ల 37,630మంది ప్రాణాలుకోల్పోయారని ఇది అనూహ్యంగా ఇప్పుడు 60 వేలకు పెరగడం ఆందోళనకరమని చెప్పారు. ఈ సంఖ్య ప్రస్తుతం ట్యూబర్ క్యులోసిస్ కారణంగా చనిపోతున్న వారి సంఖ్యను కూడా దాటేసిందని వెల్లడించారు. 'ఇంతమంది యువత చనిపోతున్నా ఇండియాలో వాటి నివారణకు పెద్దగా ఏమీ చేయడం లేదు.

అదే చైనా, శ్రీలంక వంటి దేశాల్లో ఈ విషయం సీరియస్ గా తీసుకుంటున్నారు. వెంటనే కేంద్ర ప్రభుత్వం ఒక జాతీయ స్థాయి అవగాహన కార్యక్రమం తీసుకురాకుంటే ఈ యువత గురించి పెద్ద మొత్తంలో మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది' అని ఆ నివేదిక పేర్కొంది. తమకు తాము హానీ చేసుకోవడం మూలంగా చైనాలో ఏడాదికి చనిపోతున్న 15-24 ఏళ్ల మధ్య వయసు ఉన్న యువత 11,074 ఉండగా.. బ్రెజిల్ లో ఇది 2,697 మాత్రమే ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement