సాక్షి, న్యూఢిల్లీ : రఫేల్ యుద్ధ విమానాల కొనుగోలు వ్యవహారంలో కేంద్రానికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. రఫేల్ తీర్పుపై రివ్యూ పిటిషన్లపై కేంద్ర ప్రభుత్వం లేవనెత్తిన అభ్యంతరాలను సర్వోన్నత న్యాయస్ధానం తోసిపుచ్చింది. రివ్యూ పిటిషన్ల విచారణకు అంగీకరించిన సుప్రీం త్వరలో విచారణ తేదీని నిర్ణయిస్తామని స్పష్టం చేసింది.
రఫేల్ ఒప్పంద పత్రాలను తస్కరించారన్న కేంద్ర ప్రభుత్వ అభ్యంతరాలను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గగోయ్, జస్టిస్ ఎస్‌కే కౌల్, జస్టిస్ కేఎం జోసెఫ్‌లతో కూడిన ధర్మాసనం తోసిపుచ్చుతూ తీర్పును వెలువరించింది. రఫేల్ ఒప్పందంలో విచారణ చేపట్టాల్సిన అంశాలేమీ లేవని గతంలో సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును సమీక్షించాలని కోరుతూ విపక్షాలు సర్వోన్నత న్యాయస్ధానాన్ని ఆశ్రయించి రివ్యూ పిటిషన్‌ను దాఖలు చేసిన సంగతి తెలిసిందే. నూతన అంశాలతో పిటిషనర్లు దాఖలు చేసిన రివ్యూ పిటిషన్లపై విచారణ కొనసాగిస్తామని కోర్టు తేల్చిచెప్పింది.
Comments
Please login to add a commentAdd a comment