మోడీ పర్యటన నేపథ్యంలో ఉగ్రవాదుల దాడి | Seven troopers injured in Kashmir guerrilla attack | Sakshi
Sakshi News home page

మోడీ పర్యటన నేపథ్యంలో ఉగ్రవాదుల దాడి

Published Tue, Aug 12 2014 8:48 AM | Last Updated on Wed, Aug 15 2018 2:20 PM

Seven troopers injured in Kashmir guerrilla attack

న్యూఢిల్లీ : ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మంగళవారం జమ్మూ కాశ్మీర్లో పర్యటించనున్నారు. లడక్, సియాచిన్లలో ఆయన పర్యటించనున్నారు. పర్యటనలో మోడీ భాగంగా రెండు విద్యుత్ ప్రాజెక్టుల్ని ప్రారంభించనున్నారు. వీటితో  పాటు సియాచిన్లో సైనికులను ఉద్దేశించి మోడీ ప్రసంగించే అవకాశం ఉంది. ఆయన ఈరోజు ఉదయం పది గంటలకు లడక్ చేరుకుంటారు.

మోడీకి రాష్ట్ర గవర్నర్ ఎన్.ఎన్.ఓహ్రా, ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లాతో పాటు కేంద్రమంత్రి పియూష్ గోయల్, ఇతర అధికారులతో పాటు బీజేపీ నేతలు స్వాగతం పలకనున్నారు. మరోవైపు మోడీ పర్యటన నేపథ్యంలో బీఎస్ఎఫ్ జవాన్ల కాన్వాయ్పై ఉగ్రవాదులు దాడి చేశారు. గాయపడినవారిని చికిత్స నిమిత్తం ఆర్మీ ఆస్పత్రికి తరలించారు.  ఈ ఘటనలో ఏడుగురు జవాన్లు గాయపడ్డారు.

 

అమర్ నాథ్ యాత్రను ముగించుకుని తిరిగి వస్తున్న భద్రతా బలగాలపై దాడి చేశారు. అయితే భారత జవాన్లు ఆ దాడిని తిప్పికొట్టారు. ఈ ఘటనతో జమ్మూ కాశ్మీర్లో హై ఎలర్ట్ ప్రకటించారు.  ప్రస్తుతం 3 వేలమంది సైనికులు పహారా కాస్తున్నారు. కాల్పుల నేపథ్యంలో గట్టి భద్రతా ఏర్పాట్లు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement