నా దేశభక్తిని ప్రశ్నించేవాళ్లు స్టుపిడ్స్! | Shah Rukh Khan Says Those Who Question His Patriotism Are "Stupid" | Sakshi
Sakshi News home page

నా దేశభక్తిని ప్రశ్నించేవాళ్లు స్టుపిడ్స్!

Published Wed, Dec 9 2015 9:36 AM | Last Updated on Sun, Sep 3 2017 1:44 PM

నా దేశభక్తిని ప్రశ్నించేవాళ్లు స్టుపిడ్స్!

నా దేశభక్తిని ప్రశ్నించేవాళ్లు స్టుపిడ్స్!

ముంబై: తాను లౌకిక వాదినని (సెక్యులర్) రుజువు చేసుకోవాల్సిన అవసరం తనకు లేదని బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ పేర్కొన్నాడు. దేశంలో అసహనంపై తాను చేసిన వ్యాఖ్యలు.. వివాదాస్పదమైన నేపథ్యంలో షారుఖ్ ఈ విధంగా స్పందించారు. ఓ  టీవీ చానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో 'అసహనం' చర్చ గురించి ప్రశ్నించగా 'దీని గురించి నిజంగా నాకేమీ తెలియదు. నేను ఉన్నది ఉన్నట్టు స్పష్టంగా చెప్తాను. మంచి విషయాలు మాట్లాడుతాను. అంతేకాకుండా నేను సెక్యులర్ అని రుజువు చేసుకోవాల్సిన అవసరం లేదని భావిస్తాను' అని ఆయన బదులిచ్చారు. 

'మన ముందుకుసాగాలంటే లింగ వివక్ష, వర్ణవివక్ష, ఓ  వ్యక్తి ఏ ప్రాంతం నుంచి వచ్చాడు, ఏ మతం వాడు, ఏ కులం వాడు వంటి అంశాలను మన మనస్సులో పెట్టుకోకూడదు. అలాంటి విషయాలకు అంతే ఉండదు' అని షారుఖ్ చెప్పాడు. కాబట్టి తాను సినిమాలు, నటన గురించి మాట్లాడాలని నిశ్చయించుకున్నట్టు తెలిపాడు.

'నీకంటే నేను ఎక్కువ దేశభక్తుడిని అని ఎవరైనా చెబితే.. అతను మూర్ఖుడు (స్టుపిడ్). ఏ కోణంలో ఒకరు తనకు తాను అధిక దేశభక్తుడినని అనుకోగలరు? దీనిలో ఎలాంటి హేతుబద్ధత లేదు. నీ కంటే నేనే ఎక్కువ దేశభక్తుడినంటూ మనం కేకలు పెడుతున్నాం. నిజానికి మనమందరం దేశభక్తులమే' అని చెప్పాడు. దేశంలోని పరిస్థితులపై గత ఇంటర్వ్యూలో తాను మనసులోని అభిప్రాయాలు వెల్లడించానని, వాటిని నెగిటివ్ దృష్టితో తీసుకున్నారని షారుఖ్ చెప్పారు. దాంతోపాటు ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వంపై షారుఖ్ ప్రశంసల జల్లు కురిపించారు. మోదీ పాలన అద్భుతంగా ఉందని కొనియాడారు.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement