చావుబతుకుల మధ్య మరో 'నిర్భయ' | Shot twice, she spent night in well | Sakshi
Sakshi News home page

చావుబతుకుల మధ్య మరో 'నిర్భయ'

Published Tue, Dec 8 2015 10:12 AM | Last Updated on Wed, Oct 17 2018 5:51 PM

చావుబతుకుల మధ్య మరో 'నిర్భయ' - Sakshi

చావుబతుకుల మధ్య మరో 'నిర్భయ'

న్యూఢిల్లీ: దేశరాజధాని ఢిల్లీ శివారులో మరో దారుణం జరిగింది. ముగ్గురు దుండగులు ఓ బాలికను కిడ్నాప్ చేసి 15 రోజుల పాటు సామూహిక అత్యాచారం చేశారు. అనంతరం ఆమెను పిస్టల్తో కాల్చి నీళ్లులేని 30 అడుగుల లోతు బావిలో పడేసి వెళ్లిపోయారు. తీవ్రంగా గాయపడిన ఆ అమ్మాయి కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతోంది.


గత నెల 22న పశ్చిమ ఢిల్లీలో ముగ్గురు వ్యక్తులు 15 ఏళ్ల బాలికను కిడ్నాప్ చేసి ఓ కారులో తీసుకువచ్చి గ్రేటర్ నోయిడాలోని ఓ గ్రామం వెలుపల ఫాంహౌజ్లో బంధించారు. 15 రోజుల పాటు ఆమెపై ఆఘాయిత్యానికి పాల్పడ్డారు. ఓ రోజు రాత్రి ఆ అమ్మాయి వీరి నుంచి తప్పించుకుని పారిపోయిందుకు ప్రయత్నించగా, దుండగులు ఆమెను కాల్చి బావిలో పడేశారు. చనిపోయిందని భావించి అక్కడి నుంచి వెళ్లిపోయారు. మరుసటి రోజు చుట్టుపక్కలవారు బాధితురాలి కేకలు విని, బావిలో నుంచి ఆమెను బయటకు తీసి పోలీసులకు సమాచారం అందించారు. ఓ మోటార్ బైకుపై ఆ అమ్మాయిని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి చికిత్స చేయించారు. ఛాతీ, పొత్తికడుపులోకి బుల్లెట్లు దూసుకెళ్లడం వల్ల ఎక్కువగా రక్తస్త్రావం అయినా, ఓ రాత్రి చికిత్స లేకుండా గడిపినా బాధితురాలు బతికుండడం చూసి డాక్టర్లు ఆశ్చర్యపోయారు. బాధితురాలి పరిస్థితి విషమంగా ఉన్నా.. స్పృహలో ఉందని వైద్యులు తెలిపారు. కృష్ణ అనే వ్యక్తి మరో ఇద్దరు మైనర్లతో కలసి ఈ దారుణానికి పాల్పడినట్టు బాధితురాలు పోలీసులకు చెప్పింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement