మాట్లాడుతున్న స్వామి నిశ్చలానంద సరస్వతి
భువనేశ్వర్/పూరీ : జగన్నాథుని దేవస్థానం శ్రీ మందిరంలోకి హిందూయేతరుల్ని అనుమతించాలనే సుప్రీం కోర్టు ప్రతిపాదనతో రాష్ట్రం అట్టుడికిపోతుంది. పలు వర్గాలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. ఈ క్రమంలో పూరీ గోవర్థన పీఠాధిపతి ఆది శంకరాచార్యులు స్వామి నిశ్చలానంద సరస్వతి ఘాటుగా స్పందించారు. జగన్నాథుడు కొలువు దీరి పూజలు అందుకుంటున శ్రీమందిరం గాంధీ సమాధి స్థలం కాదు.
విద్య, సంస్కృతి, ధర్మాలకు ఇదో సర్వోన్నత సంస్థానం. హిందూ శాస్త్రాల్లో దేవస్థానాల అమూల్యతని పరిరక్షించడం అందరి బాధ్యతగా గుర్తించాలి. శ్రీ మందిరం అన్ని మతాల సమగ్ర వేదిక కాదని ఆయన పరోక్షంగా ఇంగితం చేయడం విశేషం.
గాంధీ సమాధికి అనుసరిస్తున్న రీతి రివాజుని జగన్నాథుడు కొలువు దీరిన శ్రీ మందిరానికి వర్తింపజేయడం ఎంత మాత్రం తగదని తీవ్రంగా స్పందించారు. గాంధీ సమాధిని అమెరికా అధ్యక్షుడు సందర్శించిన సందర్భంగా జాగిలాలతో భద్రత, రక్షణ తనిఖీలు నిర్వహించారు. ఈ దయనీయ పరిస్థితిని శ్రీ మందిరంలో చొరబెడతామంటే ఎలా కుదురుతుందని ఆవేదన వ్యక్తం చేశారు.
సనాతన ధర్మాలతో దేవస్థానాలు నడపాలి
సనాతన ధర్మాలు, ఆచారాలతో దేవస్థానాల్ని నిర్వహించాలని లోగడ న్యాయస్థానాలు తీర్మానించిన విషయాన్ని ఆది శంకరాచార్యులు ఈ సందర్భంగా గుర్తుచేశారు. ప్రస్తుతం శ్రీ మందిరం సంస్కరణల్ని పర్యవేక్షిస్తున్న సుప్రీం కోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఆదర్శ్ కుమార్ గోయల్ లోగడ రాష్ట్ర హై కోర్టు న్యాయమూర్తిగా బాధ్యతలు నిర్వహించారు. అప్పట్లో ఆయన విచారణ జరిపిన కేసులో శ్రీ మందిరం వ్యవహారాల్లో శంకరాచార్యులదే తుది నిర్ణయంగా తీర్పు జారీ చేసిన విషయాన్ని గుర్తుచేశారు.
న్యాయ నిపుణులు పరిశీలించాలి
పురస్కరించుకుని సుప్రీం కోర్టు మార్గదర్శకాలతో మధ్యంతర ఉత్తర్వుల్ని జారీ చేసింది. ఈ ఉత్తర్వుల్ని న్యాయ నిపుణులు క్షుణ్ణంగా పరిశీలించాల్సి ఉందన్నారు. ఈ ఏడాది జగన్నాథుని రథ యాత్ర ముగిసిన తర్వాత జగన్నాథ ఆలయం పాలక వర్గంతో సమావేశం కానున్నట్టు శంకరాచార్యులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment