న్యూఢిల్లీ: కర్ణాటక సంగీత గాత్ర విద్వాంసుడు టీఎం కృష్ణ 2015–16 సంవత్సరానికి ఇందిరాగాంధీ జాతీయ సమగ్రతా అవార్డుకు ఎంపికయ్యారు. అక్టోబర్ 31న ఇందిరాగాంధీ వర్థంతి రోజు కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా ఈ అవార్డును అందజేస్తారు. 2016లో టీఎం కృష్ణ రామన్ మెగ్‌సెసె అవార్డు అందుకున్నారు. కర్ణాటక సంగీత విద్వాంసుడిగానే కాకుండా.. ఒక సామాజిక కార్యకర్తగా సంగీత రంగంలో కులాల అడ్డుగోడల్ని కూల్చేసి అందరికీ భాగస్వామ్యం కల్పించేందుకు కృషిచేశారు.
Comments
Please login to add a commentAdd a comment