'కారు బాంబులతో దాడి చేయవచ్చు'
న్యూఢిల్లీ : దేశంలోని అన్ని ప్రధాన అన్ని విమానాశ్రయాలకు బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ(బీసీఏఎస్) మంగళవారం హెచ్చరికలు జారీ చేసింది. ముఖ్యంగా దక్షిణ భారత దేశంలోని విమానాశ్రయాలకు భద్రతను పెంచటంతో పాటు కట్టుదిట్టం చేయాలని సూచించింది. కారు బాంబులతో తీవ్రవాదులు దాడి చేసే అవకాశం ఉందని ముందస్తు హెచ్చరికలు జారీ చేసింది.
దీంతో ఉన్నతాధికారులు హైదరాబాద్ సహా అన్ని ఎయిర్‌పోర్ట్‌లకు భద్రతను పెంచారు. హెచ్చరికలు నేపథ్యంలో పోలీసులు అన్ని విమానాశ్రయల్లో తనిఖీలు ముమ్మరం చేశారు. విమానాశ్రయ పరిసర ప్రాంతాలను పోలీసులు క్షుణ్ణంగా సోదాలు నిర్వహిస్తున్నారు. అలాగే రోజుల కొద్దీ పార్క్ చేసిన వాహనాలను తొలగించాలని ఆదేశించారు.