న్యూఢిల్లీ : భానుడి ప్రతాపంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న తెలుగు రాష్ట్రాలకు చల్లని కబురు. దేశ ప్రజలు ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్న నైరుతి రుతుపవనాలు ఎట్టకేలకు కేరళ తీరాన్ని తాకాయి. మాల్దీవులు, కోమోరిన్ ప్రాంతాలు, దక్షిణ అరేబియా సముద్రంలో కొన్ని ప్రాంతాలు, లక్షదీవులు, కేరళ , దక్షిణ తమిళనాడులో కొన్ని ప్రాంతాలు, నైరుతి బంగాళాఖాతం, ఆగ్నేయ బంగాళాఖాతం, తూర్పుమధ్య బంగాళాఖాతం మరియు ఈశాన్య బంగాళాఖాతంలో కొన్ని ప్రాంతాలలోనికి నైరుతి రుతుపవనాలు విస్తరించాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఇక తెలుగు రాష్ట్రాల్లోకి నైరుతి రుతుపవనాలు ఈ నెల 11న ప్రవేశించనున్నాయి.
11న రాయలసీమ మీదుగా ఏపీలోకి రుతుపవనాలు ప్రవేశించనున్నాయి. ఈ నెల 13 నుంచి 15 మధ్య తెలంగాణలోకి ప్రవేశించనున్నట్టు వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ రోజు ఆంధ్రప్రదేశ్‌లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో పాటు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది.
Comments
Please login to add a commentAdd a comment