South West Monsoon
-
తెలంగాణలోకి నైరుతి వచ్చేసింది
సాక్షి, హైదరాబాద్: నైరుతి రుతుపవనాలు రాష్ట్రంలోకి ప్రవేశించాయి. వాతావరణ శాఖ ఈ నెల 5 నాటికి రుతుపవనాలు రాష్ట్రంలోకి ప్రవేశిస్తాయని అంచనా వేసింది. కానీ వాతావరణ పరిస్థితులు కలసిరావడంతో సోమవారమే నల్లగొండ, నాగర్‌కర్నూల్ జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లోకి రుతుపవనాలు వచ్చేసినట్టు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. వచ్చే 4,5 రోజుల్లో రాష్ట్రంలోని చాలా ప్రాంతాలకు రుతు పవనాలు విస్తరించే అవకాశం ఉందన్నారు. గత ఏడాది కరువు ఛాయలతో.. గతేడాది నైరుతి రుతుపవనాలు ఆలస్యంగా జూన్ 22న రాష్ట్రంలోకి ప్రవేశించాయి. ఆ తర్వా త కూడా ఆశించిన స్థాయిలో వానలు పడలేదు. వర్షాల మధ్య తీవ్ర అంతరంతో చాలా ప్రాంతాల్లో కరువు ఛాయలు కనిపించాయి. పంటల సాగు, దిగుబడులపై తీవ్ర ప్రభావం పడింది. అంతకుముందు 2022 వానాకాలంలో రుతుపవనాలు జూన్ 8న ప్రవేశించాయి. ఆ సీజన్లో రాష్ట్రవ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిశాయి. సాధారణ వర్షపాతం కంటే దాదాపు 48శాతం అధికంగా నమోదయ్యాయి. రెండు రోజుల పాటు వానలు బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం సోమవారం కూడా కొనసాగింది. దాని ప్రభావంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడొచ్చని వాతావరణ శాఖ వెల్లడించింది. సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా గరిష్ట ఉష్ణోగ్రతలు తగ్గిపోయాయి. చాలాచోట్ల సాధారణం కంటే 4 నుంచి 7 డిగ్రీల వరకు తక్కువగా నమోదైనట్టు వాతావరణ శాఖ తెలిపింది. వచ్చే 2 రోజులు కూడా ఉష్ణోగ్రతలు తక్కువగానే ఉంటాయని పేర్కొంది. -
అంచనాల కంటే ముందే.. రైతులకు గుడ్ న్యూస్
న్యూఢిల్లీ, సాక్షి: నైరుతి రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకాయని గురువారం ప్రకటించిన భారత వాతావరణ శాఖ.. మరో చల్లని వార్త చెప్పింది. అనుకున్న తేదీ కన్నా ముందే పలు ప్రాంతాల్లోకి ఇవి ప్రవేశించే సూచనలు కనిపిస్తున్నాయని తాజాగా వెల్లడించింది. ఇప్పటికే త్రిపుర, మేఘాలయ, అస్సాం, పశ్చిమబెంగాల్, సిక్కిం రాష్ట్రాల్లోకి రుతుపవనాలు ప్రవేశించాయి. లక్షద్వీప్, కేరళ, కర్ణాటక, తమిళనాడు సహా పలు ప్రాంతాల్లోకి ముందే ప్రవేశించే పరిస్థితులు కనిపిస్తున్నాయి. సాధారణంగా జూన్ 1వ తేదీన నైరుతి రుతుపవనాలు కేరళలోకి ప్రవేశిస్తాయి. ఆ తర్వాత జూన్ 5 నాటికి అరుణాచల్ ప్రదేశ్, త్రిపుర, నాగాలాండ్, మేఘాలయ, మిజోరం, మణిపుర్, అస్సాం రాష్ట్రాలకు చేరుకుంటాయి. అయితే.. ఇదీ చదవండి: ఏపీలో పలుచోట్ల భారీ వర్షంఈసారి రుతుపవనాల ఆగమనం సమయంలోనే బంగాళాఖాతంలో రెమాల్ తుపాను ఏర్పడింది. ఇది రుతుపవనాల గమనాన్ని బలంగా లాగిందని, అందుకే నిర్ణీత సమయానికంటే ముందుగానే అవి ఈశాన్య రాష్ట్రాలకు చేరుకున్నాయని వాతావరణ శాస్త్రవేత్తలు వివరించారు.వ్యవసాయ ఆధారిత ఆర్థిక వ్యవస్థకు జీవనాడిగా నైరుతి రుతుపవనాలను పేర్కొంటారు. మరోవైపు తెలుగు రాష్ట్రాలకు కూడా జూన్ 5వ తేదీలోపే రుతుపవనాలు చేరతాయని వాతావరణ శాఖ తెలిపింది. అయితే ఈలోపు ప్రీ మాన్ సూన్ వల్ల అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు అవుతాయని తెలిపింది. అక్కడక్కడా వర్షాలు పడ్డప్పటికీ.. మరో మూడు రోజులపాటు అధిక ఉష్ణోగ్రతలు నమోదు అవుతాయని ఐఎండీ హెచ్చరించింది. -
నేడు కేరళకు నైరుతి రుతుపవనాల రాక.. రెండు రోజుల్లో రాయలసీమలో ప్రవేశించే అవకాశం.. ఇంకా ఇతర అప్డేట్స్
-
Telangana: జూన్ మొదటి వారంలో నైరుతి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రజలకు వాతావరణ శాఖ చల్లని కబురు చెప్పింది. గతేడాదితో పోలిస్తే ఈసారి రాష్ట్రంలో సంతృప్తికర వర్షాలు కురుస్తా యని తెలిపింది. జూన్ మొదటి వారంలోనే రాష్ట్రంలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశిస్తాయని పేర్కొంది. నైరుతి రుతుపవనాల సీజన్‌పై ప్రాథ మిక అంచనాలను వాతావరణ శాఖ విడుదల చేసింది. ‘సాధారణంగా మే నెల చివరి వారంలో దక్షిణ అండమాన్ సముద్రంలోకి నైరుతి రుతుప వనాలు ప్రవేశిస్తాయి. ఆ తర్వాత రెండు వారాల్లో కేరళను తాకిన తర్వాత క్రమంగా ఇతర ప్రాంతాలకు వ్యాప్తి చెందుతాయి. కానీ ఈ సీజన్లో కాస్త ముందుగానే దక్షిణ అండమాన్ సముద్రంలోని నైరుతి రుతుపవనాలు ప్రవేశించే పరిస్థితు లు ఎక్కువగా ఉన్నాయి. ఈ క్రమంలో జూన్ ఒకటో తేదీన కేరళను తాకుతాయి. అవి క్రమంగా వ్యాప్తి చెంది ఆరు రోజుల్లో తెలంగాణలోకి ప్రవే శిస్తాయి..’ అని వాతావరణ శాఖ వెల్లడించింది. ఎల్‌నినో బలహీనపడే అవకాశం‘ఈ ఏడాది జూన్ నుంచి సెప్టెంబర్ మధ్యన నైరుతి రుతుపవనాల సీజన్లో వర్షాలు ఆశాజనకంగా ఉంటాయి. గతేడాది కంటే కాస్త ఎక్కువ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ప్రస్తుతం భూమధ్యరేఖ పసిఫిక్ ప్రాంతంలో మధ్యస్థ ఎల్‌నినో పరిస్థితులు నెలకొని ఉన్నాయి. నైరుతి సీజన్ ప్రారంభంలో ఎల్‌నినో పరిస్థితులు బలహీనపడే అవకాశం ఎక్కువగా ఉన్నాయి. దీంతో వర్షపాతం సాధారణం కంటే ఎక్కువగా ఉంటుంది. రాష్ట్రంలో నైరుతి రుతు పవనాల సీజన్లో కురవాల్సిన సాధారణ వర్ష పాతం 72.21 సెంటీమీటర్లు. గత 2021, 2022 సీజన్లలో సాధారణం కంటే 40 శాతం అధిక వర్షాలు నమోదయ్యాయి. అయితే 2023 నుంచి ఎల్‌నినో ప్రభావంతో వర్షపాతం ఒక్కసారిగా తగ్గింది. గతేడాది వానాకాలం సీజన్లో సాధారణ వర్ష పాతం నమోదైనప్పటికీ కొన్ని ప్రాంతాల్లో తీవ్ర మైన డ్రైస్పెల్స్, కొన్ని ప్రాంతాల్లో కుండపోత వానలు నమోదయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా చూస్తే సాధారణ వర్షపాతం నమోదు కాగా.. జిల్లాల వారీగా పరిస్థితి మాత్రం భిన్నంగా ఉంది. చాలా మండలాల్లోని అనేక ప్రాంతాల్లో లోటు వర్షపాతం నమోదయ్యింది. కాగా ఈసారి నైరుతి సీజన్ ప్రథ మార్థంలో ఎల్‌నినో ప్రభావం బలహీనపడి, సీజన్ ప్రారంభం నుంచే వర్షాలు కురుస్తాయని, రాష్ట్రంలో సీజన్ సాధారణ వర్షపాతం 72.21 సెంటీమీటర్ల కంటే ఎక్కువ వర్షపాతమే నమోదు కావొచ్చని వివ రించింది. నైరుతి సీజన్లో 106 శాతం వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది.తేలికపాటి నుంచి మోస్తరు వర్షసూచనపశ్చిమ విదర్భ, దాని పరిసర ప్రాంతాలలో ఏర్పడిన ఆవర్తనం బుధవారం తూర్పు విదర్భ దాని పరిసర ప్రాంతాల్లో కేంద్రీకృతమై ఉన్నట్లు వాతావరణ శాఖ వివరించింది. ఇది సముద్ర మట్టం నుంచి సగటున 0.9 కిలోమీటర్ల ఎత్తులో కొనసాగుతున్నట్లు తెలిపింది. రాష్ట్రానికి దక్షిణ, ఆగ్నేయ దిశ నుంచి బలమైన గాలులు వీస్తున్నట్లు సూచించింది. రానున్న రెండ్రోజులు రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపింది. ఆదిలాబాద్, కుమ్రుంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, వికారాబాద్, సంగారెడ్డి, కామారెడ్డి, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, వనపర్తి, నారాయణపేట జిల్లాల్లో అక్కడక్కడా తేలికపాటి వానలు కురిసే అవకాశం ఉందని వివరించింది.బుధవారం రాష్ట్రంలో చాలాచోట్ల గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే తక్కువగా నమోదయ్యాయి. ప్రధాన నగరాల్లో నమోదైన గరిష్ట ఉష్ణోగ్రతలు పరిశీలిస్తే.. నల్లగొండలో 39.5 డిగ్రీల సెల్సియస్ గరిష్ట ఉష్ణోగ్రత, మెదక్‌లో 21.5 డిగ్రీ సెల్సియస్ కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. -
3 రోజులు ముందుగానే ‘నైరుతి’!
సాక్షి, విశాఖపట్నం/సాక్షి హైదరాబాద్: నైరుతి రుతుపవనాలు ఈ ఏడాది కాస్త ముందుగానే వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. సాధారణంగా దక్షిణ అండమాన్ సముద్రంలోకి ఏటా మే 22న నైరుతి రుతుపవనాలు ప్రవేశిస్తాయి. తర్వాత వారం, పది రోజుల్లో కేరళను తాకుతాయి. ఈ ఏడాది నైరుతి మూడు రోజులు ముందే.. మే 19న దక్షిణ అండమాన్ సముద్రం, దానికి ఆనుకుని ఉన్న ఆగ్నేయ బంగాళాఖాతం, నికోబార్ దీవుల్లోకి ప్రవేశించే అవకాశం ఉందని ఐఎండీ సోమవారం వెల్లడించింది. వచ్చే నెల ఒకటి నాటికి కేరళకు!: వచ్చే నెల ఒకటో తేదీలోగా నైరుతి రుతుపవనాలు కేరళకు చేరుకునే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇది సానుకూల పరిణామమని అంటున్నారు. అయితే రుతుపవనాలు కేరళకు సకాలంలో చేరాలంటే అరేబియా సముద్రంలో అనుకూల వాతావరణం ఉండాలి. వాటి ఆగమనానికి ముందు అరేబియా సముద్రంలో అల్పపీడనం గానీ, వాయుగుండం గానీ ఏర్పడకూడదు. అలా ఏర్పడితే నైరుతి రాకను ఆలస్యం చేస్తాయి. ఇప్పుడున్న పరిస్థితుల మేరకు.. ఈ నెలాఖరులోగా అరేబియా సముద్రంలో అల్పపీడనం ఏర్పడే అవకాశాలు కొంత కనిపిస్తున్నాయని వాతావరణ నిపుణులు చెప్తున్నారు. మరికొన్ని రోజులైతే స్పష్టత వస్తుందని అంటున్నారు. నిజానికి గత ఏడాది నైరుతి రుతుపవనాలు మే 19నే దక్షిణ అండమాన్ సముద్రంలోకి ప్రవేశించాయి. కానీ ప్రతికూల పరిస్థితుల వల్ల ఆలస్యంగా జూన్ 8న కేరళను తాకాయి. రాష్ట్రంలో రెండు రోజులు వానలు: తెలంగాణలోని పలు ప్రాంతాల్లో మంగళ, బుధవారాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశంఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. రాష్ట్రానికి దక్షిణ, ఆగ్నేయ దిశల నుంచి బలమైన గాలులు వీస్తాయని వెల్లడించింది. -
చురుగ్గా నైరుతి రుతుపవనాలు.. ఏపీలో భారీ వర్షాలు!
-
తెలుగు రాష్ట్రాల్లో మరో 10 రోజులపాటు ఉష్ణతాపం
-
రుతుపవనాల దోబూచులాట
గ్రీష్మకాల మార్తాండుడు నిప్పులు చెరుగుతున్నవేళ నీలాకాశం నల్లటి మబ్బు తెరలతో గొడుగు పట్టాలని ప్రతి ఒక్కరూ ఆశిస్తారు. ఆ మేఘాలు తమ హృదయ కవాటాలు తెరిచి చినుకు ధారలతో నేలతల్లికి అభిషేకం చేస్తే ఇక చెప్పేదేముంది? అందుకే ‘వానంటే ప్రకృతి వరప్రసాదం. నింగి నేలకు దిగిరావడం’ అంటాడు అమెరికన్ రచయిత, కవి జాన్ అప్డైక్. మన దేశంలో జోరుగా వానలు మోసుకొచ్చే నైరుతీ రుతుపవనాల గురించి భారత వాతావరణ విభాగం (ఐఎండీ) ఏటా విడుదల చేసే అంచనాల గురించి అందరిలోనూ ఆసక్తి ఉంటుంది. అంచనాలు తప్పినప్పుడు ఆసక్తి స్థానంలో నిరాసక్తత ఏర్పడటమూ రివాజే. ఈసారి కూడా ఐఎండీ అంచనాలు కాస్త గురితప్పాయి. చాలా ముందే రుతుపవనాలు ఆగమిస్తాయని చెప్పడంతో మొదలుపెట్టి అవి వచ్చేశాయని కూడా ప్రకటించి నాలిక్కరుచుకోవడంతో ఎప్పటికన్నా ఎక్కువగా ఐఎండీపై విమర్శల జోరు పెరిగింది. ‘కడుపుతో ఉన్నమ్మ కనక మానుతుందా’ అన్నట్టు శుక్రవారం నాటికి దాదాపు కేరళ అంతటా వర్షాలు మొదలయ్యాయని తాజా సమాచారం చెబుతోంది. వాతావరణ అంచనాలకు సంబంధిం చిన ఉపకరణాలు, సాంకేతికతలు అభివృద్ధి చెందిన ఈ కాలంలో కూడా ఐఎండీకి తొట్రుపాటు ఎందుకు తప్పడం లేదు? ‘సాంకేతికతలుంటేనే సరిపోదు, వాటిని సక్రమంగా వినియోగించాలి. పద్ధతులు పాటించాలి’ అంటోంది ప్రైవేటు వాతావరణ పరిశోధనా సంస్థ స్కైమెట్. ఒక రంగంలో పనిచేసేవారి మధ్య తెలియని పోటీతత్వం ఉండటం, పరస్పరం విమర్శించుకోవడం అసహజమేమీ కాదు. కనుక స్కైమెట్ విమర్శే సర్వస్వం అనుకోనవసరం లేదు. ఐఎండీ ఎప్పటిలాగే ఈ ఏడాది కూడా అంచనాలు అందించింది. ఈసారి దేశ వాయవ్య ప్రాంతంలో తప్ప ఇతరచోట్ల 103 శాతం వరకూ వర్షపాతం ఉండొచ్చని చెప్పింది. దక్షిణ అండమాన్, ఆగ్నేయ బంగాళాఖాతం పరిసరాల్లో మే నెల 15 కల్లా నైరుతీ రుతుపవనాలు ఆగమిస్తాయన్నది. 19న మరో అంచనా విడుదల చేసింది. అయిదారు రోజులు ముందు... అంటే ఏటా ఇంచుమించు జూన్ 1 ప్రాంతంలో కేరళను పలకరించే రుతుపవనాలు మే 25 నాటికే రావొచ్చని వివరించింది. చివరకు రుతుపవనాలు వచ్చేశాయని 29న కురిసిన వర్షాల ఆధారంగా ఐఎండీ మరో ప్రకటన విడుదల చేసింది కూడా. అయితే ఆ మర్నాడే ఒక వివరణనిచ్చింది. వాతావరణ పరిస్థితుల రీత్యా రుతుపవనాలు ప్రభావం అన్నిచోట్లా సమంగా ఉండకపోవచ్చని తెలిపింది. నిజమే. కేరళలోని 14 వర్షపాత నమోదు కేంద్రాల్లో ఒక్కచోట కూడా వానపడిన దాఖలా లేదు. మరో రెండు కేంద్రాల్లో మాత్రం ఒక మిల్లీమీటరు వర్షపాతం కన్నా తక్కువ నమోదైంది. కేవలం 29న పడిన వర్షం ఆధారంగా అంచనాలు ప్రకటించడం ప్రమాణాలు ఉల్లంఘించడమేనన్నది స్కైమెట్ ఆరోపణ. ‘వాన రాకడ... ప్రాణం పోకడ ఎవరికీ తెలియదు’ అన్నది నానుడి. కానీ ఏళ్లు గడుస్తున్నకొద్దీ ఈ నానుడికి విలువ లేకుండా పోతున్నది. క్షణంసేపు ఆగిన ప్రాణాన్ని సైతం నిలబెడుతున్న మాదిరే వాతావరణ అంచనాలు కూడా దాదాపు సరిగానే ఉంటున్నాయి. అలాగని ప్రమాణాలను పక్కన బెట్టి ఇష్టానుసారం అంచనాలివ్వడం సరికాదు. ఒకటి రెండు రోజులు వేచిచూసి, అన్నివిధాలా అధ్యయనం చేస్తే వచ్చే నష్టం లేదు. ఇంకా చెప్పలేదేమని నిలదీసేవారెవరూ ఉండరు. కానీ అశాస్త్రీయ అంచనాలు వెలువరిస్తే పరిశోధనా సంస్థలకుండే ప్రతిష్ఠ దెబ్బతింటుంది. మార్కెట్లు మెరిసిపోవడానికీ, మదుపరులు హుషారెత్తడానికీ ‘మంచి అంచనాలు’ ఇవ్వాలని వచ్చిన రాజకీయ ఒత్తిడుల కారణంగానే ఐఎండీ అడ్డతోవలో అంచనాలు వేసిందన్న ఆరోపణలున్నాయి. అందులోని నిజానిజాల మాటెలా ఉన్నా అంచనాలు తప్పినప్పుడు శాస్త్రవేత్తలను నిలదీసిన దాఖలాలు మన దేశంలో లేవు. 2009 ఏప్రిల్‌లో ఒక నగరానికి భారీ నష్టం తీసుకొచ్చి, 306 మందిని బలిగొన్న భూకంపంపై సరైన అంచనాలు ఇవ్వలేకపోయారన్న కారణంగా ఆరుగురు ఇటలీ శాస్త్రవేత్తలకు ఆరేళ్ల చొప్పున జైలు శిక్షలు పడ్డాయి. అదృష్టవశాత్తూ ఇక్కడ అలాంటి పరిస్థితులు లేవు. ఈపాటికి శాంతించాల్సిన భానుడు ఇంకా తన ప్రతాపం చూపుతూనే ఉన్నాడు. ఆంధ్రప్రదేశ్‌లో రానున్న నాలుగైదు రోజుల్లో ఉష్ణోగ్రతలు భారీగా పెరిగే అవకాశం ఉన్నదని ఇప్పటికే ఆ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ప్రకటించింది. 47 డిగ్రీల సెంటిగ్రేడ్ వరకూ ఈ ఉష్ణోగ్రతలుంటాయని దాని అంచనా. అందుకు తగ్గట్టే వాతావరణం భగ్గుమంటున్నది. ఈ పరిస్థితుల్లో ఐఎండీ అంచనా లకు విలువేముంటుంది? మన దేశంలో సాగుయోగ్యమైన భూముల్లో 60 శాతం వర్షాధారం. మనకు కురిసే వర్షాల్లో 80 శాతం నైరుతీ రుతుపవనాల ద్వారానే వస్తాయి. మన జీడీపీలో సాగు రంగం వాటా క్రమేపీ చిక్కిపోతున్నా ఇప్పటికీ అది గణనీయంగానే ఉంది. అన్నిటికీ మించి గ్రామీణ ప్రాంతాల్లో 50 శాతంమందికి సాగురంగమే ఉపాధి కల్పిస్తున్నది. ఉపాధి, ద్రవ్యోల్బణం, పారిశ్రామికరంగ కదలిక, గ్రామీణ ఆదాయాలు వగైరాలన్నీ నైరుతీ రుతుపవన గమనంపైనే ఆధారపడి ఉంటాయి. చినుకు కోసం ఆకాశంకేసి చూసే రైతును నిరాశపరిస్తే... అతని నైతిక స్థైర్యాన్ని దెబ్బతీస్తే దాని ప్రభావం సాగు ఉత్పాదకతపై ఎంతగానో ఉంటుంది. ఫలానా తేదీకి రుతుపవనాలు వస్తాయని చెప్పడం వల్ల రైతులు డబ్బు ఖర్చుచేసి అవసరమైనవన్నీ సమకూర్చు కుంటారు. తీరా అనుకున్నట్టు జరగకపోతే నష్టపోతారు. కనుక అంచనాల విషయంలో శాస్త్రవేత్తలు ఎంతో అప్రమత్తంగా ఉండాలి. విమర్శలకు తావీయని రీతిలో వ్యవహరించాలి. -
దంచికొడుతున్న వానలు
సాక్షి, హైదరాబాద్ : నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతుండటంతో రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఛత్తీస్‌గఢ్ నుంచి దక్షిణ తమిళనాడు వరకు తెలంగాణ, కోస్తాంధ్ర మీదుగా అల్పపీడన ద్రోణి కొనసాగుతోంది. దీంతో రాష్ట్రంలో గురువారం పలుచోట్ల భారీ నుంచి అతి భారీవర్షాలు కురిశాయి. పలుచోట్ల వాగులు ఉధృతంగా ప్రవహించడంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. వికారాబాద్ జిల్లాలో కొన్ని గ్రామాలు నీటమునగడంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. తాండూరు పట్టణంలోని తాండూరు–హైదరాబాద్ రోడ్డు మార్గం చెరువును తలపించింది. జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం జగ్గాసాగర్, ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం బచ్చోడులలో 9 సెంటీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదైంది. జగిత్యాల జిల్లా కోరుట్లలో 7 సెంటీమీటర్లు, కోరుట్ల మండలం అల్లాపూర్, మెట్‌పల్లిల్లో 5 సెంటీమీటర్ల చొప్పున వర్షం కురిసింది. శుక్రవారం కూడా ఒకటి రెండుచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. శనివారం కొన్నిచోట్ల తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. గద్వాల జిల్లాలో అధిక వర్షపాతం.. ఈ సీజన్లో జూన్ ఒకటో తేదీ నుంచి గురువారం వరకు రాష్ట్రంలో 35 శాతం అధికంగా వర్షపాతం నమోదైంది. ఈ తేదీల మధ్య సాధారణంగా రాష్ట్రం లో 297.3 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కావా ల్సి ఉండగా, ఇప్పటివరకు ఏకంగా 401.2 మిల్లీమీటర్లు రికార్డు అయిందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. జోగులాంబ గద్వాల జిల్లాలో 134 శాతం అధిక వర్షపాతం నమోదైంది. ఇతర జిల్లాలతో పోలిస్తే ఇదే అధికమని పేర్కొంది. సాధారణంగా ఈ కాలంలో ఇక్కడ 166.5 మిల్లీమీటర్లు నమోదు కావాల్సి ఉండగా.. 390.1 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. ఆ తర్వాత వనపర్తి జిల్లాలో సాధారణ వర్షపాతం 206 మిల్లీమీటర్లకుగాను 127 శాతం అధికంగా 467.4 మిల్లీమీటర్లు నమోదైంది. మొత్తంగా 22 జిల్లాలో అధిక వర్షపాతం నమోదు కాగా, 10 జిల్లాలో సాధారణ వర్షపాతం రికార్డయి నట్టు వాతావరణ కేంద్రం వెల్లడించింది. నిర్మల్ జిల్లాలో లోటు వర్షపాతం నమోదైనట్టు పేర్కొంది. రాజధానిలో ఎడతెరిపిలేని వాన ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షంతో గ్రేటర్ హైదరాబాద్ తడిసి ముద్దయ్యింది. బుధవారం అర్ధరాత్రి నుంచి గురువారం రాత్రి వరకు నగరంలోని పలు ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా జడివాన కురిసింది. దీంతో లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి. ప్రధాన రహదారులపై నడుము లోతున వరదనీరు పోటెత్తింది. నగరంలో సరాసరిన 5 సెంటీమీటర్ల మేర వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ తెలిపింది. రాగల 24 గంటల్లో హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షం కురిసే అవకాశాలున్నట్లు వెల్లడించింది. -
తెలంగాణలో నైరుతి రుతుపవనాల ప్రవేశం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లోకి గురువారం నైరుతి రుతుపవనాలు ప్రవేశించాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ రుతుపవనాలు నిజామాబాద్ జిల్లా వరకు విస్తరించినట్లు పేర్కొంది. రాగల రెండు రోజుల్లో తెలంగాణ రాష్ట్రం అంతటా విస్తరించే అవకాశం ఉన్నట్లు వాతావరణ కేంద్రం వెల్లడించింది. తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు పేర్కొంది. ఇప్పటికే రాయలసీమ కోస్తాంధ్ర మొత్తం నైరుతి రుతుపవననాలు విస్తరించాయి. రాబోయే 24 గంటల్లో రాయలసీమ, కోస్తాంధ్రల్లో ఉరుములతో కూడిన వర్షం పడనున్నట్లు తెలిపింది. ఇక రేపు ఉత్తర కోస్తాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. (అతడే సుడా నూతన చైర్మన్) పశ్చిమ మధ్య బంగాళాఖాతం, ఉత్తర ఆంధ్రప్రదేశ్, దక్షిణ ఒరిస్సా తీర ప్రాంతాల దగ్గర ఉన్న వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతోందని పేర్కొంది. దీనికి అనుబంధముగా 7.6 కి. మీ ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని తెలిపింది. ఇది ఎత్తుకు వెళ్లే కొద్ది నైఋతి వైపుకు తిరిగి పశ్చిమ వాయువ్య దిశగా ప్రయాణించే అవకాశం ఉందిని పేర్కొంది. మధ్య అరేబియా సముద్రం, మహారాష్ట్రలో మరికొన్ని ప్రాంతాలు, పశ్చిమ, మధ్య బంగాళాఖాతం, ఉత్తర బంగాళాఖాతంలో మిగిలిన ప్రాంతాలు, అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మేఘాలయ, సిక్కింలోని మొత్తం ప్రాంతాలు, ఒరిస్సాలో కొన్ని ప్రాంతాలు, పశ్చిమ బెంగాల్లో కొన్ని ప్రాంతాలలోనికి నైఋతి రుతుపవనాలు రాగల 48 గంటలలో విస్తరించే అవకాశం ఉన్నట్లు వాతావరణ కేంద్ర తెలిపింది. దీంతో అక్కడక్కడ ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో పాటు తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు ఈ రోజు, రేపు అనేక చోట్ల, ఎల్లుండి చాలా చోట్ల కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం పేర్కొంది. (‘సిమెంట్ ధరలు తగ్గించేందుకు అంగీకారం’) -
తెలంగాణలో ‘తొలకరి’ ఉత్సాహం
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్ర రైతాంగం వానాకాలం సాగు కోసం పొలం బాట పడుతోంది. రుతుపవనాల ప్రవేశానికి ముందే తొలకరి జల్లులతో ఈ ఏడాది వర్షాలు బాగానే కురుస్తాయనే ఆశలు రైతుల్లో చిగురిస్తున్నాయి. సాగుకు వీలుగా భూమిని చదును చేసుకుని వర్షాల కోసం ఎదురుచూస్తున్న రైతాంగంలో ఈ తొలకరి జల్లులు కొత్త ఉత్సాహాన్ని నింపుతున్నాయి. ఇప్పటికే ఏరువాకతో దుక్కి దున్ని, గొర్లు సిద్ధం చేసుకుని, నార్లు పోసుకునేందుకు సిద్ధంగా ఉన్న కర్షకుడు.. గత రెండ్రోజులుగా కురుస్తున్న ఈ వర్షాలు మరో 3, 4 రోజులు కొనసాగితే ఇక పూర్తిస్థాయిలో పొలం బాట పట్టనున్నాడు. బుధ వారం రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా కురిసిన వర్షాలు మరో రెండ్రోజులు కొనసాగుతాయని, గురువారం 12 జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. భువనగిరిలో అత్యధికం.. బుధవారం రాష్ట్రంలోని దాదాపు అన్ని ప్రాంతాల్లో వర్షం కురిసింది. రాజధాని హైదరాబాద్‌తో పాటు అన్ని జిల్లాల్లోనూ వర్షపాతం నమోదైందని వాతావరణ గణాంకాలు వెల్లడించాయి. బుధవారం యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరిలో అత్యధికంగా 16.9 సెం.మీ వర్షపాతం నమోదైంది. గురు, శుక్రవారాల్లో రాష్ట్రవ్యాప్తంగా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ములుగు, వరంగల్ (అర్బన్, రూరల్), యాదాద్రి భువనగిరి, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, సూర్యాపేట, నల్లగొండ, నాగర్‌కర్నూల్, వనపర్తి, జనగామ జిల్లాల్లో ఒకట్రెండుచోట్ల గురువారం భారీ నుంచి అతి భారీవర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. శుక్రవారం కూడా భారీ నుంచి అతి భారీవర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది. యాదాద్రి జిల్లా భువనగిరిలో అత్యధికంగా కురిసిన వర్షపాతం - 16.9 సెం.మీ. నేడు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే జిల్లాల సంఖ్య -12 రుతుపవనాల విస్తరణ తమిళనాడులో మిగిలిన ప్రాంతాలు, పశ్చిమ మధ్య, ఉత్తర బంగాళాఖాతంలో మరికొన్ని ప్రాంతాలు, త్రిపుర మిజోరంలో కొన్ని ప్రాంతాల్లోకి నైరుతి రుతుపవనాలు బుధవారం విస్తరించాయి. మధ్య అరేబియా సముద్రం, గోవా, మహారాష్ట్ర, కర్ణాటక, రాయలసీమలోని మరికొన్ని ప్రాంతాలు, తెలంగాణ, కోస్తా ఆంధ్రాలో కొన్ని ప్రాంతాలు, మధ్య, ఉత్తర బంగాళాఖాతం, ఈశాన్య భారతదేశంలో మరికొన్ని ప్రాంతాల్లోకి వచ్చే 48 గంటల్లో విస్తరించే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఆ తర్వాతి 48 గంటల్లో మహారాష్ట్రలోని మరికొన్ని ప్రాంతాలు, కర్ణాటక, తెలంగాణ, రాయలసీమ, కోస్తా ఆంధ్ర, బంగాళాఖాతం, ఈశాన్య భారతదేశంలో మిగిలిన ప్రాంతాలు, సిక్కింలోని మొత్తం ప్రాంతాలు, ఒడిశా, పశ్చిమబెంగాల్లోని కొన్ని ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరించే అవకాశం ఉందని వెల్లడించింది. కొనసాగుతున్న అల్పపీడనం తూర్పు, మధ్య బంగాళాఖాతం, దాన్ని ఆనుకుని ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతం ప్రాంతాల్లో ఏర్పడిన అల్పపీడనం కొనసాగుతోంది. దీనికి అనుబంధంగా మధ్యస్థ ట్రోపోస్పియర్ ఎత్తు వరకు నైరుతి దిశగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఇది 48 గంటల్లో పశ్చిమ వాయువ్యం దిశగా ప్రయాణించి బలపడే అవకాశం ఉందని, దీని కారణంగానే రాష్ట్రానికి వర్ష సూచన ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. బుధవారం అత్యధిక వర్షపాతం (సెం.మీ.) నమోదైన ప్రాంతాలు జిల్లా గ్రామం/పట్టణం వర్షపాతం యాదాద్రి భువనగిరి 16.9 యాదాద్రి మర్యాల 13.7 ఆదిలాబాద్ పోచర 11.8 యాదాద్రి వెంకిర్యాల 10.5 ఖమ్మం మధిర 9.3 యాదాద్రి యాదగిరిగుట్ట 8.85 ఖమ్మం ఎర్రుపాలెం 8.85 వరంగల్ అర్బన్ కాశీబుగ్గ 8.75 (రంగారెడ్డి, వరంగల్ (అర్బన్/రూరల్ జిల్లాలు), సిద్దిపేట, యాదాద్రి, ఖమ్మం,నిజామాబాద్ జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో 7 సెం.మీ. చొప్పున వర్షం కురిసింది) -
ఏపీలోకి నైరుతి రుతుపవనాలు
-
కేరళకు నైరుతి, ఏపీలో మోస్తరు వర్షాలు
సాక్షి, విజయవాడ: నైరుతి రుతుపవనాలు కేరళలో ప్రవేశించడంతో ఆంధ్రప్రదేశ్‌లో రాగల మూడు రోజుల వరకు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని విజయవాడ వాతావరణ కేంద్రం సూచించంది. కాగా దక్షిణ అరేబియా సముద్రం, లక్షద్వీప్ దీవులు, మాల్దీవులు, కేరళ, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకల్‌లోని కొన్ని ప్రాంతాలు, కోమోరిన్, ఆగ్నేయ బంగాళాఖాతంలో కొన్ని ప్రాంతాల్లోకి నైరుతి రుతుపవనాలు విస్తరించాయి. ఉత్తర కోస్తా ఆంధ్ర, యానాం: రానున్న మూడు రోజుల్లో ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులు (గంటకు 30 నుంచి 40 కిలో మీటర్లు)తో ఉత్తర కోస్తా ఆంధ్రాలో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కొన్నిచోట్ల కురిసే అవకాశం ఉంది. అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం తెలిపింది. దక్షిణ కోస్తా ఆంధ్ర : ఈ రోజు, రేపు ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులు (గంటకు 30 నుంచి 40కిలోమీటర్లు)తో దక్షిణ కోస్తా ఆంధ్రాలో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని, గరిష్ట ఉష్ణోగ్రతలు 41 డిగ్రీ సెల్సియస్ నుంచి 43 డిగ్రీ సెల్సియస్ వరకు నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది. ఎల్లుండి దక్షిణ కోస్తా ఆంధ్రాలో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని తెలిపింది. రాయలసీమ: సోమవారం ఉరుములు, మెరుపులుతో రాయలసీమలో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని, అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. రాయలసీమలో అక్కడక్కడ గరిష్ట ఉష్ణోగ్రతలు 41 డిగ్రీ సెల్సియస్ నుంచి 43 డిగ్రీ సెల్సియస్ వరకు నమోదయ్యే అవకాశం ఉందని తెలిపారు. రేపు ఉరుములు, మెరుపులుతో రాయలసీమలో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉందన్నారు. -
కోస్తా, రాయలసీమల్లో విస్తారంగా వర్షాలు
సాక్షి, విశాఖపట్నం: నైరుతి రుతుపవనాలు నిష్క్రమిస్తున్న తరుణంలో ఈశాన్య రుతుపవనాల ప్రభావం రాష్ట్రంపై ముందుగానే మొదలైంది. దీంతో ఉపరితలంలో కోస్తా వెంబడి ఈశాన్య గాలులు వీస్తున్నాయి. నైరుతి రుతుపవనాల తిరోగమనంలో భాగంగా శుక్రవారం లేదా శనివారం ఏపీ మీదుగా వెళ్లిపోగానే.. ఈశాన్య రుతుపవనాలు దేశంలోకి ప్రవేశించనున్నాయి. అక్టోబర్ 15 నుంచి 20లోపు ఇవి ప్రవేశిస్తాయి. కాగా, ఈశాన్య పవనాల కాలంలో కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురిసే సూచనలున్నాయని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. దక్షిణ కోస్తాంధ్రలో ఉరుములతో కూడిన వర్షాలు కురుస్తాయని తెలిపారు. మరోవైపు.. ఉత్తర కోస్తాంధ్ర పరిసర ప్రాంతాల్లో 2.1 కిమీ ఎత్తులో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఈ ఆవర్తనం నుంచి కొమరీన్, రాయలసీమ, తెలంగాణ మీదుగా కోస్తాంధ్ర వరకూ సముద్ర మట్టానికి 0.9 కిమీ ఎత్తులో ఉపరితల ద్రోణి కొనసాగుతోంది. వీటి ప్రభావంతో రాగల రెండు రోజులపాటు కోస్తా, రాయలసీమల్లో అక్కడక్కడా.. మోస్తరు వర్షాలు పడే సూచనలున్నట్లు ఐఎండీ గురువారం రాత్రి వెల్లడించింది. గడిచిన 24 గంటల్లో పోలవరం, కొయ్యలగూడెంలో 11 సెం.మీ, వరరామచంద్రాపురంలో 8, అవనిగడ్డ, రాయచోటి, కమలాపురంలో 7, పాడేరు, నూజివీడు, మెంటాడ, చింతూరు, మంత్రాలయం, ఎమ్మిగనూరులో 6 సెంటిమీలర్ల వర్షపాతం నమోదైంది. విజయవాడలో భారీవర్షం.. అస్తవ్యస్తం వర్షం బెజవాడను వదలనంటోంది.. రోజులో ఏదోక సమయంలో కురుస్తూ నగరవాసుల సహనానికి పరీక్ష పెడుతోంది.. కరి మబ్బులతో కూడిన వాతావరణం ఆహ్లాదకరంగా అనిపిస్తున్నా.. అంతలోనే కురిసే జడివాన జనజీవనాన్ని చెల్లాచెదురు చేసేస్తుంది. దీనికితోడు పక్కనే పడ్డాయా అన్నట్లుగా దిక్కులు పిక్కటిల్లేలా ఉరుములు.. మెరుపులు నగరవాసిని భీతిగొల్పుతున్నాయి. ఇక వర్షానంతరం మన నగర రోడ్లు సొగసచూడతరమా.. రహదారులా లేక చెరువులా అన్నరీతిలో మోకాళ్ల వరకు నీళ్లతో వాహనచోదకులు, పాదచారుల తిప్పలు చెప్పనలవి కావు. గురువారం విజయవాడలో కురిసిన వర్షం చిత్రాలను ‘సాక్షి’ క్లిక్‌మనిపించింది. -
కేరళను తాకిన రుతుపవనాలు
న్యూఢిల్లీ : భానుడి ప్రతాపంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న తెలుగు రాష్ట్రాలకు చల్లని కబురు. దేశ ప్రజలు ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్న నైరుతి రుతుపవనాలు ఎట్టకేలకు కేరళ తీరాన్ని తాకాయి. మాల్దీవులు, కోమోరిన్ ప్రాంతాలు, దక్షిణ అరేబియా సముద్రంలో కొన్ని ప్రాంతాలు, లక్షదీవులు, కేరళ , దక్షిణ తమిళనాడులో కొన్ని ప్రాంతాలు, నైరుతి బంగాళాఖాతం, ఆగ్నేయ బంగాళాఖాతం, తూర్పుమధ్య బంగాళాఖాతం మరియు ఈశాన్య బంగాళాఖాతంలో కొన్ని ప్రాంతాలలోనికి నైరుతి రుతుపవనాలు విస్తరించాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఇక తెలుగు రాష్ట్రాల్లోకి నైరుతి రుతుపవనాలు ఈ నెల 11న ప్రవేశించనున్నాయి. 11న రాయలసీమ మీదుగా ఏపీలోకి రుతుపవనాలు ప్రవేశించనున్నాయి. ఈ నెల 13 నుంచి 15 మధ్య తెలంగాణలోకి ప్రవేశించనున్నట్టు వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ రోజు ఆంధ్రప్రదేశ్‌లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో పాటు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. -
5, 6 తేదీల్లో రాష్ట్రంలోకి ‘నైరుతి’
సాక్షి, హైదరాబాద్: నైరుతి రుతుపవనా లు తెలంగాణలోకి ఈ నెల 5, 6 తేదీల్లో ప్రవేశిస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలు రుతుపవనాల రాకకు ముందు కురిసేవని వాతావరణ కేంద్రం డైరెక్టర్ వై.కె.రెడ్డి ‘సాక్షి’కి తెలిపారు. సంబంధిత ప్రాంతంలో వాతావరణశాఖ ఆధ్వర్యం లోని రెయిన్‌గేజ్ స్టేషన్లలో 60 శాతం వర్షపాతం నమోదు కావడం, ఆయా చోట్ల 2.5 మిల్లీమీటర్లకు మించి వర్షం కురవడం, గంటకు 40 కి.మీ వేగంతో గాలులు వీయడం ద్వారా రుతుపవనాల ఆగమనా న్ని గుర్తిస్తామన్నారు. ఈ ప్రమాణాలతో పాటు రేడియేషన్ తగ్గాల్సి ఉంటుందని, అప్పుడే నైరుతి రుతుపవనాలు ప్రవేశించినట్లుగా ప్రకటిస్తావన్నారు. ప్రస్తుతం కేరళలోకి ప్రవేశించిన రుతుపవనాలు ఇంకా సాధారణంగా ఉన్నాయన్నారు. అయితే ఈ పరిస్థితి తెలంగాణపై ప్రభావం చూపబోదని ఆయన తెలిపారు. క్యుములోనింబస్ కారణంగా.. రుతుపవనాలకు ముందుగా తేమ గాలు లు వీస్తుండటంతో క్యుములోనింబస్ మేఘాలు ఏర్పడి రాష్ట్రంలో ప్రస్తుతం వర్షాలు కురుస్తున్నాయని వై.కె.రెడ్డి తెలి పారు. దీంతో ఎండలు తగ్గుతున్నాయన్నారు. గత 24 గంటల్లో రాష్ట్రంలో భారీ వర్షాలు కురిశాయి. మంథనిలో 8 సెంటీ మీటర్ల వర్షం కురిసింది. గుండాల, అచ్చంపేటల్లో 7 సెంటీమీటర్ల చొప్పున, వికారాబాద్, మోమినపేటల్లో 6 సెంటీమీటర్ల చొప్పున వర్షం కురిసింది. -
తెలుగు రాష్ట్రాల రైతులకు శుభవార్త
సాక్షి, విశాఖపట్నం : మరో రెండు మూడు రోజుల్లో తెలుగు రాష్ట్రాల ప్రజలకు నైరుతి రుతుపవనాలు చల్లని తీపికబురును అందిచనున్నాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో శుక్రవారం నుంచి వర్షపాతం పెరిగే అవకాశముంది. దీంతో ఈ సారి వర్షాలు ఆశాజనకంగా ఉంటాయని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. గత కొన్ని రోజులుగా నైరుతి రుతుపవనాలు పయనిస్తూ బంగాళాఖాతం, అరేబియా సముద్రంలో దక్షిణ ప్రాంతానికి విస్తరించిన అండమాన్ దీవులకు చేరాయి. కాగా ప్రస్తుతం విదర్భ నుంచి తెలంగాణ ఏపీ మీదుగా దక్షిణ తమిళనాడు వరకూ అల్పపీడన ద్రోణి ఏర్పడింది. దీని ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో పలు ప్రాంతాల్లో ఓ మాదిరి వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయి. శుక్రవారం ప్రకాశం, నెల్లూరు, గుంటూరు, కృష్ణా, విశాఖ జిల్లాల్లో శుక్రవారం ఉరుములు, మెరుపులతో కూడిన జల్లులు లేదా మోస్తారు వర్షాలు, పిడుగులు పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని విశాఖ వాతావరణ కేంద్రం వెల్లడించింది. -
పలకరించిన తొలకరి
రాష్ట్రవ్యాప్తంగా విస్తరించిన నైరుతి రుతుపవనాలు - విస్తారంగా కురుస్తున్న వర్షాలు - నేడు, గురువారం భారీ వర్షాలు - హైదరాబాద్ వాతావరణ కేంద్రం సాక్షి, హైదరాబాద్: నైరుతి రుతుపవనాలు సోమవారం రాష్ట్రంలోకి ప్రవేశించాయి. వచ్చిన తొలిరోజునే రాష్ట్రవ్యాప్తంగా విస్తరించాయి. హైదరాబాద్ వాతావరణ కేంద్రం డైరెక్టర్ వై.కె.రెడ్డి వివరాలు వెల్లడించారు. రుతుపవనాల కారణంగా మంగళ, గురువారాల్లో రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తాయన్నారు. బుధవారం మాత్రం మోస్తరు వానలు పడతాయని ప్రకటించారు. వరుసగా రెండు రోజులపాటు 60% భూభాగంలో 2.5 మిల్లీమీటర్లకు మించి వర్షపాతం నమోదైతే రుతుపవనాలు ప్రవేశించినట్లుగా నిర్ధారిస్తారని.. ఆ మేరకు శని, ఆదివారాల్లో తెలంగాణలో వర్షపాతం నమోదైందని వెల్లడించారు. మరోవైపు రుతుపవనాల నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా అక్కడక్కడా వర్షాలు కురుస్తున్నాయి. గరిష్ట ఉష్ణోగ్రతలు గణనీయంగా తగ్గిపోయాయి. కొంత ఆలస్యంగా.. ఈసారి వాతావరణశాఖ అంచనా వేసిన మేరకు నైరుతి రుతుపవనాలు గత నెల 30వ తేదీనే కేరళలోకి ప్రవేశించాయి. అయితే ఈ నెల ఐదు, ఆరు తేదీల్లో తెలంగాణలోకి ప్రవేశిస్తాయని అంచనా వేసినా.. అరేబియా సముద్రంలో ఉపరితల ఆవర్తనం అడ్డుపడటం, ఇతర వాతావరణ మార్పుల కారణంగా ఆలస్యమై 12వ తేదీన ప్రవేశించాయి. 50 ఏళ్ల సరాసరి లెక్కల ప్రకారం నైరుతి రుతుపవనాలు తెలంగాణలోకి జూన్ 10న ప్రవేశించాలి. ఈ లెక్కన చూసినా కాస్త ఆలస్యంగా రాష్ట్రానికి చేరుకున్నాయి. గతేడాది 8వ తేదీన కేరళలోకి ప్రవేశించిన నైరుతి రుతుపవనాలు.. 18వ తేదీన తెలంగాణలోకి 18వ తేదీన ప్రవేశించాయి. గతేడాదితో పోలిస్తే ఈసారి తెలంగాణకు ఆరు రోజులు ముందుగానే ప్రవేశించినట్లు విశ్లేషిస్తున్నారు. తగ్గిన ఉష్ణోగ్రతలు.. రుతుపవనాల రాకతో రాష్ట్రవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు తగ్గిపోయాయి. సోమవారం హన్మకొండలో సాధారణం కంటే 9 డిగ్రీలు తక్కువగా 28 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదుకావడం గమనార్హం. నిజామాబాద్‌లో సాధారణం కంటే 6 డిగ్రీలు తక్కువగా 31 డిగ్రీలు, రామగుండంలో 4 డిగ్రీలు తక్కువగా 36 డిగ్రీలు, మెదక్‌లో 4 డిగ్రీలు తక్కువగా 31 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. విస్తారంగా వర్షాలు రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. గత 24 గంటల్లో ఖమ్మం జిల్లా చంద్రుగొండలో 6 సెంటీమీటర్ల భారీ వర్షం కురిసింది. నల్లబెల్లి, రంజాల్, రుద్రూర్, పాల్వంచలలో 5, భువనగిరి, కోటగిరి, కొత్తగూడెం, హసన్‌పర్తి, బూర్గుంపాడు, వర్నిలలో 4 సెంటీమీటర్ల చొప్పున వర్షం కురిసింది. జూన్ ఒకటో తేదీ నుంచి సోమవారం వరకు గత 12 రోజుల్లో రాష్ట్రంలో విరివిగా వర్షాలు కురిశాయి. ఈ 12 రోజుల సమయంలో తెలంగాణలో సాధారణ సగటు వర్షపాతం 35.1 మిల్లీమీటర్లుకాగా.. అంతకు రెట్టింపుగా 70.6 మిల్లీమీటర్లు కురవడం విశేషం. ఇక రుతుపవనాల రాకతో రైతుల్లో ఆశలు చిగురించాయి. ఇప్పటికే దుక్కులు దున్నిన అన్నదాతలు తాజా వర్షాలతో విత్తనాలు చల్లేందుకు సిద్ధమయ్యారు. రుతుపవనాలు రాష్ట్రంలో ప్రవేశించడంతో వ్యవసాయశాఖ కార్యదర్శి సి.పార్థసారథి, కమిషనర్ జగన్మోహన్ ఆనందం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో వ్యవసాయ పనులు మరింత ఊపందుకుంటాయని.. రైతులకు అవసరమైన విత్తనాలు, ఎరువులను అందుబాటులో ఉంచామని చెప్పారు. జూన్ 1–12 మధ్య సాధారణ, నమోదైన వర్షపాతం (పాత జిల్లాల ప్రకారం.. మిల్లీమీటర్లలో) జిల్లా సాధారణం కురిసింది ఆదిలాబాద్ 36.0 90.4 హైదరాబాద్ 28.5 11.4 కరీంనగర్ 37.0 80.0 ఖమ్మం 34.7 98.6 మహబూబ్‌నగర్ 32.1 56.1 మెదక్ 36.0 47.8 నల్లగొండ 32.6 72.3 నిజామాబాద్ 41.1 56.8 రంగారెడ్డి 32.1 68.3 వరంగల్ 37.4 47.8 -
‘నైరుతి’ వచ్చేసింది
రాష్ట్రంలోకి ప్రవేశించిన రుతుపవనాలు నల్లగొండ, ఖమ్మం జిల్లాల్లో పూర్తిగా.. హైదరాబాద్, వరంగల్, మహబూబ్‌నగర్ జిల్లాల్లో పాక్షికంగా విస్తరణ నేడు, రేపు రాష్ట్రవ్యాప్తమయ్యే అవకాశం నేడు భారీ వర్షాలు కురవచ్చని వాతావరణ శాఖ హెచ్చరిక సాక్షి, హైదరాబాద్: నైరుతి రుతుపవనాలు శనివారం తెల్లవారుజామున రాష్ట్రంలోకి ప్రవేశించాయి. నల్లగొండ, ఖమ్మం జిల్లాల్లో పూర్తిగా విస్తరించగా.. హైదరాబాద్, వరంగల్, మహబూబ్‌నగర్ జిల్లాల్లో పాక్షికంగా విస్తరించినట్లు హైదరాబాద్ వాతావరణశాఖ వెల్లడించింది. ఇప్పటికే నల్లగొండ, ఖమ్మం జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయని.. మిగతా జిల్లాల్లో అక్కడక్కడా జల్లులు పడుతున్నాయని తెలిపింది. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కారణంగా రుతుపవనాలు ఊపందుకున్నాయని... ఆది, సోమవారాల్లో రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాలకు విస్తరించే అవకాశముందని అధికారులు వెల్లడించారు. దీని కారణంగా అన్ని జిల్లాల్లో పలుచోట్ల భారీ వర్షాలు కురుస్తాయని తెలిపారు. ఇక రుతుపవనాల రాకతో ఉష్ణోగ్రతలు తగ్గిపోయాయి. శనివారం హన్మకొండలో అత్యధికంగా 38.6 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత, రామగుండంలో 33.2, మెదక్‌లో 32.6 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. శుక్రవారం ఉదయం శనివారం ఉదయం వరకు ఖమ్మం జిల్లా టేకులపల్లి, మహబూబ్‌నగర్ జిల్లా కొల్హాపూర్‌లో 5 సెంటీమీటర్ల చొప్పున వర్షం కురిసింది. ఆదిలాబాద్, బయ్యారం, ఇల్లెందు, చంద్రుగొండలలో 3 సెంటీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదైంది. హైదరాబాద్‌లో వర్షం..: హైదరాబాద్‌లో శనివారం రాత్రి పలుచోట్ల ఓ మోస్తరు వర్షం కురిసింది. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, ఖైరతాబాద్, అమీర్‌పేట్, కోఠి, అబిడ్స్, దిల్సుఖ్నగర్, ఉప్పల్, రామంతాపూర్, అంబర్పేట్, ఈసీఐఎల్, సికింద్రాబాద్, ట్యాంక్‌బండ్ తదితర ప్రాంతాల్లో వర్షం కారణంగా ట్రాఫిక్ స్తంభించిపోయింది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అల్పపీడనంగా మారితే భారీ వర్షాలు: రుతుపవనాల విస్తరణ కారణంగా రాష్ట్రవ్యాప్తంగా రెండు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశాలున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం అల్పపీడనంగా మారితే మరికొన్ని రోజులపాటు భారీగా వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉన్నట్లు హైదరాబాద్ వాతావరణ శాఖ డెరైక్టర్ వై.కె.రెడ్డి తెలిపారు. ఉపరితల ఆవర్తనం సముద్ర తీరం మీద ఉందని.. అది సముద్రం మీదకు వెళితే బలపడి అల్పపీడనంగా మారుతుందని చెప్పారు. అదే జరిగితే విస్తారంగా వానలు పడతాయని.. ఆవర్తనం భూమి మీదకు వస్తే బలహీనపడి వర్షాలు నిలిచిపోతాయని వెల్లడించారు. అయితే ఉపరితల ఆవర్తనం ఎటువైపు వెళుతుందనేది ఇప్పుడే తేల్చలేమన్నారు. రైతుల్లో ఆశలు.. రుతుపవనాల రాకతో రాష్ట్ర రైతుల్లో ఆశలు చిగురించాయి. మంచి వర్షాలు కురిస్తే కరువు నుంచి బయటపడొచ్చని వారంతా భావిస్తున్నారు. ఇప్పటికే దుక్కి దున్నిన రైతులు ప్రస్తుతం కురిసే వర్షాలకు విత్తనాలు చల్లేందుకు సిద్ధమవుతున్నారు. రుతుపవనాలు రాష్ట్రంలో ప్రవేశించడంతో వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి హర్షం వ్యక్తం చేశారు. వ్యవసాయ పనులు మరింత ఊపందుకుంటాయని.. రైతులకు అవసరమైన విత్తనాలు, ఎరువులను అందుబాటులో ఉంచామని చెప్పారు. -
వానమ్మా.. రావమ్మా!
అన్నదాత చూపు.. ఆకాశం వైపు - వర్షాకాలం ఆరంభమైనా కానరాని వాన - నిరాశపర్చిన నైరుతి రుతుపవనాలు - వెలవెలబోతున్న జలాశయాలు - ఆందోళన చెందుతున్న రైతులు ‘‘వానమ్మా.. ఓ వానమ్మా.. యాడున్నవమ్మా..! తొలకరి జల్లులతో మురిపించావు.. నల్లటి మబ్బులతో మరిపించావు. హమ్మయ్యా.. ఈయేడు నీళ్లకు తిప్పలు ఉండవని సంబురపడుతుండగనే తలతిప్పుకు పోయావు. పోనిలే.. విత్తు వేసుకునే సమయానికైనా వస్తావని ఎదురుచూస్తే.. పత్తా లేవు. పొలం దున్నడం మొదలుపెట్టి.. ఎరువులు, విత్తనాలు తెచ్చుకోవడం దాకా.. అరువుదెచ్చుకోనైనా అన్నీ సిద్ధం చేసుకున్నం. కానీ ఏం లాభం..? అసలు నువ్వేలేంది.. ఇవన్నీ ఉట్టియే కదా..! పొద్దుగల్ల లేవంగనే మొదలు మొగులునే జూస్తున్నం.. ఇయ్యళ్లన్న చినుకు రాకపోతుందా అని. ఓ దిక్కు విత్తుకునే కాలం గడిసిపోతుంది.. దినదినం పరేషాన్ ఎక్కువైతుంది. ఆరుగాలం కష్టాలు పడుతూ.. అందరికీ అన్నం పెట్టడమే తెలిసినోళ్లం.. మాపై కోపమెందుకే తల్లీ..!’’ అంటూ అన్నదాత కోటిఆశలతో ఆకాశంకేసి చూస్తున్నడు. చినుకు జాడలేక పోవడంతో చింత పెంచుకుంటున్నడు. కామారెడ్డి/నిజాంసాగర్: కోటి ఆశలతో ఖరీఫ్ సాగుకు సిద్ధమైన రై తన్నను జాడలేని వానలు ఆందోళన పెట్టిస్తున్నా యి. ఓవైపు సాగు సమయం మించిపోతున్నా.. చినుకులు కురవకపోవడంతో కర్షకులు కలవరపడుతున్నారు. తొలకరి జల్లులతో మురిపించిన వర్షం.. మళ్లీ కనిపించడం లేదు. కారుమబ్బులు కమ్ముకుంటున్నా.. నీటిచుక్కలు మాత్రం కురవడం లేదు. బండెడు ఆశతో ఎదురుచూసిన నైరుతి రుతుపవనాలు నిరాశపర్చాయి. గత ఏడాది ఈ సమయానికి వ ర్షాలు కురిసి.. పల్లెలు పంటసాగులో నిమగ్నమయ్యా యి. ప్రతీసారి జూన్ రెండోవారానికి వానలు వచ్చేవి. ఇప్పుడు మూడోవారం కావస్తున్నా వర్షాల జాడలేదు. సీజన్ తొలినాళ్లలోనే పరిస్థితులు ఇలా ఉంటే మున్ముం దు ఎలాంటి ఇబ్బందులుంటాయోనని రైతులు ఆందోళన చెందుతున్నారు. విత్తు మొలకెత్తేనా..! ఖరీఫ్ పంటల సాగు కోసం రైతులు భూములను దు క్కి చేసి విత్తనాలను అలికినా.. విత్తు మొలకెత్తడం లేదు. చినుకులు రాకపోవడంతో మొలకలు రావ డం కష్టంగా మారనుంది. వరితో పాటు పలు పంటలు వర్షాధారంపైనే పండిస్తారు. సోయా, మొక్కజొన్న, పెసర, మినుము వంటి పంటల సాగుకూ సమయం ఆసన్నమైంది. చెరువులు, కుంటలు, ప్రాజెక్టులు, వ్యవసాయ బోరుబావుల కింద వరి సాగుకు సమాయత్తమైన రైతులు సైతం వర్షాల కోసం వేచిచూస్తున్నారు. నారుమడుల కోసం విత్తనాలను విత్తుకున్నారు. పడిపోయిన వర్షపాతం వర్షాకాలం మొదలై వారాలు గడుస్తున్నా వానల కురవకపోవడంతో జిల్లాలో వర్షపాతం నమోదు పడిపోయింది. జూన్ ఆరంభం నుంచి నెలాఖరు వరకు జిల్లాలో 181 మిల్లీమీటర్ల సాధార ణ వర్షపాతం నమోదు కావాల్సి ఉంది. కానీ ఇప్పటి వరకు 51.8 మిల్లీమీటర్ల వర్షపాతం మాత్రమే నమోదైనట్లు నీటిపారుదలశాఖ అధికారులు పేర్కొన్నారు. గత ఏడాది జూన్ మూడోవారం నాటికి జిల్లాలో 171.50 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. దీంతో పోలిస్తే ఈ నెలలో రెండింతల కన్నా తక్కువగా వర్షం కురిసింది. నిరుడు మృగశిర కార్తె నుంచి వర్షాలు కురవడంతో జిల్లాలోని జలాశయాలన్నీ జలకళను సంతరించుకున్నాయి. ఈసారి జిల్లా వరప్రదాయని నిజాంసాగర్, ఉత్తర తెలంగాణ పెద్దదిక్కు శ్రీరాంసాగర్లతో పాటు ఏ ప్రాజెక్టులోనూ చుక్కనీరు చేరలేదు. తగ్గనున్న సాగు విస్తీర్ణం..! ఈ ఖరీఫ్ సీజన్లో జిల్లాలో 3.98 లక్షల హెక్టార్లలో పంటలు సాగవుతాయని జిల్లా అధికారులు అంచనా వేశారు. ఇందులో ముఖ్యంగా వర్షాధార పంటలైన సోయా, మొక్కజొన్న 2లక్షల హెక్టార్లలో సాగవుతాయని భావించారు. అయితే ఇప్పటి వరకు వర్షాల జాడలేకపోవడంతో వర్షాధార పంటల సాగుపై తీవ్ర ప్రభావం పడనుంది. మరో వారం దాకా వర్షాలు కురవకుంటే వరి, సోయా పంటల సాగు విస్తీర్ణం సగానికి సగం తగ్గవచ్చని భావిస్తున్నారు. వరణుడి కరుణ కోసం గ్రామాల్లో దేవతామూర్తులకు పూజలు చేస్తూ.. బోనాలు సమర్పిస్తున్నారు. వనభోజనాలకూ వెళ్తున్నారు. -
కేరళను తాకిన నైరుతి రుతుపవనాలు
-
వానమ్మా.. వెల్కమ్..
కేరళను తాకిన నైరుతి రుతుపవనాలు మరో 4 రోజుల్లో సీమాంధ్రకు, వారంలో తెలంగాణకు వచ్చే అవకాశం సాక్షి, విశాఖపట్నం/న్యూఢిల్లీ/తిరువనంతపురం: దేశమంతా ఎదురుచూస్తున్న నైరుతి రుతుపవనాలు శుక్రవారం భారత ఉపఖండాన్ని తాకాయి. సాధారణ తేదీ కన్నా నాలుగు రోజులు ఆలస్యంగా రుతుపవనాలు శుక్రవారం నాడు కేరళ తీరాన్ని దాటాయి. రెండు రోజులుగా కేరళలో రెండున్నర మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైందని, ఇది రుతుపవనాల రాకకు సంకేతమని శుక్రవారం ఈ మేరకు భారత వాతావరణ విభాగం(ఐఎండీ) డెరైక్టర్ జనరల్ ఎల్.ఎస్. రాథోడ్ తెలిపారు. కేరళతోపాటు తమిళనాడులోని కొన్ని ప్రాంతాలకు కూడా శుక్రవారం నైరుతి విస్తరించిందని విశాఖపట్నంలోని తుపాను హెచ్చరికల కేంద్రం ఓ బులెటిన్‌లో పేర్కొంది. నాలుగు రోజుల్లో సీమాంధ్రకు, తర్వాత వారంలో తెలంగాణ అంతటికీ విస్తరించే అవకాశాలున్నట్టు పేర్కొంది. ప్రస్తుతం ఛత్తీస్‌గఢ్ నుంచి తెలంగాణ, దక్షిణ కోస్తాంధ్ర మీదుగా దక్షిణ తమిళనాడు వరకూ ఏర్పడ్డ అల్పపీడన ద్రోణి స్థిరంగా కొనసాగుతోందని, దీని ప్రభావంతో ఒకట్రెండుచోట్ల ఉరుములతో కూడిన వర్షాలు పడే అవకాశాలున్నాయని వాతావరణశాఖ తెలిపింది. కాగా, దేశంలో గత నాలుగేళ్లుగా వర్షపాతం సాధారణం, సాధారణం కంటే ఎక్కువగా నమోదు అయింది. అయితే ఈ ఏడాది పసిఫిక్ మహా సముద్రంలో ఎల్‌నినో ప్రభావం కారణంగా భారత్‌లో సాధారణం కంటే తక్కువగా 95 శాతమే వ ర్షపాతం ఉండవచ్చని నిపుణుల అంచనా. కొనసాగుతున్న వడగాడ్పులు: దక్షిణ కోస్తా, తెలంగాణ లో వడగాల్పుల ప్రభావంతో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఒకట్రెండు డిగ్రీలు ఎక్కువగా నమోదవుతున్నాయి. దక్షిణ కోస్తాలోని ప్రకాశం, గుంటూరు, ఒంగోలు, నెల్లూరు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో వేడి గాలులు కొనసాగే అవకాశముందని విశాఖ వాతావరణ శాఖ తెలిపింది. శుక్రవారం గుంటూరులోని రెంటచింతలలో గరిష్టంగా 45 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది. అలాగే రామగుండం, బాపట్లలో 44, ఒంగో లు, గన్నవరం, కావలి, నిజామాబాద్‌లలో 43, నంది గామ, నెల్లూరులో 42, హైదరాబాద్, కర్నూలులలో 40 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అలాగే ఉత్తరభారతాన్ని కూడా వడగాడ్పులు, విద్యుత్ కోతలు వణికిస్తున్నాయి. శుక్రవారం ఢిల్లీ, పంజాబ్, లక్నోతో సహా అనేక చోట్ల 45 నుంచి 48.4 డిగ్రీల సెల్షియస్ల వరకూ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.