టికెట్ రద్దు, నగదు తిరిగి పొందడం కోసం అన్ని స్టేషన్లలో ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేయనున్నట్లు మంగళవారం రైల్వే శాఖ పేర్కొంది. ప్రయాణికులకు మరింత చేరువ కావడంలో భాగంగా ఈ వసతిని కల్పించాలని నిర్ణయించినట్లు తెలిపింది. ప్రస్తుతం ఉన్న రిజర్వేషన్ కౌంటర్లలో కొన్నింటిని యూటీఎస్(అన్‌రిజర్వుడ్ టికెటింగ్ సిస్టమ్) కమ్ పీఆర్‌ఎస్(ప్యాసింజర్ రిజర్వేషన్ సిస్టమ్)లకు కేటాయించనున్నట్లు అధికారులు పేర్కొన్నారు. నేటి నుంచి ఇది అమల్లోకి వస్తుందని, రైలు బయలుదేరడానికి 24 గంటల ముందు వరకు మాత్రమే టికెట్ రద్దు చేసుకునే అవకాశం ఉంటుందని చెప్పారు.