Ticket Cancellation
-
టికెట్ క్యాన్సిలేషన్ ఛార్జీలను ఏం చేస్తారంటే..
వెయిటింగ్‌లిస్ట్‌లోని రైల్ టికెట్ రద్దు చేసినప్పుడు విధించే ఛార్జీలను నిర్వహణ ఖర్చుల కోసం వినియోగిస్తున్నామని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. సదరు ఛార్జీలను మినహాయించాలని మోదీ ప్రభుత్వం ఆలోచిస్తోందా? అని సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ ఇక్రా చౌదరి లోక్‌సభలో లేవనెత్తిన ప్రశ్నకు బదులుగా అశ్విని వైష్ణవ్ లిఖిత పూర్వక సమాధానమిచ్చారు.సీట్ల కొరత కారణంగా రైల్వేలో వెయిటింగ్‌లిస్ట్ టికెట్లు రద్దు అవుతాయి. అయితే ఆ సమయంలో రైల్వే క్యాన్సిలేషన్ ఛార్జీలను విధిస్తుంది. వినియోగదారు ప్రమేయంలేని వాటికి ఛార్జీలు చెల్లించడం సరికాదనే వాదనలు ఎప్పటినుంచో ఉన్నాయి. ఇటీవల సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ ఇక్రా చౌదరి ఈమేరకు మోదీ ప్రభుత్వం ఇలాంటి ఛార్జీలను మినహాయించేలా ఏదైనా ఆలోచిస్తుందా? అని ప్రశ్నించారు. దానికి బదులుగా రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ స్పందించారు.‘రైల్వే ప్యాసింజర్స్ (టికెట్ల రద్దు, ఛార్జీల వాపసు) రూల్స్ 2015 ప్రకారం ఐఆర్సీటీసీ వెబ్సైట్ ద్వారా రద్దు చేసిన వాటితో సహా అన్ని వెయిట్లిస్టింగ్లోని టిక్కెట్ల రద్దుపై క్లర్కేజ్ ఛార్జీ విధిస్తున్నారు. ఒకవేళ సీట్ అలాట్ అవ్వకపోతే టికెట్ రద్దు అవుతుంది. ఈ ఛార్జీలతోపాటు ఇతర వనరుల ద్వారా వచ్చే ఆదాయాన్ని రైల్వే నిర్వహణ ఖర్చులు, ఆస్తుల పునరుద్ధరణ, మూలధన వ్యయం, కస్టమర్ సౌకర్యాలు, ఇతర అభివృద్ధి పనులుకు వినియోగిస్తున్నారు. అప్పటికే సీట్ కన్ఫర్మ్ అయినవారు ఎవరైనా తమ టికెట్ రద్దు చేసుకుంటే ఖాళీగా ఉన్న బెర్త్‌లను వెయిట్‌లిస్ట్‌లోని వారికి అలాట్ చేస్తారు. వెయిట్‌లిస్ట్‌లోని ప్రయాణీకులు ‘వికల్ప్’ స్కీమ్ ద్వారా ప్రత్యామ్నాయ రైలులో కూడా ప్రయాణించే వెసులుబాటు ఉంది’ అని మంత్రి తెలిపారు.ఇదీ చదవండి: పాలసీపై రాబడి ఉండాలా..? వద్దా..?ఏదైనా కారణాల వల్ల రైల్ బయలు దేరడానికంటే 48 గంటల ముందు టికెట్ క్యాన్సిల్ చేస్తే కింది విధంగా ఛార్జీలు విధిస్తారు.ఏసీ ఫస్ట్ క్లాస్/ ఎగ్జిక్యూటివ్ క్లాస్: రూ.240ఏసీ 2-టైర్/ ఫస్ట్ క్లాస్: రూ.200ఏసీ 3-టైర్/ ఏసీ చైర్ కార్/ఏసీ-3 ఎకానమీ: రూ.180స్లీపర్ క్లాస్: రూ.60సెకండ్ క్లాస్: రూ.20 -
టికెట్ రద్దయితే.. రైల్వేకు పండగే!
సాక్షి, విశాఖపట్నం: దూర ప్రయాణాలకు వెళ్లాలంటే అందరికీ గుర్తొచ్చేది రైలే. మూడు నెలల ముందే టికెట్ తీసుకుంటే గానీ బెర్త్ దొరకని పరిస్థితి. ఒక్కోసారి టికెట్ కన్ఫర్మ్ కాదు. చివరి నిమిషంలోనైనా బెర్త్ దొరకదా.. కనీసం ఆర్ఏసీ అయినా అవ్వదా అనే ఆశతో ప్రయాణి కులు ఉంటారు. చివరి వరకు టికెట్ కన్ఫర్మ్ కాకపోతే క్యాన్సిల్ చేస్తుంటాం. కొన్నిసార్లు.. అత్యవసరంగా టికెట్ రద్దు చేసుకుంటుంటాం. రద్దు చేసుకున్న ప్పుడు కొంతమేర డబ్బులకు కోత విధించి.. రైల్వే శాఖ రీఫండ్ చేస్తుంటుంది. క్యాన్సిలేషన్ రుసుం కింద కోత విధించిన సొమ్ము రైల్వే ఖాతాలోకి జమ అవుతుంది. ఏటా సగటున రూ.2 వేల కోట్లు: వెయిటింగ్ లిస్ట్‌లో రూ.240 టికెట్ బుక్ చేసుకుని క్యాన్సిల్ చేసుకుంటే.. కేవలం రూ.180 మాత్రమే రీఫండ్ వస్తుంది. అంటే.. రైల్వే సేవలేవీ వినియోగించుకోకుండానే ఆ శాఖకు సర్వీస్ చార్జ్ని ప్రయాణికులు చెల్లిస్తున్నట్టే. ఇలా టికెట్ క్యాన్సిలేషన్ ద్వారా రూ.కోట్లలో ఆదాయాన్ని ఆర్జిస్తోంది రైల్వే మంత్రిత్వ శాఖ. 2022–23 సంవత్సరంలో టికెట్ క్యాన్సిలేషన్, క్లర్కేజ్ చార్జీల ద్వారా రూ.2,109.74 కోట్ల ఆదాయం వచ్చిందని రైల్వే బోర్డు వెల్లడించింది. అదేవిధంగా 2023 ఏప్రిల్ 2023 డిసెంబర్ వరకూ రూ.1,762.62 కోట్లు జమ అయింది. అంటే గతేడాదితో పోలిస్తే.. 2023–24లోనూ పూర్తి లెక్కలు తేలాక రూ.2,200 కోట్లు దాటే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఈ లెక్కన టికెట్ క్యాన్సిలేషన్స్ ద్వారా రైల్వే శాఖకు ఏటా సగటున రూ.2 వేల కోట్ల వరకూ ఆదాయం లభిస్తోంది. రూ.60 నుంచి రూ.240 వరకూ కట్ ప్రయాణ తరగతి ఆధారంగా టికెట్ రద్దు రుసుంలు మారుతూ ఉంటాయి. రెండో తరగతి టికెట్ క్యాన్సిలేషన్‌కు రూ.60 నుంచి మొదలై.. ఏసీ ఫస్ట్ క్లాస్ లేదా ఎగ్జిక్యూటివ్ క్లాస్‌కు రూ.240 వరకు చార్జీలు ఉంటాయి. సెకండ్ ఏసీకి అయితే రూ.200, థర్డ్ ఏసీ, ఏసీ చైర్ కార్ అయితే రూ.180 వసూలు చేస్తారు. స్లీపర్ క్లాస్‌కు రూ.120 వరకూ రుసుం కింద రైల్వే శాఖ కట్ చేసుకుంటుంది. ట్రైన్ బయలుదేరడానికి నాలుగు గంటలలోపు టికెట్లను రద్దు చేస్తే క్యాన్సిలేషన్ చార్జి 50 శాతం ఉంటుంది. ఒక వేళ ట్రైన్ బయలుదేరడానికి 72 గంటలలోపు, అంటే మూడు రోజుల ముందే టికెట్లను రద్దు చేస్తే క్యాన్సిలేషన్ చార్జీలు ఉండవు. వారికి పూర్తి రీఫండ్ లభిస్తుంది. -
'BookMyShow'లో సినిమా టికెట్‌ను ఎలా రద్దు చేయాలి
ఒకప్పుడు సినిమా చూసేందుకు టికెట్ల కోసం థియేటర్ల ముందు క్యూలు కట్టేవారు. అయితే, కాలం మారింది. టికెట్ కొనుగోలులో అనేక మార్పులు వచ్చాయి. థియేటర్‌కి వెళ్లకుండా ఫోన్లో టికెట్లు బుక్ చేసుకుంటున్నారు. కావాల్సిన సీటును ఎంచుకుని టికోట్టు కొనుక్కుంటే పని తేలిక. షో ప్రారంభానికి 5 నిమిషాల ముందు థియేటర్లోకి ప్రవేశిస్తే హాయిగా కూర్చుని నచ్చిన సినిమా చూసుకోవచ్చు. కానీ కొన్నిసార్లు పలు కారణాల వల్ల మనం బుక్ చేసుకున్న టికెట్‌ను రద్దు చేయాల్సి వస్తుంది. అప్పుడు టికెట్ కోసం ఖర్చు చేసిన డబ్బు గురించి ఆలోచిస్తాం. ఈ విషయంలో చాలామంది టెన్షన్ పడతారు. అంత డబ్బు చెల్లించి టికెట్ బుక్ చేసుకున్నామంటే వృధా అని అనుకుంటున్నారు. కానీ చింతించకండి. ఎందుకంటే, మీరు సులభంగా టికెట్‌ను రద్దు చేసుకోవచ్చు అంతే కాకుండా ఆ డబ్బును కూడా తిరిగి పొందవచ్చు. BookMyShowలో టికెట్‌ను రద్దు చేయడానికి: ► మీ మొబైల్లో 'BookMyShow' యాప్‌ని ఓపెన్ చేయండి.. ► మీరు లాగ్ అవుట్ అయితే లాగిన్ అయి యాప్‌ని ఓపెన్ చేయండి.. ► ప్రొఫైల్ ఐకాన్‌పై క్లిక్ చేయండి.. ► Your Orders అనే ఆప్షన్‌పై క్లిక్ చేయండి.. ► మీరు బుక్ చేసుకున్న టికెట్ స్క్రీన్‌పై కనిపిస్తుంది.. లిస్ట్ వస్తుంది. ► సినిమాని చూడటానికి మీరు బుక్ చేసిన టిక్కెట్‌ను ఎంచుకోండి. ► ఆపై బుకింగ్ ఎంపికను రద్దు చేయి అని వస్తుంది అక్కడ క్లిక్ చేయండి. ► స్క్రీన్‌పై క్రిందికి స్క్రోల్ చేయండి ► రీఫండ్ చెల్లింపు పద్ధతిని ఎంచుకోండి. ► వాపసు పొందండి అని వస్తుంది. అక్కడ క్లిక్ చేయండి. 'బుక్‌మైషో' అధికారిక వెబ్సైట్లో టికెట్‌ను ఎలా రద్దు చేయాలి? బుక్‌మైషో ద్వారా టికెట్లను కొందరు మొబైల్ యాప్‌ను ఉపయోగించి చేస్తే.. మరికొందరు మాత్రం సినిమా టికెట్లను బుక్ చేసుకోవడానికి బుక్ మై షో అధికారిక వెబ్‌సైట్‌ను ఉపయోగిస్తారు. వారు కూడా అధికారిక వెబ్సైట్ నుంచి సినిమా టికెట్‌ను బుక్ చేసినట్లయితే, దానిని రద్దు చేయవచ్చు. ► బుక్ మై షో అధికారిక వెబ్‌సైట్‌ను తెరవండి. ► మీ ఖాతాకు లాగిన్ చేయండి. ► కుడి వైపున మీ ప్రొఫైల్‌ని తెరవండి. ► కొనుగోలు చరిత్రను ఎంచుకోండి. టిక్కెట్‌పై క్లిక్ చేయండి. ► స్క్రీన్‌పైకి స్క్రోల్ చేయండి, రద్దు చేయి నొక్కండి. ► వాపసు చెల్లింపు పద్ధతిని ఎంచుకోండి. ► ధృవీకరించుపై క్లిక్ చేయండి. ► గమనిక : కొన్నిసార్లు ఈ వెబ్సైట్ పనిచేయకపోవచ్చు మీరు సూపర్ స్టార్ కస్టమర్ అయితే టికెట్‌ను ఎలా రద్దు చేయాలి? Bookmyshow యాప్ తన సూపర్ స్టార్ కస్టమర్లకు అదనపు ప్రయోజనాలను అందిస్తుంది. ఒక వ్యక్తి సూపర్ స్టార్ కస్టమర్ అయితే, టికెట్ కోసం చెల్లించిన పూర్తి మొత్తాన్ని వారు పొందుతారు. ఎవరైనా కస్టమర్ బుక్ మై షో నుంచి 1 సంవత్సరం లోపు 10 కంటే ఎక్కువ టిక్కెట్లు బుక్ చేసినట్లయితే, అతన్ని 'సూపర్ స్టార్ కస్టమర్' అంటారు. అయితే ఈ సూపర్ స్టార్ కస్టమర్ తన టికెట్‌ను ఎలా రద్దు చేయగలడు? పూర్తి వాపసు ఎలా పొందాలో తెలుసుకోండి. ► BookMyShow యాప్‌ను తెరవండి. ► మీ ప్రొఫైల్‌కి వెళ్లండి ఆపై మీ టికెట్ ఆర్డర్ల ఎంపికపై క్లిక్ చేయండి. ► టిక్కెట్‌ను ఎంచుకోండి. ► సూపర్‌స్టార్ రద్దుపై క్లిక్ చేయండి. ► అసలు చెల్లింపు పద్ధతిని ఎంచుకోండి. ► వాపసు పొందండిపై క్లిక్ చేయండి. ► మీ టికెట్ రద్దును నిర్ధారించండి. అంతటితో మీ డబ్బు బ్యాంకు ఖాతాలోకి జమ అవుతుంది. BookMyShow టికెట్ రద్దు నియమాలు BookMyShow టికెట్‌ను రద్దు చేయడానికి కొన్ని నియమాలు ఉన్నాయి. మనం వాటికి లోబడి క్యాన్సల్ చేయగలుగుతాం. మీరు వారు ఇచ్చిన నియమాలను పాటించి.. టికెట్లను సులభంగా రద్దు చేసి డబ్బును తిరిగి పొందవచ్చు.బుక్ మై షోలో టికెట్ క్యాన్సిల్ చేసుకోవాలంటే సినిమా స్టార్ట్ అయ్యే 4 గంటల ముందు చేయాలి.. తర్వాత టికెట్ క్యాన్సిల్ చేయలేరు. మీరు సరైన సమయంలో టిక్కెట్‌ను రద్దు చేయకుంటే డబ్బులో 30% తీసివేయబడుతుంది. మిగిలిన మొత్తం మీకు లభిస్తుంది. మీరు రీఫండ్ చెల్లింపు కోసం క్రెడిట్/డెబిట్ కార్డ్ లేదా నెట్-బ్యాకింగ్ పద్ధతిని ఎంచుకున్నట్లయితే, దానికి 7 నుంచి 10 రోజుల సమయం పడుతుంది. చెల్లింపు మీ ఖాతాలో జమ చేయబడుతుంది. అదే బుక్‌మై షో వాలెట్‌కు కావాలని రిక్వెస్ట్ పెడితే కొన్ని గంటల్లోనే వాలెట్‌లోకి డబ్బు జమ అవుతుంది. -
కౌంటర్ టికెట్లకూ ఆన్లైన్ రద్దు సదుపాయం
సాక్షి, హైదరాబాద్: వెయిటింగ్ లిస్టు ప్రయాణికులు టికెట్ రీఫండ్ కోసం ఇక రిజర్వేషన్ కౌంటర్లకు వెళ్లవలసిన అవసరం లేదు. ఐఆర్సీటీసీ వెబ్సైట్ ద్వారా టికెట్ రీఫండ్ కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. సాధారణంగా ఆన్లైన్లో టికెట్లు బుక్ చేసుకొన్న ప్రయాణికులకు మాత్రమే తిరిగి ఆన్లైన్ ద్వారా రీఫండ్ చేసుకొనే సౌలభ్యం ఉంది. ఇటీవల ఆ సదుపాయాన్ని కౌంటర్ టికెట్లకు సైతం విస్తరించారు. రైల్వే రిజర్వేషన్ కేంద్రాల్లో టికెట్ తీసుకొన్నా తమ సీటు నిర్ధారణ కాక వెయిటింగ్ లిస్టులో ఉంటే ప్రయాణికులు రిజర్వేషన్ కార్యాలయాల్లోనే రీఫండ్‌కు దరఖాస్తు చేసుకోవలసి ఉండేది. కానీ 15 శాతం మంది అలా వెళ్లలేకపోతున్నట్లు అంచనా. సకాలంలో వెళ్లలేక చాలామంది టికెట్ డబ్బును నష్టపోవలసి వస్తోంది. దీన్ని నివారించేందుకు రైల్వేశాఖ కౌంటర్ టికెట్లకు సైతం ఆన్లైన్ రీఫండ్ సదుపాయాన్ని అందుబాటులోకి తెచి్చంది. అరగంట ముందు చాలు... ఐఆర్సీటీసీ ద్వారా రిజర్వేషన్ బుక్ చేసుకొనే వెయిటింగ్ లిస్టు ప్రయాణికులు తమ ప్రయాణం నిర్ధారణ కాని పక్షంలో రైలు బయలుదేరే సమయానికి అరగంట ముందు వరకు కూడా టికెట్లు రద్దు చేసుకోవచ్చు. డబ్బులు ఆటోమేటిక్‌గా వారి ఖాతాలో చేరిపోతాయి. కానీ కౌంటర్ టికెట్లకు ఆ అవకాశం లేదు. తాజా మార్పుతో కౌంటర్లో టికెట్లు తీసుకున్న వాళ్లూ ఆన్లైన్ రీఫండ్ చేసుకోవచ్చు. రైలు సమయానికి అరగంట ముందు కూడా రద్దు చేసుకోవచ్చు. కానీ టికెట్ డబ్బులు తీసుకొనేందుకు మాత్రం రైలు బయలుదేరిన నాలుగు గంటలలోపు రిజర్వేషన్ కౌంటర్‌కు వెళ్లవలసి ఉంటుంది. ‘ఇది ప్రయాణికులకు ఎంతో ఊరట. రిజర్వేషన్ నిర్ధారణ అవుతుందని రైలు బయలుదేరే వరకూ ఎదురు చూసేవాళ్లు చివరి నిమిషంలో కౌంటర్లకు వెళ్లి టికెట్ రద్దు చేసుకోలేకపోతున్నారు. అలాంటి వారికిది చక్కటి అవకాశం’ అని దక్షిణమధ్య రైల్వే ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. 30 శాతం కౌంటర్ టికెట్లు ► ప్రతి ట్రైన్లో 30 శాతం వరకు వెయిటింగ్ లిస్టు టికెట్లను ఇవ్వొచ్చు.18 నుంచి 24 బోగీలు ఉన్న రైళ్లలో స్లీపర్, ఏసీ బోగీల సంఖ్య మేరకు 300 వరకు వెయిటింగ్ లిస్టు టికెట్లను ఇస్తారు. కానీ చాలా సందర్భాల్లో 400 వరకూ వెయిటింగ్ లిస్టు జాబితా పెరిగిపోతుంది. ► 70 శాతం మంది ప్రయాణికులు ఐఆర్సీటీసీ వెబ్సైట్ ద్వారానే టికెట్లు బుక్ చేసుకుంటున్నారు. 30 శాతం మంది మాత్రమే కౌంటర్ల వద్దకు వెళ్తున్నారు. చదవండి: నేతన్నల బీమాకు వీడిన చిక్కు -
ఆ టిక్కెట్లన్నీ రద్దు: రైల్వే శాఖ
న్యూఢిల్లీ: లాక్‌డౌన్‌కు ముందు తీసుకున్న అడ్వాన్స్ టిక్కెట్లు అన్నీ రద్దవుతాయని రైల్వే మంత్రిత్వ శాఖ ప్రకటించింది. జూన్ 30 వరకు ప్రయాణానికి తీసుకున్న టిక్కెట్లన్నీ రద్దవుతాయని తెలిపింది. జూన్ 30 లేదా అంతకుముందు ప్రయాణానికి మార్చి 25 లోపు బుక్ చేసుకున్న అన్ని రైలు టిక్కెట్లు రద్దు అవుతాయని, వినియోగదారులకు పూర్తి నగదు వాపసు ఇవ్వనున్నట్లు వివరించింది. ప్రత్యేక రైళ్లకు మినహా మిగిలిన అన్ని రైళ్ల రిజర్వేషన్లు జూన్ 30 వరకు రద్దు చేసినట్టు రైల్వేశాఖ వెల్లడించింది. ఆన్లైన్, కౌంటర్లలో రిజర్వేషన్ చేయిస్తే ఛార్జీలు తిరిగి చెల్లించనుంది. ఆన్లైన్లో చెల్లిస్తే ప్రయాణికుల ఖాతాకు జమ చేస్తున్నట్లు రైల్వేశాఖ తెలిపింది. కౌంటర్లలో రిజర్వేషన్లు చేయించినవారికి ప్రత్యేక సదుపాయం ద్వారా ఆన్లైన్లో చెల్లించాలని రైల్వేశాఖ నిర్ణయించింది. ఈ నెల 12 నుంచి మొదలైన ప్రత్యేక రైళ్లు కొనసాగుతాయని స్పష్టం చేసింది. కరోనా వైరస్ వ్యాప్తి కట్టడికి దేశవ్యాప్తంగా లాక్డౌన్ ప్రకటించడంతో ప్రయాణికుల రైళ్లను నిలిపివేసిన సంగతి తెలిసిందే. తాజాగా రైళ్ల సర్వీసులను పునరుద్ధరించి పరిమిత సంఖ్యలో రాజధాని ప్రత్యేక ఎక్స్‌ప్రెస్‌లను నడుపుతున్నారు. వలస కార్మికుల తరలింపు శ్రామిక్ ప్రత్యేక రైళ్లు ఏర్పాటు చేశారు. (ఆ రైళ్లను ఎక్కువ చోట్ల ఆపండి..) ప్రత్యేక రైళ్లకూ వెయిటింగ్ లిస్టు మే 22 నుంచి ప్రారంభం కానున్న ప్రత్యేక రైళ్లలో వెయిటింగ్ లిస్టును చేరుస్తూ రైల్వే బోర్డు ప్రకటన విడుదల చేసింది. ఇవి కేవలం ఆ రైళ్లకే గాక, తర్వాత నడపనున్న రైళ్లకూ వర్తించే అవకాశం కనిపిస్తోంది. ఏసీ 3–టైర్‌కు 100, ఏసీ 2–టైర్‌కు 50, స్లీపర్ క్లాస్‌కు 100, చైర్ కార్కు 100, ఫస్ట్ క్లాస్ ఏసీతో పాటు ఎగ్జిక్యూటివ్ క్లాస్‌కు 20 చొప్పున వెయిటింగ్ లిస్టును కేటాయించింది. మే 15 నుంచి బుక్ చేసుకున్న వారికి ఇవి వర్తిస్తాయి. ప్రస్తుతం నడుపుతున్న ఎయిర్ కండీషన్డ్ రైళ్లనే గాక, ఇతర రైళ్ళను నడిపే ఆలోచనలో రైల్వే బోర్డు ఉంది. (రైలు దిగగానే.. స్టాంప్ వేసేశారు!) -
కరోనా: రైళ్లు రద్దు.. డబ్బు వాపస్!
న్యూఢిల్లీ: దేశంలో కోవిడ్-19 (కరోనా వైరస్) సోకినవారి సంఖ్య క్రమక్రమంగా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో ప్రజలు ప్రయాణాలు చేస్తూ గుంపులు గుంపులుగా తిరగకుండా, సామాజిక దూరం పాటించే విధంగా భారత రైల్వేశాఖ పలు రైళ్లను రద్దు చేసిన విషయం తెలిసిందే. అయితే మార్చి 21 నుంచి ఏప్రిల్ 15 మధ్య రద్దు చేసిన రైళ్లలో ప్రయాణికులు బుక్ చేసుకున్న రైలు టికెట్ల డబ్బును 100 శాతం ప్రయాణికులకు రీఫండ్ చేయనున్నట్లు ఇండియన్ రైల్వే ప్రకటించింది. ఇక భారత రైల్వే పీఆర్ఎస్ (ప్యాసింజర్ రిజర్వేషన్ సిస్టమ్) కౌంటర్ ఇచ్చే టికెట్ల నిబంధనలను సడలించింది. ఆన్లైన్లో టికెట్లు బుక్ చేసుకున్న వారికి ఆయా వ్యాలెట్లు, అకౌంట్లలో డబ్బు రీఫండ్ అవుతుందని ఇండియన్ రైల్వే తెలిపింది. (కార్మికుల కడుపుకొడుతున్న కరోనా) ఈ- టికెట్ కోసం అన్ని నియమాలు ఒకే విధంగా ఉంటాయని, ప్రయాణికులు టికెట్ వాపసు కోసం స్టేషన్‌కు రావాల్సిన అవసరం లేదని తెలిపింది. కాగా దేశవ్యాప్తంగా ఆదివారం ఎక్కడి రైళ్లు అక్కడే నిలిచిపోనున్నాయి. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ‘జనతా కర్ఫ్యూ’ పాటించాలంటూ పిలుపునిచ్చిన నేపథ్యంలో ఆదివారం ఉదయం 7 నుంచి రాత్రి 9 వరకు పలు రైళ్లు నిలిచిపోనున్నాయి. ఇక ముంబై, ఢిల్లీ, కోల్‌కతా, చెన్నై, సికింద్రాబాద్ పరిధిలోని సబ్ అర్బన్ సర్వీసులు (లోకల్ ట్రైన్స్) సంఖ్యను కూడా తగ్గించనున్నారు. చాలా తక్కువ సంఖ్యలో రైళ్లను నడపనున్నారు. కరోనా వైరస్ నియంత్రణలో భాగంగా ఇప్పటివరకు రద్దు చేసిన మొత్తం రైళ్ల సంఖ్య 245కి చేరింది. (యూపీ సీఎం కీలక నిర్ణయం, 35లక్షల మందికి లబ్ధి) చదవండి: భారత్‌లో 271కి చేరిన కరోనా బాధితుల సంఖ్య -
కౌంటర్ వద్ద తీసుకున్న టిక్కెట్లను క్యాన్సిల్ చేయడమెలా?
న్యూఢిల్లీ : దేశీయ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్(ఐఆర్సీటీసీ) టిక్కెట్లను రద్దు చేసుకోవడంలో మరో సరికొత్త సౌకర్యాన్ని కల్పిస్తోంది. కౌంటర్స్ వద్ద ఆన్లైన్లో కొనుగోలు చేసిన టిక్కెట్లను రద్దు చేసుకునే సౌకర్యాన్ని కూడా ఐఆర్సీటీసీలో తన ప్రయాణికులకు అందిస్తుంది. ఐఆర్సీటీసీ వెబ్సైట్ లేదా యాప్ ద్వారా టిక్కెట్లను బుక్ చేసుకున్న వారికి, ఇప్పటికే ఈ ప్రాసెస్ ఎలా ఉంటుందో తెలిసిందే ఉంటుంది. కానీ కౌంటర్స్ వద్ద ఆన్లైన్లో టిక్కెట్లను బుక్ చేసుకునే వారికి దీనిపై ఎద్ద అవగాహన ఉండదు. అంతకముందు కౌంటర్లో తీసుకున్న టిక్కెట్లను రద్దు చేసుకోవాలంటే, తిరిగి కౌంటర్‌కే వెళ్లేవారు. ప్రస్తుత ప్రక్రియను ఐఆర్సీటీసీ ద్వారా కూడా అందిస్తున్నారు. అది ఎలానో ఓ సారి చూడండి.... ఐఆర్సీటీసీ వెబ్‌సైట్‌కు వెళ్లాలి. ఆ సైట్లో ట్రైన్స్ సెక్షన్ కింద ఉన్న క్యాన్సిల్ టిక్కెట్‌ను క్లిక్ చేయాలి. దానిలో కౌంటర్ టిక్కెట్ ఆప్షన్‌ను ఎంపిక చేసుకోవాలి. పీఎన్ఆర్ నెంబర్, ట్రైన్ నెంబర్, పేజీలో చూపించే క్యాప్చాను నమోదు చేయాలి. ‘క్యాన్సిలేషన్ లేదా బోర్డింగ్ పాయింట్ మార్పు ప్రక్రియను చదివాను’ అనే మెసేజ్ కనిపిస్తున్న బాక్స్‌ను చెక్ చేసుకోవాలి. ఆ అనంతరం ‘సబ్మిట్’ బటన్ నొక్కాలి. ఒక్కసారి ‘సబ్మిట్’ బటన్‌ను క్లిక్ చేసిన తర్వాత, బుకింగ్ సమయంలో మీరిచ్చిన మొబైల్ నెంబర్‌కు ఓటీపీ వస్తుంది. క్యాన్సిలేషన్ కోసం ఈ ఓటీపీని నమోదు చేయాలి. ఓటీపీ వాలిడేట్ అయితే, స్క్రీన్‌పై పీఎన్ఆర్ వివరాలు కనిపిస్తాయి. అన్ని వివరాలను వెరిఫై చేసుకున్నాక, ‘క్యాన్సిల్ టిక్కెట్’ అనే దానిపై క్లిక్ చేయాలి. స్క్రీన్‌పై చూపించిన మొత్తం రీఫండ్ అవుతుంది. మీరు రిజిస్ట్రర్ చేసిన మొబైల్ నెంబర్‌కు ఎస్ఎంఎస్, పీఎన్ఆర్ నెంబర్, రీఫండ్ వివరాలను మెసేజ్ ద్వారా ఐఆర్సీటీసీ పంపుతోంది. కౌంటర్ వద్ద తీసుకున్న టిక్కెట్‌ను రద్దు చేసుకోవాలంటే పాటించాల్సిన నిబంధనలు : బుకింగ్ సమయంలో వాలిడ్ మొబైల్ నెంబర్ ఇచ్చిన వారికే ఇది అందుబాటు. సాధారణ పరిస్థితులలో మాత్రమే పిఆర్ఎస్ కౌంటర్ టిక్కెట్ల కోసం టిక్కెట్ల రద్దు, ఛార్జీల వాపసును అనుమతిస్తుంది. టిక్కెట్ పూర్తిగా ధృవీకరణ అయ్యాక, ఆన్‌లైన్‌గా రద్దు చేపట్టాలంటే, రైలు ప్రారంభం కావాడానికి కంటే 4 గంటల ముందు మాత్రమే అనుమతిస్తుంది. ఆర్ఏసీ లేదా వెయిట్‌లిస్ట్ వారు 30 నిమిషాల ముందు ఆన్లైన్ క్యాన్సిలేషన్ చేపట్టుకోవచ్చు. -
టిక్కెట్ క్యాన్సిలేషన్‌తో రూ.1,407 కోట్లు
-
టిక్కెట్ క్యాన్సిలేషన్‌తో రూ.1,407 కోట్లు
ఇండోర్ : రిజర్వ్ చేసుకున్న టిక్కెట్ల క్యాన్సిలేషన్‌తో భారత రైల్వే భారీగా ఆదాయాలు ఆర్జించింది. 2016-17 ఆర్థిక సంవత్సరంలో టిక్కెట్ల క్యాన్సిలేషన్ ద్వారా రూ.1,407 కోట్ల ఆదాయాలు ఆర్జించినట్టు రైల్వే పేర్కొంది. గతేడాది కంటే ఇది 25.29 శాతం అధికమని తెలిపింది. ఆర్టీఐ కింద కార్యకర్త చంద్రశేఖర్ గౌడ్ కోరిన సమాచారం మేరకు సెంట్రల్ ఫర్ రైల్వే ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్(సీఆర్ఐఎస్) ఈ వివరాలను వెల్లడించింది. గౌడ్‌కు ఇచ్చిన సమాధానంలో.... 2016-17 ఆర్థికసంవత్సరంలో టిక్కెట్ క్యాన్సిలేషన ద్వారా రూ.14.07 బిలియన్ల ఆదాయాలను పొందామని సీఆర్ఐఎస్ పేర్కొంది. అంతేకాక 2015-16లో ఇవి రూ.11.23 బిలియన్లుగా ఉన్నట్టు కూడా తెలిపింది. ఈ సమాచారమంతా ప్యాసెంజర్ రిజర్వేషన్ సిస్టమ్ కింద తనకు అందించిందని గౌడ్ పీటీఐకి చెప్పారు. కేవలం రిజర్వు చేసుకున్న టిక్కెట్ల క్యాన్సిలేషన్ ద్వారా మాత్రమే కాక, రిజర్వు కాని టిక్కెట్ల క్యాన్సిలేషన్‌తో కూడా రైల్వే ఆదాయాలను ఆర్జిస్తుంది. అన్‌రిజర్వుడ్ టిక్కెటింగ్ సిస్టమ్(యూటీఎస్) ద్వారా 2016-17లో రూ.17.87 కోట్లను పొందినట్టు ఆర్టీఐ సమాధానంలో తెలిపింది. ఈ మొత్తం 2015-16లో రూ.17.23 కోట్లు, 2014-15లో రూ.14.72 కోట్లు ఉంది. రైల్వే ప్యాసెంజర్ నిబంధనలు 2015 కింద అదే ఏడాది నవంబర్‌లో క్యాన్సిలేషన్ టిక్కెట్ల మొత్తాన్ని రీఫండ్ చేసే నిబంధనల్లో మార్పులు తీసుకొచ్చారు. క్యాన్సిలేషన్ ఫీజులను రెండు సార్లు పెంచారు. ప్రయాణికుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని రైల్వే, రీఫండ్ రూల్స్‌ను మార్చాలని గౌడ్ పేర్కొన్నారు. -
రైల్వేలో చార్జీల దోపిడీ
ఆన్లైన్ టిక్కెట్ రద్దులో భారీగా బాదుడు వెయిటింగ్ లిస్ట్ టికెట్ రద్దు చేసినా రూ.60 వడ్డింపు సాక్షి, అమరావతి: దేశంలో అత్యధిక మందికి అనుకూలమైన, చౌకైన రవాణా వ్యవస్థ రైల్వే మాత్రమే. కానీ రైల్వేలో మాత్రం సర్వీసు చార్జీ, రిజర్వేషన్ చార్జీలంటూ ప్రయాణికులపై పెనుభారం మోపుతున్నారు. సాధారణంగా రిజర్వేషన్ సమయంలోనే ప్రయాణికుడి నుంచి అదనంగా రూ.20 వసూలు చేస్తారు. ఆ టికెట్ కన్ఫర్మ్ కాకపోయినా రైల్వే శాఖ ప్రయాణికులపై అదనపు భారం వేస్తోంది. ఆన్లైన్లో బుక్ చేసుకున్న టికెట్లు, ఐఆర్సీటీసీ అనుబంధ ప్రైవేటు కౌంటర్లలో కొన్న టికెట్లు కన్ఫర్మ్ కాకపోతే.. వాటిని ఐఆర్సీటీసీ వెబ్సైట్ ద్వారా మాత్రమే రద్దు చేసుకోవాల్సి ఉంటుంది. వెయిటింగ్ లిస్టు చూపుతున్న టికెట్ ఆటోమేటిక్‌గా రద్దవుతుందని రైల్వే అధికారులు పేర్కొంటున్నారు. రద్దయిన టికెట్ మొత్తం సొమ్ము వాపసు చేయకుండా రూ.60 నుంచి రూ.80 వరకు కట్ చేసి ఇస్తున్నారు. ఐఆర్సీటీసీ ద్వారా బుక్ చేసే టికెట్లపై సర్వీస్ చార్జీ ఎత్తేస్తామని ఇటీవలే కేంద్ర బడ్జెట్లో పేర్కొ న్నారు. అది ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వస్తుందని రైల్వే వర్గాలు చెబుతున్నాయి. టీడీఆర్ ఫైల్ చేస్తే ఖాతాలోకి టికెట్ సొమ్ము.. ఆన్లైన్ టికెట్ ఆర్ఏసీలో ఉన్నప్పుడు.. రద్దు చేసుకోవాలనుకుంటే ఐఆర్సీటీసీ వెబ్సైట్లో ‘టికెట్ డిపాజిట్ రిసీట్’ ఫైల్ చేయాల్సి ఉంటుంది. రైలు ప్రారంభానికి 4 గంటల ముందు చార్ట్ ప్రిపేర్ అవుతోంది. ఆ లోపు టీడీ ఆర్ పూర్తిచేస్తే మన బ్యాంకు ఖాతాకు టికెట్ సొమ్ము వచ్చేస్తుంది. ‘వెయిటింగ్ లిస్టులోని టికెట్ కన్ఫర్మ్ అయితే రిజిస్టర్డ్ మొబైల్‌కు ఎస్ఎంఎస్ వస్తుంది. కన్ఫర్మ్ అయిన టికెట్‌ను చార్ట్‌ప్రిపేర్ అయ్యాక రద్దు చేసుకోవాలనుకుంటే.. పైసా కూడా వెనక్కి రాదు’’ అని దక్షిణ మధ్య రైల్వే అధికారి ఒకరు వివరించారు. -
రైల్వే టికెట్ రద్దుకు ప్రత్యేక కౌంటర్
టికెట్ రద్దు, నగదు తిరిగి పొందడం కోసం అన్ని స్టేషన్లలో ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేయనున్నట్లు మంగళవారం రైల్వే శాఖ పేర్కొంది. ప్రయాణికులకు మరింత చేరువ కావడంలో భాగంగా ఈ వసతిని కల్పించాలని నిర్ణయించినట్లు తెలిపింది. ప్రస్తుతం ఉన్న రిజర్వేషన్ కౌంటర్లలో కొన్నింటిని యూటీఎస్(అన్‌రిజర్వుడ్ టికెటింగ్ సిస్టమ్) కమ్ పీఆర్ఎస్(ప్యాసింజర్ రిజర్వేషన్ సిస్టమ్)లకు కేటాయించనున్నట్లు అధికారులు పేర్కొన్నారు. నేటి నుంచి ఇది అమల్లోకి వస్తుందని, రైలు బయలుదేరడానికి 24 గంటల ముందు వరకు మాత్రమే టికెట్ రద్దు చేసుకునే అవకాశం ఉంటుందని చెప్పారు. -
టికెట్ రద్దు.. ‘డబుల్’ భారం
రద్దు చార్జీలు రెట్టింపు చేసిన రైల్వే ఈ నెల 12 నుంచి కొత్త నిబంధనలు సాక్షి, హైదరాబాద్/న్యూఢిల్లీ: టికెట్ రద్దు చేసుకొనే ప్రయాణికులపై రైల్వేశాఖ భారాన్ని పెంచింది. ఇప్పటి వరకు ఉన్న చార్జీలను రెట్టింపు చేసింది. పెంచిన టికెట్ రద్దు(రీఫండింగ్)చార్జీలు ఈ నెల 12 నుంచి అమల్లోకి రానున్నాయి. వెయిటింగ్ లిస్టు ప్రయాణికులు, ఆర్ఏసీ ప్రయాణికులు ఇప్పటి వరకు బుకింగ్ కౌంటర్లలో టికెట్ రద్దు కోసం రూ.చెల్లిస్తున్న రూ.30ల రుసుము ఇక నుంచి రూ.60కి పెరగనుంది. అలాగే వివిధ తరగతుల కోసం బుక్ చేసుకున్న నిర్ధారిత(కన్ఫర్మ్డ్) టికెట్ రీఫండింగ్ చార్జీలు కూడా రెట్టింపు కానున్నాయి. ప్రస్తుతం నిర్ధారిత టికెట్లపైన ట్రైన్ బయలుదేరడానికి 6 గంటల ముందు, బయలుదేరిన తరువాత 2 గంటలలోపు టికెట్ రద్దు చేసుకొంటే 50 శాతం డబ్బులు తిరిగి చెల్లించే సదుపాయం ఉండేది. ఇక నుంచి బండి బయలుదేరడానికి 12 గంటల నుంచి 4 గంటల ముందు టికెట్లు రద్దు చేసుకున్న ప్రయాణికులకు మాత్రమే ఈ 50 శాతం సొమ్ము తిరిగి చెల్లిస్తారు. అంటే ట్రైన్ బయలుదేరిన తరువాత కూడా టికెట్ రద్దు చేసుకొనే సదుపాయం ఇక ఉండబోదు. రైలు బయలుదేరడానికి 4 గంటలు ముందే టికెట్లు రద్దు చేసుకోవాలన్న నిబంధన వల్ల మిగిలిన బెర్తులను వెయిటింగ్ లిస్టు ప్రయాణికులకు కేటాయించేందుకు అవకాశం ఉంటుందని దక్షిణ మధ్య రైల్వే ఉన్నతాధికారి ఒకరు ‘సాక్షి’తో చెప్పారు. 48 గంటల ముందు రద్దు చేసుకునేవారికి రీఫండింగ్ చార్జీల్లో మార్పులు ఇలా ఉంటాయి. ఇప్పటి వరకు నిర్ధారిత ఫస్ట్ ఏసీ టికెట్ రీఫండింగ్ చార్జీ రూ.120 ఉండగా, ఇక నుంచి రూ.240కి పెరగనుంది. సెకెండ్ ఏసీ చార్జీ.. రూ.100 నుంచి రూ.200లకు, థర్డ్‌ఏసీ చార్జీ.. రూ.90 నుంచి రూ.180 కి పెరుగుతుంది. హా స్లీపర్ క్లాస్.. రూ.60 నుంచి రూ.120కి, సెకెండ్ క్లాస్.. రూ.30 నుంచి రూ.60 కి పెరుగుతాయి. ఒకే టికెట్‌పైన ఎక్కువ మంది ప్రయాణికులు బుక్ చేసుకున్నప్పుడు కొందరికి బెర్తులు లభించి, మరి కొందరు వెయిటింగ్ లిస్టులో ఉండే పాక్షిక నిర్ధారిత టికెట్లను రద్దు చేసుకొనేందుకు ప్రస్తుతం ట్రైన్ బయలుదేరిన తరువాత 2 గంటల వరకు గడువు ఉండేది. ఇక నుంచి ట్రైన్ బయలుదేరిన 30 నిమిషాల్లోపు మాత్రమే పాక్షిక నిర్ధారిత టికెట్లు రద్దు చేసుకొనేందుకు అవకాశం ఉంటుంది. ఈ-టిక్కెట్ల రద్దు కోసం ఇప్పటి వరకు ట్రావెల్ డిపాజిట్ రిసీట్(టీడీఆర్)లను అందజేయవలసి ఉండేది. ఇక నుంచి టీడీఆర్ అవసరం లేకుండా.. ఆటోమేటిక్‌గా రద్దవుతాయి. -
17న రైల్వే సేవలకు అంతరాయం
సాక్షి, హైదరాబాద్: ఐఆర్సీటీసీ ద్వారా రైల్వే టికెట్ రిజర్వేషన్, టికెట్ల రద్దు, 139 నంబర్ ద్వారా విచారణ... తదితర కార్యకలాపాలు ఈనెల 17న (ఆదివారం) ఏడు గంటల పాటు నిలిచిపోనున్నాయి. సాంకేతికపరంగా అనుకోని అవాంతరాలు ఎదురైతే ప్రత్యామ్నాయాలు ఏమేరకు పనిచేస్తాయో తెలుసుకునే క్రమంలో రైల్వే అధికారులు ఈ సేవలను నిలుపు చేయబోతున్నారు. ఆదివారం మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ప్యాసింజర్ రిజర్వేషన్ సిస్టం (పీఆర్ఎస్)ను నిలిపివేయనున్నట్టు అధికారులు తెలిపారు. ‘డిజాస్టర్ రికవరీ డ్రిల్’ పేరుతో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. పీఆర్ఎస్ ప్రధాన సర్వర్ చెన్నైలో ఉంది. దాని ఆధారంగానే దక్షిణ మధ్య రైల్వేలో ఈ-టికెటింగ్, రైల్వే చార్టుల తయారీ, టికెట్ల రద్దు, టికెట్ మొత్తం చెల్లింపు, 139 నంబర్ ద్వారా విచారణ.. తదితరాలన్నీ జరుగుతున్నాయి. దీనికి ప్రత్యామ్నాయంగా మరో వ్యవస్థ కూడా దక్షిణ మధ్య రైల్వేకు అందుబాటులో ఉంది. ఏదైనా భారీ సాంకేతిక సమస్య తలెత్తి చెన్నై సర్వర్ సేవలు నిలిచిపోతే, ప్రత్యామ్నాయ వ్యవస్థ ఏ మేరకు పనిచేస్తుందో పరిశీలించాలని రైల్వే ఉన్నతాధికారులు నిర్ణయించారు. ఇందులో భాగంగా చెన్నై సర్వర్‌ను షట్ డౌన్ చేయనున్నారు. ప్రత్యామ్నాయ వ్యవస్థలో లోపాలున్నట్టు తేలితే వెంటనే దాన్ని మెరుగుపరిచేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులు ప్రణాళికలు రూపొందించారు. ఇందుకోసం ఆదివారం డ్రిల్ నిర్వహిస్తున్నట్టు దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్ఓ సాంబశివరావు ఓ ప్రకటనలో తెలిపారు. అయితే దీనివల్ల ప్రయాణికులకు ఇబ్బందులు తలెత్తకుండా అన్ని రకాల ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసినట్టు వెల్లడించారు. ఐఆర్సీటీసీ వెబ్సైట్ ద్వారా అందే సేవలు నిలిచిపోయినా... రైల్వే స్టేషన్లలో మాన్యువల్ కౌంటర్ల ద్వారా టికెట్ల జారీ కొనసాగుతుందని, అవసరమైన చోట్ల అదనపు కౌంటర్లు ఏర్పాటు చేసి టికెట్లు జారీ చేస్తామని పేర్కొన్నారు. టికెట్ల రద్దు, డబ్బులు తిరిగి ఇవ్వటం లాంటివి కూడా ఇక్కడ అందుబాటులో ఉంటాయని తెలిపారు. ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించే క్రమంలోనే ఇది జరుగుతున్నందున దీనికి సహకరించాలని కోరారు.