అవినీతికి సంబంధించి రైల్వే శాఖ నుంచి అత్యధిక ఫిర్యాదులు వచ్చినట్లు సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ తెలిపింది.
అవినీతికి సంబంధించి రైల్వే శాఖ నుంచి అత్యధిక ఫిర్యాదులు వచ్చినట్లు సీవీసీ (సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ ) తెలిపింది. 2015కు సంబంధించి రైల్వే శాఖ నుంచి మొత్తం 12,394 ఫిర్యాదులు వచ్చాయని, 5,363 ఫిర్యాదులతో బ్యాంకు అధికారులకు వ్యతిరేకంగా వచ్చాయి. 5,139 ఫిర్యాదులతో గవర్నమెంట్ ఆఫ్ నేషనల్ కాపిటల్ టెర్రిటరీ ఆఫ్ ఢిల్లీ మూడో స్థానంలో నిలిచింది. ఇటీవల పార్లమెంట్ సమావేశాల్లో సమర్పించిన సీవీసీ వార్షిక నివేదికలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. దేశంలో మొత్తం మీద 56,104 ఫిర్యాదులు వచ్చాయి.