యోగి ఆదిత్యనాథ్‌తో శ్రీశ్రీ రవిశంకర్‌ భేటీ | Sri Sri Ravi Shankar meets UP CM Adityanath | Sakshi
Sakshi News home page

యోగి ఆదిత్యనాథ్‌తో శ్రీశ్రీ రవిశంకర్‌ భేటీ

Published Wed, Nov 15 2017 12:07 PM | Last Updated on Wed, Nov 15 2017 12:08 PM

Sri Sri Ravi Shankar meets UP CM Adityanath  - Sakshi

సాక్షి, లక్నో : ఆర్ట్‌ ఆఫ్‌ లివింగ్‌ వ్యవస్థాపకుడు శ్రీశ్రీ రవిశంకర్‌ బుధవారం ఉత్తరప్రదేశ్‌ సీఎం యోగి ఆదిత్యనాథ్‌తో భేటీ అయ్యారు. లక్నోలోని ముఖ్యమంత్రి అధికారిక నివాసం 5కేడీ మార్గ్‌లో ఈ సమావేశం జరిగింది. అయోధ్య రామమందిర వివాదం ఈ సందర్భంగా చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది. రామ జన్మభూమి వివాద పరిష్కారానికి మధ్యవర్తిత్వం చేస్తానంటూ  శ్రీశ్రీ రవిశంకర్‌ స్వయంగా ముందుకొచ్చిన విషయం తెలిసిందే. ఈ మేరకు హోంమంత్రి రాజ్‌నాథ్‌ను కలిసి తన ఆసక్తిని ప్రకటించారు. రవిశంకర్‌ గురువారం అయోధ్యను సందర్శించనున్నారు. ఈ నేపథ్యంలోనే యోగి ఆధిత్యనాథ్‌ను ఆయన మర్యాదపూర్వకంగా కలిశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement