శ్రీనగర్: జమ్ముకశ్మీర్లో సోమవారం భద్రతా బలగాల దాడుల్లో హతమైన ఇద్దరు ఉగ్రవాదుల గురించి పోలీసుల విచారణలో ఆసక్తికరమైన విషయాలు వెల్లడయ్యాయి. వారం రోజుల క్రితమే ఉగ్రవాదులిద్దరు.. విద్యార్థులమంటూ తప్పుడు సమాచారం ఇచ్చి శ్రీనగర్లోని సరాయ్ బాలా ప్రాంతంలో ఓ ఇంటిని అద్దెకు తీసుకున్నారు. వితంతువైన ఆ ఇంటి యజమానురాలు సైతం వారికి సంబంధించిన ఎలాంటి ఆధారాలు చూపించమని కోరకుండానే ఇంటిని అద్దెకు ఇచ్చినట్లు గుర్తించారు.
ఇద్దరు ఉగ్రవాదులు జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థ తరపున పనిచేస్తున్నారు. ఇంటిని అద్దెకు ఇచ్చే ముందు సరైన ఆధారాలు చూసుకొని ఇవ్వాలని, అలాగే ఈ విషయంలో పోలీసుల సహకారం తీసుకోవాలని సెంట్రల్ కశ్మీర్ డీఐజీ గులామ్ హసన్ బట్ తెలిపారు. ఉగ్రవాదులు పాకిస్తాన్ నుంచి వచ్చారని వస్తున్న వార్తలను ఆయన ఖండించారు. సోమవారం శ్రీనగర్ లో జరిగిన ఉగ్రదాడిలో ముగ్గురు పోలీసులు సైతం హతమైన విషయం తెలిసిందే.
విద్యార్థులమని చెప్పి గది అద్దెకు తీసుకొని..
Published Wed, May 25 2016 10:26 AM | Last Updated on Mon, Sep 4 2017 12:55 AM
Advertisement
Advertisement